Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, December 26, 2019

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 14 వ.భాగమ్

Posted by tyagaraju on 6:18 AM

       Image result for images of shirdi saibaba old photo
              Image result for images of rose
26.12.2019 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు – 14 .భాగమ్

33.  నిద్రపట్టని వ్యక్తి

 శ్రీ సాయిసత్ చరిత్ర  35 .అధ్యాయంలో ఒక సాయిభక్తునికి అతని తండ్రి రోజూ రాత్రి స్వప్నములో కనిపించి తన కుమారుని దూషించసాగేవాడు.  దానితో అ వ్యక్తికి నిద్రపట్టక బాధపడుతూ ద్వారకామాయికి వచ్చి తన బాధను బాబాకు చెప్పుకొన్నాడు.  బాబా ఆవ్యక్తి బాధను గ్రహించి అది వాని తండ్రికి తన కుమారునిపై కోపము కారణంగా మరణించిన తర్వాత కూడా తన కుమారునిపై కక్ష కట్టి కలలో దర్శనము ఇస్తూ దూషిస్తున్నట్లు చెప్పారు.




బాబా ఆవ్యక్తికి ధునిలోని ఊదీని ఇచ్చి పొట్లం కట్టుకొని తలక్రింద దిండులో పెట్టుకొని నిద్రించమని సలహా ఇచ్చారు.  ఆవ్యక్తి ఆవిధముగా చేసి తన తండ్రి దూషణలనుండి విముక్తి చెంది ప్రశాంతముగా నిద్రించేవాడు.  ఇది సాయి సత్ చరిత్రలో చెప్పబడిన విషయం.  సాయిబానిసగారు ఈ విషయమును నమ్మలేదు.  ఏతండ్రీ తన కుమారునిపై కక్షకట్టి కలలలో కనిపించి తన కుమారుని దూషించరు అని భావించి బాబాను ఈ విషయముపై వివరణ ఇవ్వమని కోరారు.  బాబా సాయిబానిసగారికి ఈవిధముగా వివరించారు.

1971 లో సాయిబానిసగారి తండ్రి తన చిన్న కుమార్తె వివాహము చేసారు.  ఆ వివాహము జరుపుటలో కొంత ధనము అనవసరంగా ఖర్చు చేయబడింది.  ఈవిషయంలో సాయిబానిసగారు తన తండ్రితో గొడవలు పడ్డారు.  సాయిబానిసగారి తండ్రి చాలా కోపముతో తన సొమ్ము తన చిన్నకుమార్తె వివాహానికి ఖర్చు పెట్టడములో ఎవరి సలహాలను సూచనలను తాను తీసుకోనవసరము లేదని చెప్పి సాయిబానిసగారిని దూషించారు.  అపుడు సాయిబానిసగారు తన తండ్రితో గొడవపడ్డారు.  కొన్ని రోజులు తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదు.  ఆ తరువాత సాయిబానిసగారు తన తప్పును తెలుసుకొని తన తండ్రిని క్షమాపణ కోరారు.  ఈవిధముగా తండ్రికొడుకుల వైరము తొలగిపోయింది.  అదేవిధముగా బాబా ఇచ్చిన ఊదీ వలన షిరిడీ భక్తునికి నిద్ర పట్టింది

34.  గురువు అజ్ఞానమును తొలగించును

శ్రీసాయి సత్ చరిత్ర 39అద్యాయములో గురువు తన శిష్యుని మనసులో ఉన్న అజ్ఞానమును తొలగిస్తారు.  అపుడు శిష్యుని లోపల దాగిఉన్న జ్ఞానజ్యోతి వెలిగి శిష్యునికి జ్ఞానము లభించును అనేది స్పష్టముగా తెలపబడింది.  ఈవిషయాన్ని శ్రీసాయిబాబా వారు సాయిబానిసగారికి తెలిపిన విధానము చాలా ఆసక్తికరముగా ఉంది.  ఆవిషయాలను తెలియచేస్తాను.

ఒకనాటి రాత్రి సాయిబానిసగారు హైదరాబాదులో ఉన్న కాప్రా చెరువు దగ్గర ఉన్న శ్రీవెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళారు.  ముందుగా అక్కడ ఉన్న చెరువులో స్నానము చేసి గుడిలోకి వెళ్ళాలనే కోరిక కలిగింది  చెరువు గట్టుమీద ఉన్న మెట్లమీద నిలబడి చెరువులోకి చూడసాగారు.  చెరువునిండా నీటిమీద గుర్రపుడెక్కనాచు మొక్కలతో నిండి ఉంది.  ఆయనకు ఆ చెరువులోని నీరు అపరిశుభ్రముగా కనబడింది. ఇంతలో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆ గుర్ఱపు డెక్కను తొలగించి  స్వచ్చమయిన నీటిలో స్నానము చేయించి వెళ్ళిపోయారు.  ఆయన గుడిలోకి వెళ్ళి శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని గుడిప్రాంగణములోని బెంచీమీద కూర్చుని తన చేత స్నానము చేయించిన వ్యక్తి గురించి ఆలోచంచసాగారు.  ఆవ్యక్తిని శ్రీసాయిగా భావించి తనలోని అజ్ఞానాన్ని తొలగించి తనకు జ్ఞానాన్ని ప్రసాదించిన తన గురువుగా భావించి ఆవ్యక్తికి మనసులో నమస్కరించుకొన్నారు.

(చెరువులోని గుర్రపు డెక్క, నాచు అనగా మన మనసులో ఉన్న జ్ఞానము మీద గుర్రపు డెక్క, నాచు అనే అజ్ఞానము ఆవరించి ఉండటం వల్ల మనము మంచి, చెడులను గ్రహించలేకున్నాము.  ఆ అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు మనకి లభించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి మార్గం చూపిస్తారు…. త్యాగరాజు )

35.  శ్రీసాయి అంకిత భక్తులు
శ్రీసాయి సత్ చరిత్ర 25అధ్యాయంలో శ్రీసాయి అన్నమాటలు గుర్తు చేసుకొందాము.
ఆ మామిడి చెట్టును చూడుచెట్టునిండా పూత పూసింది.  అందులో కొన్ని పిందెలుగా మారి రాలిపోయినవి.  ఆ పిందెలలో కొన్ని గాలికి రాలిపోయాయి.  కొన్ని మామిడికాయలుగా మారినవి.  ఆమామిడికాయలలో కొన్ని గాలికి రాలిపోయినవి.  ఆఖరికి ఆ చెట్టుకు కొన్ని మామిడికాయలు మిగిలినవి.  మరి ఆమామిడికాయలు కూడా చెట్టుకే పరిపక్వము చెంది పండ్లుగా మారుతున్నవి.  కొన్ని పండ్లు తమ బరువుకే నేలమీద రాలిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి.  అదే విధముగా నేను మామిడి చెట్టును అయితే నా అంకితభక్తులు చెట్టుకు ముగ్గిన మామిడిపళ్ళు.  ఆ పళ్ళు కాలచక్రములో చెట్టునుండి రాలిపోయి మట్టిలో కలసిపోతున్నారు.  నేను మహాసమాధి చెందిన తర్వాత నా అంకితభక్తులలో అనేకమంది కాలగర్భములో మట్టిలో కలసిపోయారు.   

శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు సమాప్తం
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List