26.07.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 4వ.భాగమ్
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం: ఆత్రేయపురపు త్యాగరాజు
4.పాద
సేవనము
పాదసేవ
అనగా మనము పూజించే భగవంతుని లేక గురువుయొక్క పాదములను భక్తితో రెండు చేతులతో స్పృశించి,
మన శిరస్సును వారి పాదములపై ఉంచి గాని, వానిని మెల్లగా తోముట గాని చేయుట పాదసేవనము. బాబా మందిరాలలో మీరు కొంతమంది భక్తులను గమనించే
వుంటారు. వారు బాబా వారి పాదాలను తమ చేతులతో
భక్తితో పాముతూ వత్తుతూ పాదసేవ చేస్తూ ఉంటారు.
శ్రీసాయి
సత్ చరిత్రలో సాయిబాబా సాధారణంగా కూర్చునే విధానము వర్ణింపబడింది. ఆయన
తన కుడికాలును ఎడమ మోకాలిపై వేసి కూర్చుని ఉంటారు. ఎడమ చేతి వేళ్ళు కుడిపాదముపై వేసి చూపుడూ వేలు,
మధ్య వేలు కాస్త ఎడంగా వేసుకొని కనిపిస్తారు.
ఆయన కూర్చున్న ఈ విధానమును బట్టి మనకు తెలియచెప్పదలచుకొన్నది “నా ప్రకాశమును
చూడవలెనంటే అహంకారమును విడచి మిక్కిలి అణకువతో చూపుడు వేలుకు, మధ్యవేలుకు మధ్యనున్న
బొటనవ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇదియే భక్తికి సులభమయిన మార్గము.”
అధ్యాయం – 22
ద్వారకామాయిలో
ఉన్న సాయిబాబా తైలవర్ణ చిత్రాన్ని కూడా గమనించండి. బాబా తన కుడికాలును ముందుకు జాపి కూర్చొని ఉంటారు. అలాగే మహల్సాపతి, శ్యామాలతో కలసి ఉన్న ఫొటోలో బాబా
తన రెండు కాళ్ళను ముందుకు చాపి, భక్తులు తన పాదములకు నమస్కరించుకొని సేవ చేసుకొనుటకు
వీలుగా, ఆవిధంగా కూర్చొన్నారు. ఆవిధంగా పాదసేవన
యొక్క భక్తి విధాన్నాని బాబా ప్రోత్సహించారు.
భగవంతుని
లేక సద్గురువు యొక్క పాదములను నీటితో కడిగి ఆనీటిని త్రాగినా, లేక స్నానము చేసామన్న
భావనతో తలపై చల్లుకొన్నా అది కూడా పాద సేవనలో ఒక భాగమే. అటువంటి జలము ప్రయాగలో గంగా యమునలు కలిసే త్రివేణి
సంగమంలోని నీటివలె పవిత్రమైనదనే విశ్వాసాన్ని సాయిబాబా దాసగణుకి కలిగించారు. ఈ సంఘటన మనకు 4వ.అధ్యాయంలో కనపడుతుంది. బాబా తన కాలి బొటనవ్రేళ్ళనుండి గంగా, యమున, జలములను
ధారగా స్రవింపజేసి, దాసగణుకు ఋజువు చూపించారు.
అలాగే 45వ.అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాధ భాగవతంలోని రెండవ అధ్యాయము చదువుతున్నపుడు
తన భక్తి గురించి సందేహాలు కలిగాయి. వృషభ కుటుంబములోని
నవనాధులు, సిధ్ధులు భక్తి గురించి చెప్పిన విషయాలు, వాటిని ఆచరించుట ఎంత కష్టమో కదా
అని ఎన్నో సందేహాలు కలిగాయి. ఇదే అధ్యాయములో
సాయిబాబా ఆనందరావు పాఖడెకు స్వప్న దర్శనమును చూపించి, భగవంతుని లేక గురుని పాదములకు
భక్తితో మ్రొక్కిన చాలును, అది భక్తికి సంబంధించిన విషయమే అని చెప్పారు.
ఈ స్వప్న వృత్తాంతము విన్న కాకాసాహెబ్ కు సంశయం
తీరి బాబా చెప్పిన పాదసేవన భక్తియందు నమ్మకం కుదిరింది. ఆ విధంగా బాబా పాదసేవన కూడా
భక్తిలో ఒక భాగమే అనే విషయాన్ని మనందరికీ తెలియచేశారు.
5.
అర్చన (పూజించుట)
భగవంతుని
గాని, తమ గురువుని గాని ప్రత్యక్షముగా గాని వారి విగ్రహం లేదా ఫొటోని గాని పూజించుటయే
అర్చన. పాదములను కడుగుట, నుదుట చందనము అద్దుట,
దుస్తులతోను, పుష్పాలతోను అలంకరించుట, దీపములను వెలిగించి నైవేద్యము సమర్పించి హారతినిచ్చుట
ఇవన్నీ కూడా పూజలోని భాగాలు.
మొదట్లో సాయిబాబా
తన భక్తులెవరినీ తనని పూజించనిచ్చేవారు కాదు.
కాని తరువాత భక్తులు పట్టుబట్టడంతో అంగీకరించారు. నేటికీ కూడా షిరిడీలో సమాధి మందిరంలో సాయిబాబాకు
అదే విధంగా ప్రతిరోజూ పూజలు సలుపుతున్నారు. అలాగే దాదా కేల్కర్, తాత్యా సాహెబ్ నూల్కర్,
మాధవరావు దేశ్ పాండేల బలవంతం మీద, గురుపూర్ణిమనాడు సద్గురువుని పూజించడం సాయిబాబా ప్రారంభించారు.
6.
వందనము (వంగి నమస్కరించుట)
సాయిబాబా
ఎప్పుడూ కూడా తనను దర్శించడానికి వచ్చిన వ్యక్తి తనకు శిరసువంచి నమస్కరిస్తున్నాడా
లేదా అని పట్టించుకునేవారు కాదు. కాని అప్పుడప్పుడు
నాసిక్ నివాసి, పూర్వాచార పరాయణుడు బ్రాహ్మణుడు అయిన మూలేశాస్త్రి (అధ్యాయం – 12) రామభక్తుడయిన
ఒక డాక్టరు (అధ్యాయం –35), కాకా మహాజని యజమాని శేఠ్ ఠక్కర్ ధరమ్సి, లకు కొన్ని చమత్కారాలను
చూపించి తనకు శిరసువంచి నమస్కరించేలా చేశారు.
ఆయన వారిని అక్కడ ఉన్న భక్తులందరికీ వంగి నమస్కరించడంలోని ప్రాముఖ్యత, ఒక యోగి
ముందు గౌరవపూర్వకంగా తనను అర్పించుకొనుట వీనియందు నమ్మకం కలగచేయడానికి మాత్రమే కాని,
తన గొప్పతనాన్ని గౌరవాన్ని చాటుకోవడానికి కాదు.
శిరసువంచి నమస్కరించడంలోని పరమార్ధం మనలోని అహంకారాన్ని, ఆడంబరాన్ని నిర్మూలించి
మనలో వినయ విధేయతలని పెంపొ౦దించడం కోసమే. హేమాడ్
పంత్ షిరిడీలో సాయిబాబాకు మొట్టమొదటిసారిగా
పాదాభివందనం చేసినప్పుడు తన అనుభవాన్ని ఇలా వర్ణించారు, “నేను పరుగెత్తుకొని
వెళ్ళి సాయిబాబాకు నమస్కారం చేశాను. నా ఆనందానికి
అవధులు లేవు. నా ఇంద్రియాలన్నిటికీ ఎంతో సంతృప్తి
కలిగింది. నేను ఆకలి దప్పులన్నిటినీ మరచాను. నేను సాయిబాబా పాదాలను స్పృశించిన క్షణంనుండీ నాలో
క్రొత్త జీవితం ప్రారంభమయింది. (అధ్యాయం
– 2)
(మనం దేవాలయాలకు, వెళ్ళేముందు మనసులో ఎన్నో కోరికలతో వెడుతూ ఉంటాము. దేవుని ముందు మన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోవాలనే ఆశతో ఉంటాము. కాని అక్కడికి వెళ్ళిన తరువాత మనకు మనం కోరుకోవలసిన కోరికలేమీ గుర్తుకు రావు. మనం కోరుకోకపోయినా భగవంతునికి మనకేది కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అన్నీ అవగతమే కదా. అందుచేత కోరికలు కోరుకోకుండా భగవంతుని భక్తితో నమస్కరించుకుంటే చాలు. మన మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది.)
(ఇంకా
ఉన్నాయి)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment