08.10.2016 శనివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయిబాబావారి
బోధనలు మరియు తత్వము
ఆంగ్లమూలం
: లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్ , హైదరాబాద్ - సెల్ : 9440375411
18. గురుభక్తి – 2వ.భాగమ్
18. గురుభక్తి – 2వ.భాగమ్
“ఆయన
సమర్పించమన్న దక్షిణ రెండుపైసలు శ్రద్ధ, సబూరి తప్ప మరేమీ కాదు. నేనవి ఆయనకు వెంటనే సమర్పించేసుకున్నాను. నాగురువు ఎంతో సంతోషించారు”. (ఓ.వి. 52)
“ఆవిధంగా
నేను నాగురువును 12 సంవత్సరాలపాటు సేవించాను.
వారే నాకు అన్న వస్త్రములనిచ్చి పెంచి పోషించారు. ఆయన నాయెడల అపరిమితమయిన ప్రేమను
కనపర్చారు”. (ఓ.వి.62)
“ఆప్రేమను
నేనెలా వర్ణించగలను? మేమిద్దరం ఒకరి కండ్లలోకి
ఒకరం చూచుకుంటూ ధ్యాననిమగ్నులమయిపోయేవారం.
ఆవిధంగా మేము అపరిమతమైన ఆనందంలో మునిగిపోయేవారము. ఇక దేనిమీద నాదృష్టి ఉండేది కాదు. మరొక ఆలోచనకూడా లేకుండా నాగురువు కళ్ళలోకే చూస్తూ
ఉండేవాడిని”. (ఓ.వి.63)
“ఆకలిదప్పులను
మరచి రేయింబవళ్ళు నాగురువు ముఖాన్నే చూస్తూ ఉండేవాడిని. నాగురువు లేకపోతే నామనసు అస్థిమితంగా ఉండేది”. (ఓ.వి. 64)
“ధ్యానించుకోవడానికి
నాకు నాగురువు తప్ప మరేదీ లేదు. ఆయన తప్ప నాకు
వేరే లక్ష్యం లేదు. నిజంగా ఆయన చేతలు అద్భుతం”.
(ఓ.వి. 65)
(ఓ.వి. 65)
“తల్లి
తాబేలు తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చి పెంచుతుంది. నాగురువు కూడా అదే విధంగా తమ దృష్టితో నన్ను పోషించుచుండెడివారు.”
(ఓ.వి. 68) అధ్యాయం – 19
(ఓ.వి. 68) అధ్యాయం – 19
ఆవిధంగా
సాయిబాబా, ఎవరయినా తమ గురువు మీద ఏవిధంగా దృష్టిని నిలిపి ధ్యానించుకోవాలో చాలా సరళంగా
బోధించారు. ఎటువంటి మాయ మంత్రాలు లేకుండా కేవలం
ప్రేమ, విశ్వాసాలతో గురువును ఆరాధించడమెలాగో సాయిబాబా చేసిన హితోపదేశం కేవలం రాధాబాయికి
మాత్రమే కాదు, మనందరికీ కుడా. సాయిబాబావారి
ఇదే అనుభవం శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో వివరింపబడింది.
“నాగురువు పాఠశాల ఎంతో అందమయినది. నేను నా తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమానుబంధాలను కూడా మరచిపోయాను. మోహ మమకారాలనే సంకెళ్ళు తెగిపోయాయి. బంధాలనుండి ఎంతో సులభంగా విముక్తి కలిగింది”. (ఓ.వి. 76)
“ఏదీ అసాధ్యంగా కనిపించలేదు. నా చెడుపోకడలన్నీ అదృశ్యమయిపోయాయి. నా మునుపటి కర్మలన్నీ తుడిచిపెట్టుకుని పోయాయి. నాగురువుగారి కంఠాన్ని కౌగలించుకుని తదేకంగా ఆయననే చూస్తూ ఉండాలనిపించింది. (ఓ.వి. 77)
“ఆయన ప్రతిబింబం నాకనుపాపలలో నిలవనప్పుడు, నాకన్నులు వట్టి మాంసపు ముద్దలు తప్ప మరేమీ కాదని, అంతకన్నా అంధునిగా ఉండటమే మేలనిపించింది. అది అటువంటి బడి”.
(ఓ.వి. 78) అధ్యాయం – 32
ఆగురువే సాయిబాబాను నీటితో నిండుగా ఉన్న బావిలో తలక్రిందులుగా వ్రేలాడదీసినా దానిని ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా బ్రహ్మానందాన్ననుభవించారు. తన గురువుపై ఆయనకెంత భక్తో కదా! అటువంటి శిష్యులను ఎటువంటి ఆలస్యం లేకుండా తమ స్వంత స్థాయికి చేరుకునేలా వారి గురువులే చేర్చుతారని సంత్ తుకారామ్ చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
ఇంతే కాకుండా సాయిబాబా సందర్భం వచ్చినపుడెల్లా గురువును ఏవిధంగా సేవించాలో, ఉత్తమ శిష్యుని లక్షణాలు ఏమిటో అన్నీ వివరంగా చెప్పేవారు.
1
1. గురువు ఆజ్ఞనలను ఖచ్చితముగా శిరసావహించుట:
1. గురువు ఆజ్ఞనలను ఖచ్చితముగా శిరసావహించుట:
గురువు ఆజ్ఞాపించగానే అవి ఎటువంటివయినా
సరే, అసాధారణమయినవయినా, కష్టమైనటువంటివైనా సరే, ఎటువంటి సంకోచం లేకుండా వెంటనే అమలుపరచగలిగేవాడయి
ఉండాలి. ఒక్కొక్కసారి శిష్యుని పరీక్షించడానికి
గురువు కావాలనే పరీక్షిస్తూ ఉంటారు. ఉదాహరణకి
38వ.అధ్యాయంలో సద్బ్రాహ్మణుడయిన దాదాకేల్కర్ ని బజారుకు వెళ్ళి మాంసము కొనితెమ్మని
చెప్పారు. ఆరోజు పవిత్రమయిన ఏకాదశి. దాదా కేల్కర్ ఎంతో వినయవిధేయతలు కలిగిన శిష్యునిగా
బాబా ఆజ్ఞ ప్రకారం బయలుదేరబోతుండగా సాయిబాబా వద్దని వారించారు. అలాగే 23వ.అధ్యాయంలో మరొక ఉదాహరణ. కాకాసాహెబ్ దీక్షిత్ సదాచారపరాయణుడయిన బ్రాహ్మణుడు. అటువంటివానిని సాయిబాబా ఒకరోజు కత్తితో మేకను చంపమని
ఆజ్ఞాపించారు. కాకాసాహెబ్ సందేహించకుండా వెంటనే
కత్తితో మేకను చంపబోయాడు. సాయిబాబా అతనిని
వారించి “కాకా! ఈ మూగ జంతువయిన మేకను, బ్రాహ్మణుడవై ఉండి చంపడానికి నీకు సిగ్గుగా లేదా?”
అని ప్రశ్నించారు.
అప్పుడు కాకా ఈవిధంగా సమాధానమిచ్చాడు. “బాబా నీఅమృతమగు పలుకులే మాకు శిరోధార్యము. అదే మాకు చట్టము. మాకింకొక చట్టము తెలియదు. గురువు ఆజ్ఞను అక్షరాల పాటిచుటయే మావిధి, ధర్మము". (ఓ.వి. 171)
“అది తప్పా ఒప్పా అనునది మాకు తెలియదు. అవసరమయినచో గురువు ఆజ్ఞను పాటించుటలో మాప్రాణాలనయినా అర్పించుటకు మేము సిధ్ధం”. (ఓ.వి. 181)
ఆతరువాత హేమాడ్ పంత్ కూడా ఉత్తమ శిష్యుని యొక్క గుణగణాలు ఏవిధంగా ఉండాలో చెబుతూ వాటిలో ముఖ్యంగా కావలసినవి కూడా చెప్పారు.
1.
గురువుకేమి
కావలెనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు.
2.
వేరొక
గురువు ఎంత గొప్పవాడయినప్పటికీ, తన గురువు ఆశ్రయాన్ని త్రోసిరాజని వెళ్లనటువంటివాడు
ఉత్తమ శిష్యుడు.
ఈ విషయాన్ని
మనసులో స్థిరంగా నిలుపుకొని, తన గురువు మీద అచంచలమయిన విశ్వాసంతో ఉండేవాడె ఉత్తమ శిష్యుడు. (ఓ.వి. 176)
మరొక వ్యక్తియొక్క
గురువు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాడయి ఉండవచ్చు. మన గురువుకు అంత కీర్తి ఉండకపోవచ్చు. అయినా గాని మనం మన గురువుయందు పూర్తి నమ్మకంతో ఉండాలి. ఇదే ఇక్కడ ఇవ్వబడిన సలహా.
(ఓ.వి. 178) అధ్యాయం – 12
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(ఓ.వి. 178) అధ్యాయం – 12
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment