07.12.2016
బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి
లీలామృతం
నేనుండ భయమేల
ఈ
రోజు సాయిలీలా.ఆర్గ్ లో ప్రచురింపబడిన ఒక అధ్బుతమయిన లీల తెలుసుకుందాము. బాబాని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు, మనం ఆహ్వానిస్తే
తప్పక వస్తారు. ఆయన ఏదో ఒక రూపంలో తప్పక వస్తారు.
ఇపుడు శ్రీ వి.జి. వైద్య, బెంగళూరు – 560025 అనుభవం…
1947
వ.సంవత్సరంలో నేను బెల్గాంలో 6th స్టాండర్డ్ చదువుతున్న రోజులు. మాబంధువులొకరు నన్ను, సాయిబాబా పూజ జరుగుతున్న రైల్వే
స్టేషన్ మాస్టారుగారి ఇంటికి తీసుకుని వెళ్ళారు. అంతకు ముందు నాకు షిరిడీ సాయిబాబా అంటే ఎవరో తెలీదు. అక్కడ ఉన్న బాబా చిత్రపటం నన్నాకర్షించింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకుంటూ ఆయనకు శిరసువంచి
నమస్కరించాను. ఆయన తన చిరునవ్వుతో నన్నాశీర్వదించినట్లుగా
అనిపించింది. అప్పటినుండి బాబా భక్తుడినయ్యాను. ఆయనె నా ఇష్టదైవం. బాబా తప్ప ఇంకెవరినీ నాఇష్టదైవంగా అంగీకరించడానికి
నామసొప్పలేదు. బాబాయే నాకు మార్గదర్శకునిగా
అనుక్షణం నన్ను రక్షిస్తూ ఉన్నారని చెప్పడానికి నాకెంతో గర్వంగా ఉంటుంది. ఒక సాయిదాసునిగా నేనెంతో అదృష్టవంతుడిని. నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. అయినా సాయి అనుగ్రహం నామీద ప్రసరించడం వల్ల నేనెంతో
భాగ్యవంతుడిని. ఆయన ఆశీర్వాదాలవల్లనే నాకు మంచి భార్య, తెలివైన పిల్లలు, నాకు అండదండలుగా
ఉండే మంచి స్నేహితులు లభించారు.
నాజీవితంలో
నాకవసరమయినవన్నీ బాబా సమకూర్చారు. బాబా నాకు
ఒక విషయంలో ఏవిధంగా సహాయం చేశారో వివరిస్తాను.
అది నేనెన్నటికీ మరచిపోలేనిది.
1982
వ.సంవత్సరంలో నాభార్య, మాయిద్దరబ్బాయిలకీ ఉపనయనం చేద్దామని చెప్పింది. మా అబ్బాయిల వయస్సు ఒకడికి 15, మరొకడికి 12 సంవత్సరాలు. మాఇంటిలో జరగబోయే మొట్టమొదటి పెద్ద వేడుక ఇదే కావడంతో
బంధువులందరినీ, స్నేహితులందరినీ ఆహ్వానించి చాలా ఘనంగా చేద్దామని చెప్పింది. ఈ ఉపనయనానికి ఖర్చు ఎంతవుతుందో సుమారుగా లెక్కవేశాను. 5,000 రూపాయలు అవ్వచ్చనిపించింది. నాకు నాజీతం తప్ప అధికంగా కూడబెట్టినదేమీ లేదు. నాభార్యని నిరాశ పరచడం నాకిష్టం లేకపోయింది. బాబా అనుమతిస్తే తప్పకుండా చేద్దామని ఈ వ్యవహారాన్ని
బాబా భుజ స్కంధాలపై పెట్టి ఒక ఛాలెంజిగా తీసుకున్నాను.
నేను
వెంటనే తిన్నగా కె.ఆర్.గోపినాధ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటిలో పెద్ద బాబా చిత్రపటం ఉంది. అక్కడ ఆయన ఉన్న ప్రదేశం ఎంతో పవిత్రంగాను, భక్తిభావం
ఉట్టిపడేటట్లుగాను ఉంటుంది. నేను ఆయనకు నమస్కరించి
ఉపనయనం చేయమంటారా, లేదా అని ఆయన అనుమతి కోసం చీటిలు వేశాను. ఉపనయనం చేయమని బాబా అనుమతిని ప్రసాదించారు. ఆయన అనుమతితో ఉపనయనం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు
ప్రారంభించాను. వారం రోజులలోనే నాస్నేహితుని
(అతను కూడా బాబా భక్తుడు) వద్దనుంచి రూ.1500/- అప్పు తీసుకున్నాను. మా ఆఫీసరు వద్దనుంచి
రూ.1500/- అడ్వాన్స్ తీసుకున్నాను. 5 నెలలనుండి
వివాదంలో పడి పెండింగ్ లో ఉన్న లీవు శాలరీ రూ.1300/- వచ్చాయి. అవసరమయిన డబ్బు సమకూడింది. కాని, ఈ కార్యక్రమం నిర్వహించడానికి కళ్యాణ మండపం
దొరకలేదు. అన్నీ ముందే బుక్ అయిపోయాయి. మాకు ఏర్పడ్డ ఇబ్బంది గమనించి నాకు తెలిసున్న పెద్ద
వర్తకుడు ఖాళీగా ఉన్న తన బంగళా ఇస్తానని చెప్పాడు. అది అన్ని సౌకర్యాలతో మేము ఫంక్షన్ చేసుకోవడానికి
చాలా అనువుగా ఉంది. వంటమనిషి కూడా వెంటనే దొరికింది. మే 27 1982, న ముహూర్తం పెట్టాము. అది కూడా గురువారం అయింది. శుభలేఖలు ప్రింట్ చేయించి, అందరికీ పంపించాము. బాబావారిని కూడా ఆహ్వానిస్తూ, షిరిడీకి కూడా ఒక
శుభలేఖ పంపించాము. బంధువులందరూ ముందుగానే వచ్చారు. మా ఇల్లంతా ఒక పండుగ వాతావరణంలా మారిపోయింది. మే,25, 1982 గణపతి హోమంతో కార్యక్రమాలు మొదలయ్యాయి.
బాబా ఏరూపంలోనయినా ఈకార్యక్రమానికి వస్తారనే నమ్మకం
నాకుంది. ఆయన వచ్చి ఈ ఉపనయన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి సహాయం చేస్తారని
నా ప్రగాఢ విశ్వాసం. వంటకాలు, ఇంకా భోజన ఏర్పాట్లు
అన్నీ సవ్యంగా జరిగేటట్లు చూసుకోమని మాతోడల్లుడి మీద బాధ్యత పెట్టాను. అంతే కాదు, భోజనానికి బాబాగారు వస్తారేమో చూస్తూ
ఉండమని కూడా చెప్పాను.
ఆతరువాత
జరిగిన సంఘటన మాతోడల్లుడిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హటాత్తుగా ఒక సాధువు ఎవ్వరినీ ఏమీ అడగకుండా నేరుగా
భోజనశాలలోకి వచ్చాడు. అక్కడికి వచ్చి మౌనంగా
నిలబడ్డాడు. సాధువు రూపంలో వచ్చినది బాబా తప్ప మరెవరూ కాదనే ఉద్దేశ్యంతో మా తోడల్లుడు
ఆనందంగా ఆయనకి భోజనం వడ్డించాడు. భోజనం చేయగానే
ఆసాధువు చిరునవ్వుతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
కాని నేను భోజనాలకి 250 మందిని ఆహ్వానించాను. వారికి సరిపడా వంటకాలను తయారు చేయించాను. కాని, ఈ ఫంక్షన్ కి రెట్టింపు మంది వచ్చి భోజనాలు
చేశారు. బాబాయే నావెనుక అదృశ్యరూపంలో ఉండి
ఎక్కడా ఎటువంటి లోపం జరగకుండా ప్రతి పనీ తానే నాచేత చేయించారు. ఈఫంక్షన్ విజయవంతంగా జరిగిందంటే అది బాబా నావెనుకే
నిలబడి అంతా సవ్యంగా జరిపించారన్నదానికో ఎటువంటి సందేహంలేదు. నాకు ఎటువంటి మాట రాకుండా బాబా కాపాడారని చెప్పడానికి
నేనెంతో గర్విస్తున్నాను.
ఆయన
మీద పుర్తి నమ్మకం ఉంచి సర్వశ్య శరణాగతి చేసినట్లయితే ఆయన మనకి తప్పకుండా సహాయం చేసి
మనలని రక్షిస్తూ ఉంటారు.
ఆయన
అనుగ్రహం మనందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను.
(ఆధారం
– 1983వ. సం. అఖిలభారత సాయి భక్తుల 20వ.సమ్మేళనం
– నెల్లూరు.)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment