24.03.2018 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ
సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయి బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శ్రీ సాయి పదానంద రాధాకృష్ణస్వామీజీ
గారు భక్తులనుద్దేశించి చేసిన ప్రసంగాలలోని విషయాలను “Swamiji talks to Devotees” పుస్తకంలోని
విషయాలను తెలుగులో అనువదించి అందిస్తున్నాను.
SrI sai Spiritual Centre, T.Nagar, Bangalore వారు ముద్రించారు. ఈ రోజు ఆ
ఈ పుస్తకానికి సంపాదకులు, ప్రొఫెసర్ పి.ఎస్.నారాయణ రావు, శ్రీ బి.కె. రఘు ప్రసాద్
గార్లు. సాయిలీల.ఆర్గ్ నుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్
: ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట్, హైదరాబాద్, 9440375411
శ్రీస్వామీజీ భక్తులతో
జరిపిన అనుగ్రహ భాషణమ్ - 14 వ.భాగమ్
(స్వామీజీ గారి సంభాషణలలో ఆంగ్లంలో భగవద్గీత శ్లోకాలు పూర్తిగా ఇవ్వబడలేదు. కేవలం సగం వాక్యాలు మాత్రమే ఇవ్వబడ్డాయి. సాయిబంధువులకు వివరంగా తెలియచేయడం కోసం ఆ శ్లోకాలను వాటి అర్ధాలను పూర్తిగా అందిస్తున్నాను. గర్భోపనిషత్ గురించిన ఉపన్యాసం యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను. సాయిబంధువులు కోరినట్లయితే రేపు వాటిని మన బ్లాగులోనే అప్లోడ్ చేస్తాను...త్యాగరాజు 9440375411, 8143626744 )
20.11.1971 : ఈ రోజు స్వామీజీ ఒక తమిళ శ్లోకాన్ని ఉదహరిస్తూ దానియొక్క
అర్ధాన్ని వివరించారు. ఐహిక బంధాలు ఆధ్యాత్మికోన్నతిని
పాడుచేస్తాయి. ఆధ్యాత్మికతతో బంధం ఏర్పరచుకుంటే
ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడుతుంది.
ఈ శ్లోకాన్ని తనకు మూడు
సంవత్సరాల బాలుడు (శ్రీకృష్ణుడు) కలలో కనిపించి చెప్పాడని అన్నారు. జరిగిన సంఘటనంతా స్వామీజీ వివరించారు. --- “నాకు
కాస్త కునుకు పట్టింది.
ఆనిద్రలో ఉండగా స్వప్నంలో
మూడుసంవత్సరాల బాలుడు కనిపించాడు. ఆ బాలుడు
పెద్ద గ్రుడ్డు గుల్లను చూపిస్తూ గట్టిగా పిలిచాడు. “ఇది పిండదశ.
నేను దానిలోనుంచే వచ్చాను అన్నాడు వెంటనే
ఆగుల్ల పగిలింది. అది ఒక పెద్ద గ్రుడ్డును
పోలిఉంది. ఇదే హిరణ్యగర్భం.
(శ్రీవిష్ణుసహస్ర నామంలో 70వ.శ్లోకం "హిరణ్యగర్భః " అనగా బ్రహ్మదేవునికి ఆత్మయైనవాడు. ఆత్మ ఎలా చెప్తే అలా నడుచుకొనే లక్షణం ఉంటుంది. కాబట్టి శ్రీహరి ఆజ్ఞకి అనుగుణంగా బ్రహ్మసృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట.)
ఆబాలుడు గర్భోపనిషత్ లోని శ్లోకాలను వల్లించడం మొదలుపెట్టాడు. మొట్టమొదట బాలునిగా పాత్రపోషించిన తరువాత పెద్దవాడుగా
మారి చివరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు.
ఒకదశ తరువాత మరొక దశను నాకు చూపించసాగాడు.
అంత పెద్దగ్రుడ్డును పగలగొట్టుకుని ఆబాలుడు ఈ భూమి మీదకు ఎలా వచ్చాడా అని నాలోనేనే
ఆలోఛించసాగాను. మనము ఈ భూమిపై ధర్మం తప్పకుండా
ఉన్నంత వరకు ఆభగవంతుడు మనలని కనిపెట్టుకుని యోగక్షెమాలు చూస్తూ ఉంటాడు. అనగా “యోగక్షేమం వహామ్యహమ్”. ఆబాలుడు కృష్ణుడు తప్ప మరెవరూ కాదు.
1
“సమత్వమ్
యోగ ఉచ్యతే 2 బహూనాం జన్మనామంతే” అని ఆయన చెప్పాడు.
1.
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిధ్ధ్య సిధ్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్చతే
(అ.2 శ్లో 48)
ఓ అర్జునా జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమ బుధ్ధితో
నీ విద్యుక్త ధర్మమును నిర్వహింపుము. ఈ సమత్వభావమునే
యోగమందురు.
యోగమునందు వర్తించుమని అర్జునునితో శ్రీకృష్ణ
భగవానుడు పలుకుచున్నాడు. ఆ యోగమనగా నేమి? సదా కలతపెట్టు ఇంద్రియములను అదుపుచేసి భగవానునియందు
మనస్సును లగ్నము చేయుటయే యోగము. ఆ భగవానుడెవ్వరు? దేవదేవుడయిన శ్రీకృష్ణుడే ఆ భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే స్వయముగా యుధ్ధము చేయుమని పలుకుచున్నందున
యుద్ధ ఫలములతో అర్జునునకు ఎట్టి సంబంధము లేదు.
బహూనాం
జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే
వాసుదేవః
సర్వమితి స మహాత్మా సుదుర్లభః (అ.7 శ్లో
19)
అనేక జన్మల పిదప జ్ఞానియైనవాడు (భగత్తత్త్వమును
ఎఱిగినవాడు) సర్వమూ వాసుదేవ మయమే అని భావించి, నన్ను శరణుపొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు.
సూర్యోదయంతో రోజు మొదలవుతుంది. చీకటితో అంతమవుతుంది. ఈ మధ్యకాలంలో జీవులన్నీ బ్రతుకు పోరాటాన్ని సాగిస్తు
ఉంటాయి. అటువంటి సమయంలో ఎవరూ సాధారణంగా భగవంతుని
గురించి ఆలోచించరు. స్వార్ధం వారందరి మీద అధికారం
చెలాయిస్తు ఉంటుంది. స్వప్నంలో మరొక దృశ్యం
గోచరించింది. ఆతరువాత ఆబాలుని తలపై ప్రకాశవంతమయిన
వెలుగు కనిపించింది. తరువాత ఆబాలుడు ఒక సాధువుగాను,
తరువాత త్రాగుబోతుగాను, ఆతరువాత జీవన్ముక్తుడు గాను యిలా వివిధ దశలు కనిపించాయి. తరువాత ఆబాలుడు నన్నిలా అడిగాడు.
“ప్రతివారు ఈ గ్రుడ్డునుండే బయటకు వచ్చారు. ఇపుడు వారు చేయవలసినదేమిటి?”
“మనము పిల్లలవలె ఉండాలి” అని సమాధానమిచ్చాను.
ఈ సమాధానం వినగానే ఆ బాలుడు నవ్వి, పరుగెత్తుకుని
వెళ్ళిపోయాడు. ఆ బాలుడు చాలా వేగంగా పరుగెత్తుకుని
వెళ్ళడం వల్ల నేనతనిని పట్టుకోలేకపోయాను. ఈ
మొత్తం దృశ్యమంతా విశాలమయిన ప్రదేశంలో జరిగినట్లుగా కన్పించింది. నా వెనుక చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్న పెద్ద గ్రుడ్డునుంచి అన్ని రకాల జీవరాశులు
బయటకు వస్తున్నాయి. చివరికి పైనుంచి నీళ్ళు
పడటం ప్రారంభమయి ప్రతిదానిని తడిపేయసాగింది. గర్భోపనిషత్ నుండి వల్లింపబడుతున్న శ్లోకాలలో చాలా
అర్ధం ఇమిడి ఉంది.
https://www.youtube.com/watch?v=1rP38qYsMlA
(ఒకటి 31 రెండవది 25 నిమిషాలపాటు ఉన్న ఉపన్యాసములు.
సాయిబంధువులు కోరినట్లయితే బ్లాగులో అప్ లోడ్ చేస్తాను.
ఆ ఉపనిషత్ లోని సారాంశం ప్రకారం తల్లి గర్భంలో
ఉన్న శిశువుకు ఏడవ లేక ఎనిమిదవ నెల వచ్చేటప్పటికి ఆ శిశువుకు తన పూర్వ జన్మ జ్ఞప్తికి వస్తుంది. శిశువు జన్మించే సమయంలో ‘వాయువు’ ఆశిశువును ముందుకు
తోస్తుంది. అంతే కాదు. తల్లి బాధపడుతున్నా, సంతోషంతో ఉన్నా అవన్నీ కూడా గర్భంలో
ఉన్న శిశువు మీద ప్రభావం చూపిస్తాయని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
(సెల్ ఫోన్ శిశువు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించడానికి ఆస్కారం ఉంది)
నేను స్వప్నంలో దర్శించిన ఈ దృశ్యమంతా చాలా చాలా
అధ్బుతంగా ఉంది. నేనే కనక సినిమాదర్శకుడినయితే
నేను చూసిన దృశ్యాన్నంతా వర్ణిస్తూ సినిమాగా తీసి ఉండేవాడిని. కాని అంత అధ్భుతమయిన దైవాంశసంభూతుడయిన బాలుని పాత్రనెవరు
పోషిస్తారు? కృష్ణుడు తప్ప మరెవరూ ఆపాత్రకు
అర్హులు కాదు. అసాధారణమయిన ఆనందంతో నామనసంతా
నిండిపోయింది. ఆ ఆనందాన్ని వర్ణించటానికి నాకు
మాటలు చాలవు.
(స్వామీజీ గారి సంభాషణలు ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment