28.12.2019 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
డిసెంబర్ 12వ.తారీకున హైదరాబాదులో విశ్వసాయి ద్వారకామాయి సంస్థవారి ద్వారా జరిగిని షిరిడీ సాయి గాయత్రి శాంతి హోమం విశేషాలను శ్రీమతి మాధవి భువనేశ్వర్ నుండి తమ గురువుగారికి వ్రాసిన లేఖ ఈ రోజున ప్రచురిస్తున్నాను.
సాయిరాం గురువుగారు..అద్భుతంగా గా జరిగిన ఈ" షిర్డీ సాయి గాయత్రి శాంతి హోమం "లో నేను ఒక భాగస్వామిని అవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణంగా బాబా వారి కృప మరియు మీ అనుగ్రహము,నా మీద మీకు ఉన్న నమ్మకము నన్ను ఈ మహాత్ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసింది. దీనికి శతకోటి ధన్యవాదములు మీకు.
సాయిరాం గురువుగారు..అద్భుతంగా గా జరిగిన ఈ" షిర్డీ సాయి గాయత్రి శాంతి హోమం "లో నేను ఒక భాగస్వామిని అవడమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సంపూర్ణంగా బాబా వారి కృప మరియు మీ అనుగ్రహము,నా మీద మీకు ఉన్న నమ్మకము నన్ను ఈ మహాత్ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసింది. దీనికి శతకోటి ధన్యవాదములు మీకు.
ఇంక నా అనుభవాలను రాస్తే,ఎన్ని రాయను? ప్రతిక్షణం ఒక్కో అనుభవం మొదటిిరోజు నుంచే మీకు గుర్తు ఉండి ఉంటుంది. 1st మీ ఇంటికి నేను వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు. మీ అన్నగారి కోసం ఇల్లు చూసేదానికి వెళ్లారు. నేను ఉడిపి కృష్ణడు విగ్రహం తీసుకొని మీ ఇంటికి వచ్చాను. నాకు మీ ఇంటి మెట్ల మీద ఒక నెమలి పించం కనపడింది. ముందు నేను తీసుకోలేదు. తరువాత అనుకున్నాను, "అయ్యో, కృష్ణుని దగ్గర పెట్టుకొనే నెమలిపించం వదిలి రావడం నా మూర్ఖత్వం, దీనిలో ఏదో లీల దాగివుంది" అనుకున్నాను, మళ్ళీ వెనక్కు వెళ్లి అది తీసుకొని మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మగారు తలుపు తీసారు. నేను ఆవిడకు ఏమి చెప్పలేదు. మీరు వచ్చాక మీకు అన్ని చెప్పి కృష్ణ విగ్రహం మీకు ఇచ్చాను.
అప్పుడు మీరు చెప్పారు, కృష్ణుడు మీకు కలలో వచ్చి,పాలు అడిగి తాగారు..అని..ఆ కృష్ణడికి పించం లేదు అని. నిజానికి ఉడిపి కృష్ణకు పించం ఉండదు. మీకు కలలో కృష్ణుడు రావడం, నేను ఉడిపిలో మీ కోసం కృష్ణ విగ్రహం కొనడం ,అదే సమయంలో ,అప్పటి నుంచే మన విశ్వసాయి లీలలు మొదలు అయ్యాయి. అసలు ఇది ఎలా సంభవం అయింది?.నాకు అస్సలు అర్థం కాదు. చాలా లీల జరిగింది. అది కృష్ణుడి లీల. అద్భుతం,ఆశ్చర్యం..ఆనందం..ఇప్పటికీ స్వామి కృపకు నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి గురువుగారు.
ఎలా ప్రారంభం అయ్యాయి లీలలు..నేను ఎప్పుడూ అనుకునే దాన్ని,నాకు సేవ చేసే భాగ్యం ఎప్పుడు వస్తుంది? అని. విశ్వసాయి ఏదో ఒక ఫంక్షన్ లో నేను పాల్గోవాలని ఉండేది. కానీ ఇంత త్వరగా సాయినాథుడు కరుణిస్తాడని అనుకోలేదు నేను. పూజారులు విషయంలో కానీ, ఇంక ఏ విషయంలో కానీ involve అవుతానని అనుకోలేదు. అంtaa బాబా కృప, మీకు నాపై ఉన్న నమ్మకం. పూజారిని ఏర్పాటు చెయ్యమని మీరు నాకు చెప్పినప్పుడు, నేను భయపడ్డాను, చెయ్యగలనా? అనుకున్నాను. కానీ చాలా మంచి పూజారులు దొరికారు. వాళ్ళుకూడా దత్తసాయి భక్తులు కావడం అత్యంత విశేషం గురువుగారు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే,వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే మీకాళ్లకు దండం పెట్టడం. అసలు ఏ మందిరం లో అయినా పూజారులు, వాళ్ళ దైవానికి తప్ప ఎవ్వరికీ దండం పెట్టరు.మనమే పూజారికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటాము. అలాంటిది వాళ్ళు మీకు నమస్కారం పెట్టడం ఆశ్చర్యం. వాళ్ళు మీలో బాబా ను చూసారు. చాలా బాగా హోమం, పూజ చేశారు. సంకల్పం చాలా బాగా చెప్పారు. నేను పూర్తిగా విన్నాను. సంకల్పం మొత్తం. అష్ట దిక్పాలకులు,నవగ్రహాలు,అందరూ,దేవి,దేవతలను,బ్రహ్మమానసపుత్రులనుఎవ్వరిని వదలకుండా ఆహ్వానించారు. నేను బాగా విన్నాను. బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన విశ్వవసును కూడా ఆయన పిలిచాడు.(ఒక్క క్షణం రావణాసురుని కూడా పిలుస్తాడేమో అనుకున్నాను.హహ) సంకల్పం చాలా బాగా చేసారు. మాతో కుంకుమ అర్చన చేయించాడు. అప్పుడు ఖడ్గమాల స్తోత్రంతో చేయించారు. అది తిరుగులేని మంత్రం. నాకు నోటికి వచ్చు అది గురువుగారు. అందుకే ఖచ్చితంగా చెప్పగలను. అంటే,గాయత్రి అమ్మవారిని ఆహ్వానించారు. దానికి సువాసినిలు ఉండాలి. అది దానికి అంతరార్థము అని నాకు అర్థం అయింది. ఏది ఏమైనా పూజ మాత్రం అద్భుతంగా చేశారు. చాలా మంది ఆశ్చర్యంగా చూసారు. ఇంక మిమ్మల్ని దూరం నుంచి జనాలు చూస్తూనే వున్నారు. చాలాసేపు గమనించారు. మళ్ళీ దగ్గరికి వచ్చి మీ ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళు. అందరూ పెరుపేరునా అదృష్టవంతులం అనుకోని వెళ్లడం నేను చూసాను. మాకు అంటే మీ గురించి తెలుసు. కానీ ఏమీ తెలీని వాళ్ళు కూడా తమ అదృష్టంగా భావించి,మీ ఆశీర్వాదాలను తీసుకొని వెళ్లారు. అది నేను చూసాను. అందరూ చాలా సంతుష్టిగా వెళ్లారు. మీలో బాబాను దర్శించుకొని వెళ్లారు. మీరు కారులో కూచొని ఇంటికి వెళ్లే వరకు బాబా మీలో వున్నారు అని ప్రతి ఒక్కరు భావించారు. చాలా మంది, నన్ను అడిగారు,"ఈయన ఎవరు? వచ్చారు, అంతలో వెళ్లారు?" అని. మీరు ఎంతమందికి విభూతి ప్యాకెట్స్ ఇచ్చారో మీకు గుర్తు ఉండదు బహుశ. అక్షయపాత్ర లాగా విభూతి ప్యాకెట్స్ వస్తూనే వున్నాయి.నా బాగ్ లో కమలాపండు అలాగే వచ్చింది. నేను భ్రమ పడుతున్నాను,అనుకున్నాను. కానీ మీ వదిన గారికీ అలాగే అనిపించింది. ఇదంతా నా అనుభూతి. బాబా నా మీద ప్రేమతో ప్రసాదించారు సేవ చేసే భాగ్యాన్ని .నాకు వీలు అయినంత చేసాను. చివరికి ఉమగారిని కూడా నేనే రిసీవ్ చేసుకున్నాను. లేకుంటే తను సమయానికి రాలేకపోవచ్చును. ఇది మొత్తం, మొదట నా కోరిక సేవ చెయ్యాలని, నా మీద మీ నమ్మకం, బాబా అనుగ్రహం మన అందరి పైన, వెరసి "విశ్వసాయి ద్వారకా మాయి, కోటి షిర్డీ సాయి గాయత్రి మహామంత్ర జపం దత్త సాయి శాంతి హోమం." అధ్భుతంగా జరిగింది. ఈ విధంగా నా అనుభూతిని మీతో పంచుకుంటున్నాను గురువుగారు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఎన్ని సమస్యలలో మునిగి ఉన్నానో. అయినా ఒకటే మార్గం. మీరు నడిచే మార్గం. మీ వెనక మేమంతా ఒక విశ్వశాంతి ప్రభంజనంలా మీ అడుగులో అడుగు వేస్తాము.మా జన్మలు ధన్యం చేసుకుంటాము.
నాకు మనసుకు తోచింది రాసాను.తప్పులు ఉంటే క్షంతవ్యురాలను.సాయి రాం.గురువుగారు.అన్నిటికీ కర్త,కర్మ,క్రియ బాబావారు అనే మీ వాక్యం అక్షర సత్యం.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment