05.05.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్ గారి గురించి మరికొంత సమాచారమ్ తెలుసుకుందాము
శ్రీ కేశవ్ భగవాన్ గావన్ కర్ - 5 వ.భాగమ్
1964 వ.సంవత్సరంలో డా.అన్నా సాహెబ్ గారు ఆ రోజు తన పనులన్నీ పూర్తయిన
తరువాత నిద్ర పోయారు. ఆయన చాలా గాఢ నిద్రలో
ఉన్నారు. మధ్య రాత్రిలో ఆయనకు నిద్రా భంగమయింది. ఇంకా పూర్తి మెలకువ రాలేదు. ఆయనకి స్పష్టంగా సాయిబాబా గారి మాటలు వినిపించాయి.
“రా, లేచి నా కధలను వ్రాయడం ప్రారంభించు”---డా.అన్నా సాహెబ్ గారికి ఖచ్చితంగా తెలుసు
మాట్లాడిన ఆమాటలు సాయిబాబా గారివేనని.
వెంటనే మంచం మీదనించి లేచారు. మనస్ఫూర్తిగా బాబాను ప్రార్ధించి బాబావారి చరిత్ర వ్రాయడానికి ఉపక్రమించారు. అప్పుడు సమయం చూశారు. అర్ధరాత్రి దాటి 1.30 అయింది. ఆయన వళ్ళు తెలియకుండా ఎంత పరవశంతో రాశారంటే 1.30 కి మొదలు పెడితే ఎక్కడా ఆపకుండా మరునాడు ఉదయం 10 గంటలవరకు రాస్తూనే ఉన్నారు. అంత తక్కువ వ్యవధిలో ఆయన ‘షిర్దీచె సాయిబాబా’ అనే పేరుతో బాబా జీవిత చరిత్ర 21 అధ్యాయాలు రాశారు. సాయిబాబా వారు డా.అన్నా సాహెబ్ గారి చేత సేవ చేయించుకున్నారు. ఇదంతా బాబా అనుగ్రహం వల్లనే ఆయన అటువంటి సేవ చేయగలిగారు. కొంత కాలానికి బాబా జీవిత చరిత్ర వ్రాయడం పూర్తయింది. కాని పుస్తకాన్ని ఎలా ప్రచురించాలా అనే చింత పట్టుకుంది అన్నా సాహెబ్ గారికి. పుస్తక ప్రచురణకు కావలసిన ధనం ఆయన వద్ద లేదు. సాయిబాబా ఇప్పటికీ సజీవ సమాధిలో ఉన్నారు. ఆయన తన భక్తుల ఇబ్బందులను నివారిస్తారు. ఒక రోజున రామన్ లాల్ పటేల్ అనే ఆయన డా.కె.బి.గావన్ కర్ (అన్నా సాహెబ్) గారి దగ్గరకు వచ్చి పుస్తక ప్రచురణ కోసం రూ.4,000/- ఇచ్చారు. ఆ తరువాత చాలా తక్కువ వ్యవధిలోనే పుస్తకాలన్నీ త్వరితంగా అమ్ముడయి ఎంతో మంది భక్తులకి చేరింది. మరాఠీ భాషలో ప్రధమ ముద్రణ 1966 వ. సంవత్సరంలో జరిగింది. 40 సంవత్సరముల తరువాత డా.సాయినాధ్ కేశవ్ గావన్ కర్ గారి నిరంతర శ్రమ వల్ల మరాఠీలో రెండవ ముద్రణ 2006 వ.సంవత్సరంలో జరిగింది. ఆ తరువాతి సంవత్సరాలలో గురజాతీ భాషలోకి కూడా అనువదింపబడింది. డా.కేశవ్ భగవత్ గావన్ కర్ గారు మరాఠీలో రచించిన ఈ బాబా చరిత్ర హిందీ, తెలుగు, కన్నడ భాషలలోకి అనువవదించి, ప్రచురించడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.

1954 వ.సంవత్సరంలో శ్రీసాయిబాబా సంస్థానానికి డా.కేశవ్ భగవంత్ గావన్ కర్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఆ సంవత్సరంలోనే సమాధి మందిరంలో శ్రీసాయి బాబా వారి ***పాలరాతి విగ్రహం ప్రతిష్టింపబడింది.
శ్రీ
సాయిబాబా వారి పాలరాతి విగ్రహ ప్రతిష్టాపన గురించి మంచి ఆసక్తికరమయిన కధ ఒకటుంది. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట ఎవరు చేయాలి అనే విషయం
మీద వాదోపవాదాలు జరిగాయి. ప్రాణ ప్రతిష్ట స్వామి
శరణానందగారి చేత చేయించుదామనుకుంటే ఆయన సన్యాసి.
ఆయనకు అర్హత లేదు. మరి ఎవరి చేత చేయించాలనే
పెద్ద మీమాంస వచ్చింది. అప్పుడు బాబా ముందు
చీటీలు వేశారు. చీటీలో డా.కేశవ్ గావన్ కర్
గారి పేరు వచ్చింది. కాని అప్పటికి డా.గావన్
కర్ గారు, ఆయన కుటుంబం ఇంకా షిరిడీ చేరుకోలేదు.
అందువల్ల దేవ్ సాహెబ్, అతని భార్య వీరి చేత ప్రాణ ప్రతిష్ట చేయించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో డా.కేశవ్ గావన్ కర్, ఆయన కుటుంబం ఇంకా
16 మంది బ్రాహ్మణ పురోహితులు అందరూ బస్సులో ఇంకా షిరిడీకి వస్తూ ఉన్నారు. అనుకోకుండా షాపూర్, కటారా మధ్య అట్ గావ్ గ్రామంలో
బస్సు టైరు పంక్చరయ్యి ఆగిపోయింది.
డ్రైవరు బస్సు దిగి పంక్చరు వేయించడానికి చక్రం ఊడదీసి పట్టుకుళ్ళాడు. ఈ లోగా డా.గావన్ కర్ గారి కుటుంబం, ఇంకా వారితోపాటుగా ప్రయాణిస్తున్న 16 మంది పురోహితులు దగ్గిరలో ఉన్న నదిలోకి స్నానానికి
వెళ్ళారు.
చక్రానికి పంక్చరు సరి చేయించి డ్రైవరు తిరిగి వచ్చి చక్రం బిగించాడు. మరలా బస్సు షిరిడీకి బయలు దేరింది. కాని ఒక పురోహితుడు మాత్రం బస్సు ఎక్కలేదన్న విషయం ఎవరూ గమనించలేదు. ఆ తరువాత ఆ పురోహితుడు ఒక ట్రక్కులో ఎలాగయితేనేం ఒక గంట తరువాత వీరితో కలిశాడు. పురోహితులతో సహా మొత్తం అందరూ సాయంత్రానికి ఆలస్యంగా షిరిడీ చేరుకున్నారు. సరిగ్గా ఆసమయానికే దేవ్ సాహెబ్, ఆయన భార్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయడానికి సిధ్ధంగా ఉన్నారు. డా.గావన్ కర్ గారు కుటుంబంతో సహా రావడం చూసి వారు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.చీటీలో బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం డా.కేశవ్ గావన్ కర్ దంపతులు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. స్వామి శరణానంద సన్యాసి కాబట్టి ప్రాణ ప్రతిష్ట చేసే యోగ్యత లేనందువల్ల ఆయనకు, బాబా విగ్రహానికి ముందు కట్టిన తెరను తెరచే భాగ్యాన్ని కలిగించి, ఆయనను గౌరవించారు.

ఆయన
‘సాయిలీల’ పత్రికకు ఎన్నో సంవత్సరాలు సంపాదకుడిగా పని చేశారు. ఆయన మరాఠీ భాషలో షిరిడి సాయిబాబా గురించి “శిలధి’,
షిర్దిచే సాయిబాబా’, 'సాయిబాబా హాచ్ చమత్కార్’ అనే గ్రంధాలను రచించారు.
(రేపు ఆఖరి భాగమ్)
(రేపు ఆఖరి భాగమ్)
***బాబా వారి పాలరాతి
విగ్రహం తయారీ వెనుక మరొక ఆసక్తికరమయిన కధ ఉంది. సందర్భం వచ్చింది కాబట్టి కొంతమంది
సాయి భక్తులకి తెలియకపోవచ్చనే ఉద్దేశ్యంతో మరలా ప్రచురిస్తున్నాను.
శ్రీ షిరిడీ
సంస్థాన్ వారు ఇటాలియన్ పాల రాతితో బాబా విగ్రహం చెక్కించడానికి బొంబాయికి చెందిన తాలిమ్
అనే ప్రఖ్యాత శిల్పిని వినియోగించారు.
అప్పట్లో బాబా కు సంబంధించిన ఫోటోలు చాలా కొద్ది గానే ఉండేవి. అనేక కోణాలలో తీసిన ఫొటోలు లేవు. ఉన్న ఫొటోలు కూడా వేరు వేరు వయస్సులకు చెందినవి. తాలిమ్ ఎంత శ్రమించినా నమూనాగా చెక్కదలచుకున్న విగ్రహం సంతృప్తిగా రాలేదు. ఆఖరి ప్రయత్నంగా అతడు సాయినే ప్రార్ధించాడు. ఆరోజు రాత్రి బాబా అతనికి కలలో కన్పించి, “నన్ను మళ్ళి మళ్ళీ చూడాలంటే సాధ్యం కాదు. జాగ్రత్తగా చూడు" అని తన ముఖాన్ని వివిధ కోణాలలో చూపించారు. అతడు (కలలోనే) సాయి చుట్టూ నెమ్మదిగా తిరుగుతూ ఆయన రూపాన్ని అన్ని వైపుల నుండి పరికించాడు. ఆ స్వప్న సాక్షాత్కార బలంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చక్కని నమూనా మూర్తిని తయారు చేశాడు.
దానిని బట్టి ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తు పాలరాతి విగ్రహాన్ని ఎంతో సుందరంగా మలిచాడు. దీనిని బట్టి సాయి తనంతట తానుగా తన ప్రతిరూపాన్ని తయారు చేయించుకున్నారు.

ఇపుడు విగ్రహం
చెక్కడానికి పాలరాయి ఏ విధంగ వచ్చిందో వివరిస్తాను.
ఒకసారి ఇటలీ
నుంచి ఒక చక్కటి పాలరాయి బొంబాయి ఓడ రేవుకి వచ్చింది. అది ఎలా వచ్చిందో ఎందుకని వచ్చిందో ఎవరికీ తెలీదు. దానిని తీసుకు వెళ్ళడానికి ఎవరూ రాకపోయేసరికి, రేవు
అధికారులు దానిని వేలం వేశారు. వేలంలో స్వంతం చేసుకున్న వ్యక్తి, కొన్నాళ్ళ తర్వాత మరి ఏ ప్రేరణతోనో దానిని షిరిడీ సంస్థానానికి
సమర్పించాడు. ఆ రాతి నాణ్యతను గుర్తించిన సంస్థాన్
వారు దానితో బాబా శిల్పం చెక్కించాలని నిర్ణయించి, బొంబాయికి చెందిన బాలాజీ వసంత్ తాలిమ్
అనే ప్రఖ్యాత శిల్పికి ఆ బాధ్యతను అప్పగించారు. 07.10.1954 విజయదశమి పర్వదినం సాయిబాబా
36 వ మహా సమాధి రోజున బాబా సమాధి మీద ప్రతిష్టించారు.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment