Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, July 25, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము - (4) భక్తిమార్గం – 3వ.భాగం

Posted by tyagaraju on 4:46 AM
Image result for images of shirdi sai baba at dwarkamai
       Image result for images of rose

25.07.2016 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
(4) భక్తిమార్గం – 3వ.భాగం
        Image result for images of  m b nimbalkar
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీసాయి సత్ చరిత్ర 21వ.అధ్యాయంలో నవవిధ భక్తుల గురించి వివరింపబడింది.  అవి (1) శ్రవణము (వినుట), (2) కీర్తనము (ప్రార్ధించుట), (3) స్మరణము (భగవంతుని రూపాన్ని, నామాన్ని జ్ఞప్తియందుంచుకొనుట) (4) పాదసేవ (పాదములకు సేవ చేసుకొనుట) (5) అర్చన (పూజించుట) (6) వందన (వంగి నమస్కరించుట) (7) దాస్యము (సేవ) (8) సఖ్యత్వము (స్నేహము) (9) ఆత్మనివేదనము (ఆత్మను సమర్పించుట).


ఈ నవవిధ భక్తులలో ఏ ఒక్కదానినయిననూ  హృదయపూర్వకముగా ఆచరించనచో భగవంతుడు ప్రీతి చెంది భక్తుని గృహమందు ప్రత్యక్షమగును మరియు భక్తుని హృదయములో నిసించును అని ఇదే 21వ.అధ్యాయములో దాదా కేల్కర్ వివరించారు.

సాయిబాబా కూడా సమయం వచ్చినపుడెల్లా పలుమార్లు ఈ నవవిధ భక్తుల గురించి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను తమ మాటలద్వారాను, చేతలద్వారాను సూచనలు ఉపదేశాలు చేస్తూ ఉండేవారు.

ఉదాహరణకి 21వ.అధ్యాయంలో తొమ్మిది ఉండల గుర్రపులద్దెల నీతి కధ, 33వ.అధ్యాయంలో అప్పాసాహెబ్ కులకర్ణికి పవిత్రము చేసి 9రూపాయలను తిరిగి ఇచ్చివేయుట, 42వ.అధ్యాయములో బాబా తన భౌతిక శరీరమును విడచునపుడు లక్ష్మీబాయి షిండేకు 9రూపాయల నాణెములను ఇచ్చుట, ఇటువంటి సంఘటనలన్నీ కూడా నవవిధ భక్తులగురించి తెలియ చేస్తున్నాయి.  సాయిబాబా వీటినన్నిటినీ తన భక్తుల చేత సక్రమంగా అమలు చేయించారు.
నవవిధ భక్తులు :
               Image result for images of shirdisaibaba lotus feet

1.        శ్రవణము (భగవంతుని కీర్తనలను, స్తోత్రములను వినుట) :
భక్తులయిన కాకా సాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ జోగ్ విద్యాధికులు.  అలాంటివారిని సాయిబాబా ప్రతిరోజు జ్ఞానేశ్వరి, ఏకనాధ భాగవత భావార్ధరామాయణాలను అందరికీ చదివి వినిపించమని చెప్పేవారు.  భక్తులందరినీ కూడా వాటిని వినడానికి పంపించేవారు.  శ్రీసాయి సత్ చరిత్ర గురించి సాయిబాబా స్వయంగా చెప్పిన మాటలు – “నా కధలు, ఉపదేశాలు విన్నచో, అవి  భక్తుల మనసులో భక్తి విశ్వాసములు కలిగించును.  వారు ఆత్మ సాక్షాత్కారమును, బ్రహ్మానందమును పొందెదరు – అధ్యాయం – 2.

2.        కీర్తనము (భగవంతుని కీర్తించుట) :
            Image result for images of man singing shirdisaibaba songs

రామనవమి, గోకులాష్టమి రోజులలో సాయిబాబా ద్వారకామాయి ముందు ఆరుబయట కీర్తనకారుల చేత హరికధాగానములను ఏర్పాటు చేయించేవారు.  15వ.అధ్యాయములో సాయిబాబా, దాసగణుని హరికధ చెప్పునప్పుడు  ఎటువంటి ఆడంబరాలు లేకుండా నారదమునివలె పైన చొక్కా ఉత్తరీయము లేకుండా మెడలో పూలదండ చేతిలో చిడతలు మాత్రమే ధరించమని చెప్పేవారు. 
                                 Image result for images of dasaganu

వాస్తవానికి సాయిబాబాయే దాసగణు చేస్తున్న పోలీసు డి పార్టుమెంటు ఉద్యోగాన్ని మాన్పించి హరినామ సంకీర్తనలో నిమగ్నమయేలా చేశారు.
3వ.అధ్యాయములో “ఎవరయితే మనఃపూర్వకముగా నా చరిత్రను, నాలీలలను గానము చేస్తారో వారినన్నిదిశలందు కాపాడెదను. నాలీలలను గానము చేయువారికి అంతులేని ఆనందమును, శాశ్వతమయిన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము అని బాబా చెప్పారు.
          Image result for images of shirdi sai baba harikatha.
3వ.అధ్యాయాన్ని మరొకసారి పరిశీలిద్దాము.  రోహిల్లా ఖురానులోని కల్మాను కఠోరమయిన గొంతుతో బిగ్గరగా చదువుతూ “అల్లహుఅక్బర్ అని గట్టిగా అరుస్తూ ఉండేవాడు.  గ్రామస్తులందరికీ రోహిల్లా అరపులకు నిద్రాభంగమవుతూ ఉండేది.  రోహిల్లా వల్ల తమకు చాలా అసౌకర్యంగా ఉందని అందరూ బాబాతో మొరపెట్టుకొన్నారు.  కాని బాబాకు దైవ ప్రార్ధనలయందు ప్రేమ వలన రోహిల్లా తరపున వాదించి గ్రామస్తులందరిని శాంతముగా భరించమని, ఓపికతో ఉండమని వారించారు.
            Image result for images of namasmaran
3. స్మరణము (భగవంతుని రూపాన్ని, నామాన్ని జ్ఞప్తియందుంచుకొనుట) 
స్మరణమనగా నామమును ఉచ్చరించుట.  ఇంకా వివరంగా చెప్పాలంటే భగవంతుని యొక్క రూపాన్ని గుర్తు చేసుకొంటూ ఆయన నామాన్ని నిరంతరమూ స్మరిస్తూ ఉండుట.  శ్రీసాయి సత్ చరిత్ర ఈవిధంగా వివరిస్తుంది. “భగవంతుని నామం యొక్క ప్రభావం, శక్తి అందరికీ తెలిసినదే.  అది మనలని అన్ని పాపాలనుండి, చెడు కర్మలనుండి రక్షిస్తుంది.  జననమరణ చక్రాలనుండి తప్పిస్తుంది.  దీనికన్నా సులభమయిన సాధన మరొకటి లేదు".
అది మన మనస్సును సర్వోత్తమంగా పావనము చేస్తుంది.  దానికి ఎటువంటి సాధనాలు, నియమాలు లేవు. 27వ.అధ్యాయము.

అందుచేత 27వ.అధ్యాయములో బాబా తన మిక్కిలి ప్రియభక్తుడయిన శ్యామా చేత విష్ణుసహస్రనామాలను చదివింపచేయడంలో ఆశ్చర్యము లేదు.
అదేవిధంగా సాయిబాబా తన నామముయొక్క ఫలితం గురించి ఇలా చెప్పారు. 
            Image result for images of namasmaran

“ఎవరయితే నా నామాన్ని ప్రేమతో ఉచ్చరిస్తారో వారి కోరికలన్నీ నెరవేర్చెదను.  వారి భక్తిని పెంపొందింపచేసెదను” ‘సాయి సాయి యను నామమును జ్ఞప్తియందుంచుకొన్నంత మాత్రమున, చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును  అధ్యాయము – 3.  ఎల్లప్పుడు ‘సాయి సాయి’ అని స్మరించుచుండిన సప్తసముద్రములను దాటించెదను.  ఈమాటలను విశ్వసింపుడు.  మీకు తప్పక మేలు కలుగును” – అధ్యాయము 13 లో బాబా చెప్పిన మాటలు.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List