09.04.2018 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని
విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.
SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ
ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్
గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 15 వ.భాగమ్
21.11.1971 ఈ రోజు స్వామీజీ ధన సంపాదన, ఆ ధనాన్ని తన స్వాధీనంలోనే ఉంచుకోవడం గురించి వివరించారు. “భగవంతునినుంచి నీవు పొందే ఎటువంటి సంపదయినా ఎప్పటికీ నీవద్దనే ఉంటుంది. కాని ఐహికంగా సంపాదించిన సంపద ఆవిధంగా ఉండదు.
ధనవంతుడు తన వద్దనున్న ధనాన్ని ధర్మకార్యాలకు వినియోగించినట్లయితే ఆవిధంగా వినియోగించినవానికి, అటువంటి కార్యాల ద్వారా లబ్ధిపొందిన వారికి క్షేమకరంగా ఉంటుంది. సమాజ సేవలోని రహస్యం యిదే. అటువంటి సేవాకార్యక్రమాల వల్ల ధనవృధ్ధి కలుగుతుంది. ధర్మమనగా నేమి? ఈ ప్రపంచంలో నీకిష్టమయినది ఏదయినా ఉన్నట్లయితే, దానిలో కొంత భాగాన్ని అవసరమున్నవానికి కొంత యివాలి. దీనినే ధర్మమంటారు. అన్ని జీవులయందు మనము దయతో ఉండాలి. అది మనకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆకలితో ఉన్న కుక్కకు కాస్త రొట్టె ముక్క పెట్టినట్లయితే అది నీకు తృప్తిని, ఆనందాన్ని కలుగజేస్తుంది. అదే బాబా చెప్పిన ఉపదేశం కూడా. దయతోకూడిన ఒక మంచి మాట, మృదువుగా మాటలాడే మాటలు మనలను ఉన్నతస్థితికి తీసుకుని వెడతాయి. భగవంతుడిని ప్రార్ధించే సమయంలో కూడా మన భావం ఈవిధంగా ఉండాలి. “హే భగవాన్, మేము నీ పాదాలను ఆశ్రయిస్తున్నాము. మమ్మల్ని రక్షించు” మనము ఆహారం తీసుకుంటున్నా నిద్రపోతున్నా, ప్రయాణము చేస్తున్నా, నడుస్తూ ఉన్నా అన్ని సమయాలలోను ఆయన నామాన్ని స్మరించుకుంటూనే ఉండాలి. మనము పాత్రలను శుభ్రం చేయడానికి సబ్బులను గాని, చింతపండును గాని ఉపయోగించి శుభ్రంగా కడుగుతాము. అదేవిధంగా మన మనసులో నిండిపోయి ఉన్న అరిషడ్వర్గాలను భగవన్నామంతో తొలగించి మనస్సును శుభ్రపరచుకోవాలి.
మనం ముఖ్యంగా అలవరచుకోవలసిన మంచి గుణం ఏమిటంటే ఇతరులలోని దోషాలను ఎత్తి చూపరాదు. అందరిలోను నువ్వు మంచిని చూస్తే నువ్వుకూడా మంచివాడివవుతావు. ఈ కలియుగంలో భగవన్నామమే మహత్తరమయిన బ్రహ్మాండమయిన శక్తి.
23.11.1971 : ఈ రోజు స్వామీజీ పితృయజ్ఞం గురించి వవరించారు.
“పితృయజ్ఞమనేది ఎంతో శ్రధ్ధగా అత్యంత విశ్వాసంతో
చేయవలసిన కార్యం. పితృయజ్ఞం చేయడంలో విఫలమయినట్లయితే
అతనియొక్క సంతానానికి చెముడు, అంధత్వం మొదలయిన అంగవైకల్యాలు సంభవిస్తాయి. పితృతర్పణం, పితృయజ్ఞం యివి తప్పక చేయవలసినవని శాస్త్రాలు
మనకి నిర్దేశించాయి. ఆవిధంగా చేయడం మానవులయొక్క
విద్యుక్తధర్మం. పితృయజ్ఞం చేసినట్లయితే దేవతలు సంతోషిస్తారు.
పితృయజ్ఞం చేసినవానికి మంచి ఆరోగ్యం, మంచి జ్ఞాపకశక్తి కలిగి ఆనందంగా జీవిస్తాడు. తల్లిదండ్రులే ప్రప్రధమ దైవాలు. మొట్టమొదటగా మనం మన తల్లికి సేవ చేయాలి. ఆ తరువాత తండ్రికి ఆఖరికి గురువుకు సేవచేయాలి. ప్రప్రధమంగా తల్లికే ప్రాధాన్యతనివ్వాలి. తల్లి దేనిని త్యాగం చేసినా తన పిల్లల క్షేమం కోసమే చేస్తుంది. మనం ఏనాటికయినా మన తల్లి ఋణం తీర్చుకోగలమా? ఆ తరువాతి స్థానం తండ్రిది. ఆయనకు కూడా మనం విధేయులమై కృతజ్ఞతాభావంతో సేవించాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వరకు వారికి మనం శాయశక్తులా మన శక్తిసామర్ధ్యాలను బట్టి సేవ చేసుకోవాలి. వారి మరణానంతరం కూడా మన విధి ప్రకారం వారికి ఋణపడి ఉంటాము. జీవుడు ఈ భూమినుంచి వెళ్ళిపోయిన తరువాత జన్మతాలుకు వాసనల కారణంగా అశాంతిగా ఉంటాడు. మనం వారి గురించి ప్రార్ధించాలి.”
పితృయజ్ఞం చేసినవానికి మంచి ఆరోగ్యం, మంచి జ్ఞాపకశక్తి కలిగి ఆనందంగా జీవిస్తాడు. తల్లిదండ్రులే ప్రప్రధమ దైవాలు. మొట్టమొదటగా మనం మన తల్లికి సేవ చేయాలి. ఆ తరువాత తండ్రికి ఆఖరికి గురువుకు సేవచేయాలి. ప్రప్రధమంగా తల్లికే ప్రాధాన్యతనివ్వాలి. తల్లి దేనిని త్యాగం చేసినా తన పిల్లల క్షేమం కోసమే చేస్తుంది. మనం ఏనాటికయినా మన తల్లి ఋణం తీర్చుకోగలమా? ఆ తరువాతి స్థానం తండ్రిది. ఆయనకు కూడా మనం విధేయులమై కృతజ్ఞతాభావంతో సేవించాలి. తల్లిదండ్రులు జీవించి ఉన్నంత కాలం వరకు వారికి మనం శాయశక్తులా మన శక్తిసామర్ధ్యాలను బట్టి సేవ చేసుకోవాలి. వారి మరణానంతరం కూడా మన విధి ప్రకారం వారికి ఋణపడి ఉంటాము. జీవుడు ఈ భూమినుంచి వెళ్ళిపోయిన తరువాత జన్మతాలుకు వాసనల కారణంగా అశాంతిగా ఉంటాడు. మనం వారి గురించి ప్రార్ధించాలి.”
27.11.1971 : హిరణ్యగర్భో,
మాధవో, మధుసూధనః” భగవంతునియొక్క ఈ నామాలకు
స్వామీజీ అర్ధాన్ని వివరించారు. భక్తులలో ఎవరికయినా
వాటి అర్ధం తెలుసా అని అడిగారు. ఎవరినుంచి
సమాధానం రాకపోవడంతో ఆయనే అర్ధాన్ని వివరించారు.
హిరణ్యగర్భ : ఒకరకమయిన
గ్రుడ్డుయొక్క పెద్ద గుల్ల. హిరణ్యమనగా బంగారము. హృదయమనే అర్ధం కూడా ఉంది. బ్రహ్మకు కూడా హిరణ్యగర్భుడనే
పేరు ఉంది. ప్రళయకాలంలో ఆభగవంతుడు ప్రతివారిని
తన హిరణ్యగర్భంలోనికి లాక్కుంటాడు. సృష్టికాల
సమయంలో ప్రతివారు హిరణ్యగర్భంనుండే బయటకు వస్తారు.
మాధవో : మాధవః లక్ష్మీదేవి మాధవుని హృదయంలో నివసిస్తుంది. లక్ష్మీదేవి నివాస స్థానం మాధవుని హృదయం. మాధవుడు సృష్టిని రక్షించేవాడు.
మధుసూధన : చక్కెర, తేనెలాంటి తీయని పదార్ధమేదయినా దానికి ‘మధు’ అని పేరు. అజ్ఞానం వల్ల మానవుడు చేసే అన్ని చర్యలవల్ల అతను ఆనందాన్ని అనుభవిస్తాడు. కాని దానివల్ల వచ్చే ఫలితాలను జీర్ణించుకోలేడు. అటువంటి వ్యక్తికి భగవంతుడే రక్షణభారాన్ని వహిస్తాడు. దాని ఫలితంగా అతనిలోని వివేకం మేల్కొని పశ్చాత్తాపం కలుగుతుంది. అజ్ఞానంలో మునిగిపోయి తాను అంతవరకు చేసిన పనికిమాలిన పనులు ఎంత అర్ధరహితమయినవో అని గ్రహించుకుంటాడు. క్రమక్రమంగా భగవంతునివైపు దృష్టిని మరల్చుకుని ఆయనకు నిజమయిన భక్తునిగా మారిపోతాడు. భగవంతుడే ‘సూధన’ లేక మనలోని అన్ని చెడుధోరణులను నిర్మూలించేవాడు. కొంత సమయం పట్టినప్పటికి, తామస గుణస్వభావం వల్ల సమాజంలో పాపకర్మలనాచరించిన మిక్కిలి దుష్టులయిన పాపాత్ములు సయితం భగవంతునివైపు ఆకర్షింపబడి ఆయన సన్నిధానానికి చేరుకుంటారు. పురాణాలలో శ్రీమహావిష్ణువు ‘మధు’ అనే రాక్షసుడిని సంహరించినట్లుగా వివరింపబడింది.
శతృఘ్నో : మనలోనున్న అన్ని అరిషడ్వర్గాలను పారద్రోలేవాడు.
వ్యాప్తో : శ్రీమనారాయణుడు
లక్ష్మీదేవితో సహా ప్రతివారిలోను హృదయమనే హృదయాకాశములో
నివస్తిస్తాడు. ప్రళయకాలంలో ఆయన అన్నిటినీ
తనలోకి ఇముడ్చుకునేవాడు.
వాయుః : సకల ప్రాణులు
మనుగడ సాగించడానికి వాయువు అవసరం. వాయు రూపంలో
సకలమును పోషించెడివాడు, రక్షించేవాడు.
అధోక్షజః : భూమి
(అధః) అకాశం (అక్ష) ఈ రెండిటి నడుమా అదృశ్యంగా ఉంటూ అన్నింటిలోను వ్యాపించి పుట్టినవాడు. పంచ జ్ఞానేంద్రియాలు అంతర్ముఖమైనపుడు మాత్రమే కన్పించేవాడు.
సుదర్శనః ; భక్తులకు మనోహరమయిన దర్శనమునొసంగువాడు.
కాలహః : ఆ భగవంతుడే కాలము ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఆయన ఉనికి లేని క్షణమే ఉండదు.
పరమేష్టి : ఆ భగవంతుడే
అత్నున్నతమయిన మహా శ్రేష్టుడు. ఘనుడయిన గురువు.
అనగా బ్రహ్మే మొట్టమొదటి గురువు. అంతే
కాదు. ఘనత వహించిన గురువు. నిర్గుణబ్రహ్మకన్నా
సగుణబ్రహ్మగా ఆయనను చాలా సులభంగా తెలుసుకోగలుగుతాము.
పరిగ్రహహః : భగవంతుడు
తన భక్తులు సమర్పించినవాటిని స్వీకరిస్తాడు.
కాని సర్వశ్రేష్టుడయిన పరమాత్మునిగా తనను తెలుసుకోగోరే భక్తులకు ఎదురయే కష్టాలను
గాని మరేయితర అడ్డంకులనయినా తొలగించి తీసివేయగల సమర్ధుడు ఆయన. ఆవిధంగా భగవంతుని గురించి తెలుసుకునే మార్గంలో ఏదయినా
అడ్డంకి కలగడానికి కారణమయితే ఉదాహరణకి పేదరికం దానిని తొలగిస్తాడు. గీతలో చెప్పబడిన ‘అర్ధార్ధి’ తన కష్టాలను, బాధలను
తొలగించమని ప్రార్ధిస్తాడు. ఈ ప్రపంచంలో సంసారి
ఆవిధంగా భగవంతుని ప్రార్ధించడం న్యాయసమ్మతమయినది, శాస్త్ర సమ్మతమయినది. భగవంతునికి మన కోరిక ఏమిటో తెలుసు కాబట్టి మనం వాటిని
తీర్చమని ఆయనను వేడుకోనక్కరలేదని కొంతమంది చెబుతారు. జ్ఞాని అయినవానికే ఇటువంటి ఆలోచనా విధానం ఉంటుంది. కాని తన బాధలను తొలగించమని వేడుకొనే భక్తునికి కాదు. తల్లి, తన బిడ్డ ఆకలి వేసినపుడు గాని, మరేదయినా కావాలనే
కోరిక ఉన్నపుడు గాని ఏడిచే వరకు ఎదురుచూసినట్లుగానే, భగవంతుడు కూడా తన భక్తుడు తన కోరికలు
తీర్చమని తనను వేడుకునే సమయం వరకు వేచి చూస్తాడు. భక్తుడు తన భారాన్నంతా భగవంతుని మీద
పెట్టినట్లయితే ఆయన తప్పకుండా ఆ భారాన్ని మోస్తాడు. (అనన్యాశ్చింతయంతోమా). మనం ఆయనని ఈ విధంగా ప్రార్ధించాలి. “హే భగవాన్!
నాకేమీ తెలియదు. నేను నీవాడిని. నన్ను
రక్షించి కాపాడు.” “నువ్వు నాకు బుధ్ధిని ప్రసాదించావు. దానిని నేను సక్రమమయిన మార్గంలో వినియోగించుకునేలా
చెయ్యి” అని ఆయనకు చెప్పుకోవాలి. ఆయన మనకు
సంపదనిచ్చాడు. దానిని మనము సక్రమంగా వినియోగిమంచుకునేలా
మంచి బుద్ధిని ప్రసాదించాలి. మన హృదయాన్ని
ఆయనకి సమర్పించుకుని మనం స్వచ్చంగా నిర్మలంగా ఉండాలని కూడా భగవంతుడు ఆశిస్తాడు. అందుచేత మనము “భగవాన్, యిదంతా నీదే. అటువంటపుడు నేను నీకేమి యివ్వగలను? నేను నీనుంచి వచ్చిన ఒక కిరణంలాంటివాడిని. ఏదో ఒకరోజు నేను నీవద్దకే చేరుకుంటాను” అని ఆయనకు
విన్నవించుకోవాలి. మనందరం ఈ భావంతో ఉండాలి. “ హే భగవాన్, నేను నిన్ను గుర్తుంచుకోలేను. ఎల్లపుడు నిన్నే గుర్తుంచుకుని నిన్ను స్మరించుకునేలా
నన్ను దీవించు” అని ఆయనను ప్రార్ధించాలి. మనకేది
మంచో మన గురువుకే తెలుసు కావట్టి మనం అనుసరించవలసిన మార్గాన్ని గురువే నిర్ణయిస్తాడు. మనం ఆ జగన్మాతని కూడా ఈ విధంగా ప్రార్ధించాలి.
“అమ్మా! నేను నీ బిడ్డను. నన్ను కాపాడు.” ఆమెకు ఈ విధంగా విన్నవించుకుంటే అమ్మ నిన్ను ఉపేక్షిస్తుందా? అమ్మ దయవల్ల ముఖ్యంగా స్త్రీవ్యామోహాన్ని నిర్మూలించుకున్నవాడయి ప్రతిస్త్రీలోను ఆ జగన్మాతను దర్శిస్తాడు. ఈ మాయను సృష్టించినదెవరు? ఆభగవంతుడె దానికి సృష్టికర్త. భగవద్గీతలో ‘మమమాయా దురత్యయా’ అని భగవానుడే స్వయంగా చెప్పాడు.
“అమ్మా! నేను నీ బిడ్డను. నన్ను కాపాడు.” ఆమెకు ఈ విధంగా విన్నవించుకుంటే అమ్మ నిన్ను ఉపేక్షిస్తుందా? అమ్మ దయవల్ల ముఖ్యంగా స్త్రీవ్యామోహాన్ని నిర్మూలించుకున్నవాడయి ప్రతిస్త్రీలోను ఆ జగన్మాతను దర్శిస్తాడు. ఈ మాయను సృష్టించినదెవరు? ఆభగవంతుడె దానికి సృష్టికర్త. భగవద్గీతలో ‘మమమాయా దురత్యయా’ అని భగవానుడే స్వయంగా చెప్పాడు.
దైవీహ్యేషా గుణమయీ మమ
మాయా దురత్యయా
మామేవ యే ప్రపద్యంతే
మాయామేతాం తరంతి తే
(నా మాయ త్రిగుణాత్మకమైనది. అలౌకికమైనది.
ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కాని
కేవలము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, సంసార సముద్రమునుండి బయటపడగలరు.)
(అ.7 శ్లో.14)
“హే భగవాన్, ఈ మాయను
సృష్టించినది నువ్వే. నన్ను ఈ మాయనుండి బయటపడేటట్లు
చేసి విశిష్టమయిన జీవితాన్ని గడిపేలా అనుగ్రహించు” అని ఆయనను ప్రార్ధించుకోవాలి. వాస్తవానికి గురువే భగవంతుడు.
(శ్రీ సాయి సత్ చరిత్ర 30 వ.అధ్యాయం లో కూడా ఈ విధంగా చెప్పబడింది. ఓ.వి.46 ... సత్పురుషులు భగవంతుని అవతారాలు. ఉభయులలోను లవలేశమైనా భేదం లేదు. వారిద్దరిని వేరు అని తలచటం ద్వైతం. కాని వారుభయులూ ఒక్కరే.)
(స్వామీజీ అనుగ్రహ భాషణాలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment