30.07.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
(4) భక్తి మార్గం – 8వ.భాగమ్
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి.నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీ సాయి సత్చరిత్ర 14వ.
అధ్యాయములో బాబా ఈవిధంగా చెప్పారు. “ఈప్రపంచములో
ఎంతో మంది యోగులు ఉన్నారు. కాని మన తండ్రే
(గురువు) నిజమయిన తండ్రి (నిజమైన గురువు). ఇతరులు ఎన్నో మంచి విషయాలు చెప్పవచ్చు, కాని
మనం మన గురువు చెప్పిన విషయాలనెప్పుడూ మర్చిపోకూడదు”.
భగవంతరావు
క్షిరసాగరుడు విఠోభా భక్తుడు. అతను పూజను అశ్రధ్ధ
చేయగా సాయిబాబా మరలా అతనిలో భక్తిని తిరిగి పునరుధ్ధరింప చేశారు. (అధ్యాయం 4).
అదేవిధంగా హరిశ్చంద్ర పితలేకు, గోపాల్ అంబడేకర్ గార్లకు అక్కల్ కోట స్వామి యందు
భక్తిని పెంపొందించారు. షిరిడీ వచ్చు తొందరలో
కోపర్ గావ్ లో దత్తాత్రేయుని దర్శించనందుకు తన భక్తుడయిన నానా సాహెబ్ చందోర్కర్ పౖ
బాబా ఆగ్రహం చూపారు.
సద్గురువులు,
దేవుళ్ళు ఇందులో ఎవరిని పూజించినా అంతా ఒకటేనని అందుచేత మాటిమాటికి ఎవరినీ మార్చనవసరంలేదని
సాయిబాబా తన భక్తులందరికీ చెప్పారు. దీనికి
సాక్ష్యంగా ఆయన కొంతమంది భక్తులకు, వారు వారు పూజించే దైవాలయిన విఠల్ గాను, శ్రీరామునిగాను,
దత్తాత్రేయునిగాను, మారుతి (హనుమాన్) గాను దర్శనమిచ్చారు.
కొంతమంది భక్తులకు వారి వారి గురువులయిన ఘోలప్ స్వామి (అధ్యాయం
12), కన్నడ యోగి అప్పా (అధ్యాయం21), మోలీసాహెబ్
(అధ్యాయం – 14),లవలె అనుభవాలనిచ్చి వారికి తనకు భేదం లేదని, అధ్బుతాలను కూడా చూపారు.
శ్రీసాయి
సత్ చరిత్ర మరాఠీ మూల గ్రంధంలో సాయిబాబాను ఏవిధంగా పూజించాలో ఉదాహరణలతో సహా కొన్ని
చక్కని మాటలు ఉన్నాయి.
“ఆవుదూడ తన తల్లి వద్ద సంతృప్తిగా పాలు త్రాగినప్పటికీ అక్కడనించి
కదలనట్లుగానే, మన మనస్సు కూడా సద్గురువు పాదాలమీదనే ధృఢంగా ఉండాలి.”
అధ్యాయం
– 3 ఓ వి 77
తానెక్కడ
తిరుగుతున్నా లోభియొక్క మనస్సు, తాను దాచిపెట్టిన ధనమందే ఉంటుంది. నిరంతరం లోభి కళ్ళముందు తాను దాచిన ధనమే కనపడుతూ
ఉంటుంది. అదే విధంగా మన రోజువారీ కార్యక్రమాలలో
కూడా మనం ఏపని చేస్తున్నప్పటికీ మన మనస్సులో సాయిబాబా రూపమే కనపడుతూ ఉండాలి.
అధ్యాయం – 3 ఓ వి 185
బెల్లం
తియ్యగా ఉంటుంది. దానిని పట్టుకున్న చీమ తన
తలతెగి పడినా గాని దానినంటిపెట్టుకునే ఉంటుంది.
అదేవిధంగా మనం కూడా మనం పూజించే భగవంతుని లేక సద్గురువు పాదాలను గట్టిగా పట్టుకోవాలి. అధ్యాయం – 27 ఓ వి 171
బాబా
తన భక్తులకు అభయమిస్తూ చెప్పిన కొన్ని మాటలకు ఇక్కడ పొందు పరచి ఈ అధ్యాయాన్ని ముగిస్తాను.
“నా
మనుష్యుడు ఎంతదూరమున ఉన్నప్పటికి, 100 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు
దారముకట్టి ఈడ్చునటుల అతనిని షిరిడీకి లాగెదను."
అధ్యాయం – 28
“నా
భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు” అధ్యాయం – 6
“నాముందర
భక్తితో మీచేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీచెంత నేనుండెదను. నాదేహమునిచ్చట నున్నప్పటికీ సప్త సముద్రముల కవ్వల
మీరు చేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున
మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీచెంతనే
ఉండెదను.
నానివాస స్థలము మీహృదయమునందే గలదు. నేను మీశరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీహృదయములలోను సర్వజన హృదయములందుగల నన్ను
పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈవిధముగా గుర్తించెదరో
వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు.”
అధ్యాయం – 15
" నేను సమాధి చెందినప్పటికీ నాసమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును, విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగ నన్ను శరణుజొచ్చినవారితో నా సమాధి
కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను మీవద్దనుండనేమోయని మీరాందోళన పడవద్దు. నాఎముకలు మాట్లాడుచు మీక్షేమమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను, హృదయపూర్వకముగను, నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు.”
అధ్యాయం – 25
(భక్తి
మార్గం అధ్యాయం సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు))
(రేపు జనన మరణ
చక్రాలు)
0 comments:
Post a Comment