22.09.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
14.
నిష్ఠ (ధృఢమయిన నమ్మిక) – 2 వ.భాగమ్
శ్రీసాయి
సత్ చరిత్ర 32వ. అధ్యాయంలో శ్రీసాయిబాబా వారు చెప్పిన వివరణ.
“ఒకసారి
మేము నలుగురం శాస్త్రాలు చదివి జ్ఞానం ప్రాప్తించిన తరువాత బ్రహ్మము గూర్చి చర్చించసాగాము. అలా చర్చించుకుంటూ భగవంతుని అన్వేషిస్తూ అడవులలో
తిరగసాగాము.
దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్మల్ని
కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉంది. ఎంతదూరము,
ఎక్కడికి పోవుచున్నారని ప్రశ్నించాడు. అడవులలో
వెతకటానికని జవాబిచ్చాము. అపుడా బంజారా “అడవుల
సంగతి పూర్తిగా తెలియకుండా మీఇష్టము వచ్చినట్లు తిరుగరాదు. మీకూడా ఒక మార్గదర్శి ఉండి తీరాలి. ఈ ఎండవేళ ప్రయాస పడవద్దు. కాస్త భోజనము చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి
తీసుకొని వెళ్ళమని సలహా ఇచ్చాడు. కాని, మేము
అతనిచ్చిన సలహా పాటించక అడవులలో వ్యర్ధముగా తిరిగి దారి తప్పాము. మరలా ఆ బంజారా తిరిగి మమ్మల్ని కలుసుకొని “చిన్న
పనయినా, పెద్ద పనయినా దారి చూపుటకు ఒక మార్గదర్శి ఉండవలసిందే. ఉత్త కడుపుటో అన్వేషణము జయప్రదము కాదు. బుధ్ధి పరిపరి విధాలుగా పలుదిశల్లో సంచరిస్తూ ఉంటుంది. బుధ్ధికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఈశ్వరుని ఆజ్ఞ లేకుండా దారిలో ఎవరూ మనల్ని కలవరు. అన్నాన్ని తిరస్కరించకూడదు. ముందున్న కంచాన్ని తన్నేసుకోకూడదు. ఎవరయినా తినటానికి
రొట్టెముక్క ఇస్తే దాన్ని శుభసూచకంగా భావించాలి.
అప్పుడా కార్యం ఎట్టి అవాంతరాలు లేకుండా జయప్రదంగా జరుగుతుంది. ఇపుడు కాస్త పలహారం చేయండి” అని సలహా ఇచ్చాడు.
కాని
ముగ్గురూ అతని సలహా పెడచెవిని పెట్టి వెళ్ళిపోయారు. నేను ఆ బంజారా ఇచ్చిన రొట్టెముక్క తిని మంచినీళ్ళు
త్రాగాను. అప్పుడు ఒక అధ్బుతం జరిగింది. హటాత్తుగా గురు మహరాజు మాముందు ప్రత్యక్షమయ్యారు. అన్వేషణలో తాను సహాయం చేస్తానని చెప్పారు. ఆయన నన్నొక బావి వద్దకు తీసుకుని వెళ్ళారు. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక
చెట్టుకు కట్టి బావిలోని నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసారు. నా చేతులతో గాని, నోటితో గాని నీళ్ళను అందుకోలేకుండా
ఉన్నాను. ఆవిధంగా నన్ను కట్టి ఆయన ఎక్కడికో
వెళ్ళిపోయారు. 4 -5 గంటల తరువాత వచ్చి ఎలా
ఉందని అడిగారు. "ఆనందములో మునిగి యుంటిని, నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలుగును" అని సమాధానమిచ్చాను. జయించడానికి సాధ్యంకానటువంటి
ఈ ప్రాపంచిక సుఖాలు, కోరికలు అన్నీ మాయమయిపోయాయి.
ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి పయనించే దారిలో గల అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నా గురువుగారి మెడను కౌగలించుకొని వారినే ఎల్లప్పుడు తదేక దృష్టితో చూస్తూ ఉండాలనిపించింది. ఆయన నన్ను తన బడిలో చేర్చుకొన్నారు. అది అందమయిన బడి. నా అభిమానమంతా తొలగిపోయింది. వారి ప్రతిబంబము నా కనుపాపలలో నిలబడనప్పుడు అవి
మాంసపుగోళాలు మాత్రమే అన్పించింది. దానికన్నా
గ్రుడ్డివానిగా ఉండటమే మేలనిపించింది.
తన
గురువుపై ఆయనకెంతటి నమ్మకమో!
శ్రీసాయి
సత్ చరిత్ర 23వ.అధ్యాయంలో సద్గురువుపై విశ్వాసాన్ని ఏవిధంగా నిలుపుకోవాలో చాలా ఉదాహరణలు
ఉన్నాయి.
ఒకసారి
యోగాభ్యాసాన్ని సాధనచేసే సాధకుడు నానాసాహెబ్ చందోర్కర్ తో కలిసి షిరిడీ వచ్చాడు. యోగాలో కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకొన్నాడు. అతడు మసీదుకు వెళ్ళేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె
తింటూ కనిపించారు. అప్పుడా సాధకుడు ‘రుచిలేని
రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నాసందేహాలను ఎలా తీర్చగలడు’ అని మనసులో అనుకొన్నాడు. బాబా అతని మనసులోని ఆలోచనను గ్రహించి, “నానా! ఎవరికైతే
ఉల్లిని జీర్ణించుకొనే శక్తి కలదో వారే దానిని తినవలెను” అని అన్నారు. ఎదుటి వ్యక్తి మనసులోని ఆలోచనలను కూడా గ్రహించగలిగే
ఆయన శక్తికి ఆశ్చర్యపడి వెంటనే బాబా పాదాలపై పడి సర్వశ్యశరణాగతి చేసుకొన్నాడు. తనకు కలిగిన సందేహాలన్నిటినీ బాబా ద్వారా నివృత్తి
చేసుకున్నాడు.
మరొక
ఉదాహరణలో శ్యామాను ఒక విషసర్పము కాటు వేసింది.
గ్రామస్థులు అతనిని విఠోభా మందిరానికి తీసుకొని వెడదామనుకున్నారు. కాని శ్యామా సాయిబాబా వద్దకు పరుగెత్తాడు. బాబా అతనిని చూడగానే “పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో
చూడుము. పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము”
అంటూ గట్టిగా గర్జించారు. కాని శ్యామా నిరాశ
చెందకుండా మసీదు బయటనే మెట్లమీద కూర్చున్నాడు.
ఆ తరువాత బాబా శాంతించి శ్యామాతో “భయపడకు.
ఇంటికిపోయి కూచుండుము. ఈ దయామయుడైన
ఫకీరు నిన్ను తప్పక రక్షించును. బయటకు పోవద్దు. నాయందు విశ్వాసముంచుము” అని అతనికి అభయాన్నిచ్చారు.
మరొక
ఉదాహరణలో సాయిబాబా సద్బ్రాహ్మణుడయిన కాకా సాహెబ్
దీక్షిత్ ని పిలిచి కత్తితో మేకను చంపమని ఆజ్ఞాపించారు. కాకా సాహెబ్ బాబాయందు అచంచలమయిన విశ్వాసము, భక్తి
ఉన్నవాడు. వెంటనే ఆపని చేయడానికి తయారయ్యాడు. అపుడు బాబా “ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవయి ఉండి ఒక మేకను చంపెదవా?” అని ఆగమని
చెప్పారు.
అప్పుడు కాకా “నీ అమృతమువంటి పలుకులే
మాకు చట్టము. మాకింకొక చట్టమేమీ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకుంటాము. మీరూపమును ధ్యానిస్తూ రాత్రింబవళ్ళు మీ ఆజ్ఞను పాటింతుము. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞను అక్షరాలా పాటించుటె మాధర్మము.”
“ఇతర
మతాలలోని ఆచారాలు, అభ్యాసాలు మాకు తెలియవు.
గురువు చెప్పిన మాటలే శిరోధార్యమని అవే మనకు వేదశాస్త్రాలని చెప్పుకోవడానికి
మనము సిగ్గుపడనక్కరలేదు”.
“మీశిష్యులుగా
మీ ఆజ్ఞలను వినయవిధేయతలతో పాటించడమే మాకు తెలుసు.
అవసరమయితే మీఆజ్ఞలను పాటించడానికి మాప్రాణాలనయినా అర్పిస్తాము”. అని సమాధానమిచ్చాడు.
అందుచేతనే
ఒకసారి సాయిబాబా అంత్యకాలములో నిన్ను విమానములో తీసుకుని వెడతానని కాకాసాహెబ్ కు మాటిచ్చారంటే
అందులో ఆశ్చర్యం లేదు. ఆతరువాత కాకా సాహెబ్, హేమాడ్ పంతుతో కలిసి బొంబాయిలో లోకల్ రైలులో ప్రయాణము చేస్తూ బాబా విషయము మాట్లాడుతూ
ఉన్నట్లుడి తన శిరస్సును హేమాడ్ పంతు భుజముపై వాల్చి ప్రాణాలను విడిచాడు.
అధ్యాయం – 50
ఎవరైనా
సరే తమ గురువుయందు పూర్తి నమ్మకం, గౌరవం ఉండాలనీ, అతి తెలివితేటలు ప్రదరించరాదని బాబా
బోధించారు. “తెలివితేటలను ప్రక్కకు పెట్టి,
‘సాయి, సాయి’ నామమును జ్ఞప్తియందుంచుకొనుము.
మీప్రయత్నములన్నీ సఫలమవుతాయి. నామాటలను
సంశయించవద్దు”
అధ్యాయం – 10
జ్ఞానప్రాప్తికి
హిందూ ధర్మంలోని ఆరు శాస్త్రాలలో నైపుణ్యం అవసరం లేదు. గురువే కర్త, గురువే రక్షకుడు అన్న ఒక్క విశ్వాసం
చాలు. గురువు గొప్పదనం చాలా గొప్పది. గురువే సాక్షాత్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆవిధంగా గురువు స్థితిని తెలుసుకొన్నవారే ముల్లోకాల్లో
ధన్యులు”.
అధ్యాయం – 19
(రేపు
సబూరి )
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment