25.05.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
అంకిత భక్తులలో ముఖ్యులయిన జస్టిస్ ఎమ్.బి.రేగే గారి గురించి మరికొన్ని విశేషాలు.
శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్
శ్రీ సాయి అంకిత భక్తులు _ జస్టిస్ ఎమ్.బి.రేగే – 5వ.ఆఖరి భాగమ్
1923 వ.సంవత్సరంలో
ఆయన నాగపూర్ లో ఉన్న హజ్రత్
బాబా తాజుద్దీన్ ఔలియా గారిని దర్శించుకోవడానికి
వెళ్ళారు. అ
కాలంలో తాజుద్దీన్ బాబాగారు అసాధారణమైన తత్వ వేత్తలలో ఒకరు. ఆయనలో
మూర్తీభవించినటువంటి మహోన్నతము, అత్యద్భుతమయిన ఆధ్యాత్మిక శక్తులు ఎంతో మందిని ఆకర్షించాయి.
హిందువులు, ముస్లిములు ఇంకా ఇతరులు కూడా ఆయనని పూజించేవారు. సమస్త మానవాళి బాధల నివారణకై ఆయన తమ ఆశీస్సులను అందచేసేవారు. ఆయన ఖ్యాతి సత్పురుషుడయిన ఒక సూఫీ సాదువుగా నలుదెసలా వ్యాప్తి చెందింది.
తాజుద్దీన్ బాబాగారి దర్శనం లభించడం దుర్లభం. రేగే ఆయనను దర్శించుకోవడానికి వెళ్ళిన రోజున అక్కడ ఆయనను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎంతో మంది తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదే రోజు సాయంత్రం ఆయన రైలులో తిరుగు ప్రయాణమవాలి. దర్శనం అంత తొందరగా లభించేలా లేదు. ఇక సాయంత్రం 3 గంటలవరకు చూసి వెళ్ళిపోదామనుకున్నారు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. సమయం మూడు గంటలవుతుండగా లోపలినుండి ఒక వ్యక్తి రేగే దగ్గరకు వచ్చి హజ్రత్ తాజుద్దీన్ బాబా గారు పిలుస్తున్నారని చెప్పి రేగే గారిని లోపలికి తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా రేగే హజ్రత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులను పొందారు. ప్రయాణ సమయానికి ఆఖరి నిమిషంలో ఈ అద్భుతం జరగడం అంతా బాబా ఆశీర్వాద బలం వల్లనేనని భావించారు. (ఇంకా మరికొంత మంది సిధ్ధపురుషుల గురించి తెలుసుకోవాలంటే ఇదే రచయిత వ్రాసిన “మెడీవల్ మహారాష్ట్ర సెయింట్ స్” అనే వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చు.)

బాబా తాను మహాసమాధి చెందిన తరువాత కూడా రేగే కు సహాయం చేస్తూ వచ్చారు. బాబా, రామకృష్ణపరమహంస ఇద్దరి యొక్క అంశ ఒకటేనని, రేగే భావించారు. దానికి ఉదాహరణగా జరిగిన ఒక సంఘటన ద్వారా ఆయన తన భావన నిజమేనని నిర్ధారించుకొన్నారు. 1928 వ.సంవత్సరంలో అయన దక్షిణేశ్వర్ వెళ్ళారు. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు, దేవాలయాలు అన్నీ చూడాటానికి ఒక గైడుని ఏర్పాటు చేసుకొన్నారు. అ గైడు రామకృష్ణపరమ హంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని, ఇంకా ఇతర మూర్తులను చూపించాడు.
రామకృష్ణపరమహంస ఆడుకొన్న @‘రాంలాల్’(బాల రాముడు) విగ్రహాన్ని చూపించమన్నారు. ఆ గైడు ఆయనని ఒక గుడిలోకి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి అదే రాంలాల్ విగ్రహం అని చెప్పాడు. పరమహంస గారి చరిత్రను క్షుణ్ణంగా చదివిన రేగే అది పరమహంసగారు ఆడుకున్న ‘రాంలాల్’ చిన్న విగ్రహం అవడానికి ఆస్కారం లేదని చెప్పారు. ఆదే సమయంలో అనుకోకుండా ఒక పూజారి అక్కడకు వచ్చి దక్కన్ నుండి వచ్చినది మీరేనా అని రేగేను ప్రశ్నించారు. రేగే అవునని జవాబిచ్చారు. అపుడా పూజారి తాను అన్ని విగ్రహాలను దగ్గరుండి చాలా దగ్గరగా చూపించి విశేషాలను కూడా వివరించి చెబుతానని చెప్పాడు. అంతకు ముందు చూసిన ప్రదేశాలను, గుడులను మళ్ళీ మరొకసారి చూడమని, తాను అన్నీ దగ్గరుండి చూపించినందుకు తనకు డబ్బేమీ ఇవ్వనక్కరలేదని రేగేతో చెప్పాడు. తనకు క్రితం రోజు రాత్రి ఒక కల వచ్చిందనీ ఆ కలలో తనకు మరుసటి రోజు దక్కన్ నుండి ఒక భక్తుడు వస్తున్నట్లు, అతనికి అన్ని ప్రదేశాలను, గుడులను దగ్గరుండి చూపించమని ఆదేశాలు వచ్చాయని చెప్పాడు. విగ్రహాలను కూడా చూపించి వాటిని పూజించుకొనేందుకు సహాయం కూడా చేయమని కలలో ఆదేశం వచ్చినట్లు చెప్పాడు. అపుడా పూజారి రేగేను వెంటబెట్టుకొని ప్రతి గుడిలోకి తీసుకొని వెళ్ళాడు. గర్భగుడిలోకి కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న విగ్రహాలను కూడా స్వయంగా చేతితో తాకి తనకు ఇష్టమయిన రీతిలో పూజించుకునేలా సహాయం చేసాడు. తనకు గైడు ఇదే ‘రాంలాల్’ అని ఒక పెద్ద విగ్రహాన్ని చూపించాడని పూజారితో చెప్పారు రేగే. ఆ పూజారి, గైడు మిమ్మల్ని మోసం చేశాడు అని అన్నారు. ఆపుడా పూజారి పరమహంస ఆడుకున్న ‘రాంలాల్” చిన్న విగ్రహాన్ని తీసి రేగే ఒడిలో ఉంచారు. ఆ విధంగా ఆయన ఊహకందని రీతిలో బాబా అనుగ్రహం వల్ల రేగే గారి కోరిక నెరవేరి, బాబా , రామకృష్ణపరమహంస వేరు కాదనే భావన రేగే కు కలిగింది.
అసలయిన సిధ్ధపురుషుని కోసం అన్వేషిస్తూ షిరిడీకి వచ్చిన బి.వి.నరసింహస్వామి గారికి సాయిబాబాను చూసిన తరువాత ఆయనే అసలయిన యదార్ధమయిన మహాపురుషుడు అనే నమ్మకం కలిగింది. సిధ్ధపురుషుడు కాదు ఆయన షిరిడీలో సజీవంగా సంచరిస్తున్న భగవంతుడు అని నిర్ధారించుకొన్నారు. రేగే ఆయనను ఆహ్వానించి పి.ఆర్.అవస్తే గారికి పరిచయం చేశారు. అవస్తె, నరసింహస్వామి గార్లతో కలిసి రేగే కూడా అపుడు జీవించి ఉన్న బాబాగారి అంకిత భక్తులందరినీ వ్యక్తిగతంగా కలుసుకొని వారి అనుభవాలన్నిటిని సేకరించారు. అవిధంగా సేకరించిన భక్తుల అనుభవాలన్నిటిని *పుస్తకాలుగా ప్రచురించారు నరసింహస్వామిగారు.
ఆయన
‘సాయిసుద’ అనే పత్రికను ప్రారంభించారు. మద్రాసులో
అఖిల భారత సాయి సమాజ్ (All India Sai Samaj)
స్థాపింపబడటానికి కూడా ఆయనే ముఖ్యకారకులు. బాబాగారు
జీవించి ఉండగా స్వామిగారు షిరిడీ
వెళ్ళనప్పటికీ, ఆయన బాబా తత్వ
ప్రచారానికి ఎంతో కృషి చేసారు. బాబావారి
సందేశాలను, మహిమలను, మొత్తం భారతదేశమంతటా ముఖ్యంగా దక్షిణాదిలో విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకొనివచ్చింది స్వామిగారే. మన
దేశంలోనే కాదు విదేశాలలో కూడా
బాబా అంటే ఎవరో ఆయన వల్లనే తెలిసింది. నిజం చెప్పాలంటే నరసింహస్వామిగారు మహోన్నతమయిన సాయి
భక్తుడిగా మనం అభివర్ణించవచ్చు. ఆయన తన ఆఖరి
శ్వాస వరకు బాబాకు ఎంతో సేవ చేసి 1956 వ.సంవత్సరంలో మరణించారు. నరసింహస్వామి గారు వ్యక్తిగతంగా బాబాను ఎప్పుడూ
కలుసుకోకపోయినా, కీర్తించదగ్గ సాయి భక్తుడిగా సాయి భక్తుల హృదయాలలో చిరస్థాయిగా ఆయన ఉండిపోవాలనే ఉద్దేశ్యంతో, స్వామి మరణించిన పది సంవత్సరాల తరువాత ఆయన చిత్రపటాన్ని సమాధిమందిరంలో
రేగే గారు 1966 వ.సంవత్సరంలో ఆవిష్కరించారు.
బాబా ప్రత్యక్షంగా ఆశీర్వదించి, తన కరుణను ప్రసాదించిన అదృష్టవంతుడు రేగే. ఎన్నో సందర్భాలలో ఆయనకు బాబాతో సన్నిహిత అనుబంధం
కలిగింది. బాబాకు అంకిత భక్తుడయిన రేగే అక్టోబరు,
30, 1968 లో మరణించారు.
@కలకత్తాకు 5 మైళ్ళ దూరంలోని దక్షిణేశ్వర్ లో రాణి రాస్మణి అనే పరమ భక్తురాలయిన జమిందారిణిచే నిర్మింపబడ్డ కాళికాలయంలో పీఠం మెట్లపై వెండితో తయారయిన చిన్న సింహాసనం మీద సాలగ్రామం, జటాధారి అనే సాధువునుంచి శ్రీరామకృష్ణులు పొందిన అష్టధాతువులతో తయారయిన ‘రాంలాలా” అని పేర్కొనబడే బాలరాముని విగ్రహం ఉంది.
*శ్రీబ్.వి.నరసింహస్వామిగారి
Devotees Experiences of Sri Sai Baba (ఇదే పుస్తకం తెలుగు అనువాదం శ్రీసాయిభక్త అనుభవ
సంహిత – తెలుగులోకి అనువాదం చేసినవారు సాయినాధుని సురేంద్రబాబు) ఈ పుస్తకాల ద్వారా
సాయి భక్తులందరి గురించి, బాబాతో వారి అనుభవాలను గురించి తెలుసుకోవచ్చు.
(సమాప్తం)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment