Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, June 3, 2016

శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 16వ.భాగం

Posted by tyagaraju on 2:57 AM
Image result for images of shirdisaibaba with flowers
Image result for images of rose garden

03.06.2016 శుక్రవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి బానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక సందేశాలు మరికొన్ని.
 Image result for images of saibanisa
శ్రీ సాయి పుష్పగిరి - ఆధ్యాత్మిక జీవితం - 16.భాగం
 (సంకలనం ఆత్రేయపురపు త్యాగరాజు - విశాఖపట్నం నుండి)

02.08.2015

151.  మనము పదవిలో ఉండగానె ఇల్లు చక్కబెట్టుకోవాలని అడ్డ దారులలో ధన సంపాదన, మనకింద పని చేసేవారి చేత భజనలు చేయించుకోవడము చేస్తాముఒకసారి పదవీవిరమణ జరిగినతరవాత మనకు భజనచేసినవారు మన నుండి సహాయం పొందినవారు దూరంగా వెళ్ళిపోతారుకనీసము ఆఫీసు దగ్గరున్నశునకము కూడా మన మొహము చూడదుఅందుచేత నిజ జీవితాన్నిఅర్ధము చేసుకుని ప్రయాణం కొనసాగించాలి.      


152.  జీవితంలో సమస్యలు వచ్చినపుడు పోరాడాలికాని ఆ సమస్యలు నీకంటె బలమయినవి అయినప్పుడు నీవు ఆ సమస్యలతో రాజీ పడి జీవించడం అలవాటు చేసుకోవాలి

18.05.2010

153.  కొడుకు చేసిన మంచి పనులకు తండ్రి గర్వపడాలితండ్రి చేసిన మంచి పనులను కొడుకు కొనసాగించాలి

29.05.2010

154.  నీ యింటికి వచ్చిన అతిధులకు నీవు భోజనం పెట్టి వారి ఆశీర్వచనాలు పొందాలిఅలాగే నీవు యోగుల దగ్గరకు వెళ్ళి వారినుండి ఆధ్యాత్మిక సంపదను తీసుకుని వారి ఆశీర్వచనాలతో జీవితాన్ని కొనసాగించాలి.  


26.08.2010

155.  నీవు భోజనం చేసేముందు నీ తల్లిని, తండ్రిని, గురువును తలచుకుని వారికి మనసులో ఆ భోజనాన్నిఅర్పించి, ఆ తరువాత నీవు భోజనం చేయి.  

05.09.2010

156.  నీ శత్రువులనుండి దూరంగా జీవించడం అలవరచుకోఒకవేళ ఎదురు పడితే తక్కువగా మాట్లాడుఒకవేళ మాటాడవలసివస్తే తెలివిగా మాట్లాడు. ఒకవేళ నీలో బలం లేకపోతే కనీసము అతనిని తాకవద్దుయుక్తిగా అక్కడినుండి దూరంగా వెళ్ళిపో.    

11.09.2010

157.  మన మంచి తనాన్నిఇతరులు తమ స్వార్ధానికి వాడుకుంటారుఅందుచేత వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి

22.09.2010.

158.  మనకి ఇష్టం లేనివారి నుండి మనము దూరంగా ఉన్నచో అదే వారికి తగిన శిక్ష అని గ్రహించు

24.09.2010.

159.  నీ   జీవితంలో నీవు నీ పిల్లల పట్ల బరువు బాధ్యతలు పూర్తి చేసిననాడు నీవు నీ వృధ్ధాప్యంలో నీ పిల్లలపై వ్యామోహాన్ని విడనాడవచ్చును.

01.10.2010


160.  ఒక మనిషి చనిపోతే ముందుగా అతనికి దహనసంస్కారాలు పూర్తిచేసి ఆ తరువాతనె అతని జీవితంలోని మంచిచెడ్డలను తీరుబడిగా మాట్లాడవచ్చును.

(మరికొన్ని సందేశాలు ముందు ముందు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List