30.01.2020
గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు
సాయిలీల నవంవరు – డిసెంబరు, 2019 పత్రికలో ప్రచురింపబడిన సాయిలీలని తెలుగులో
అనువాదం చేసి పంపించారు. దానిని యధాతధంగా
ప్రచురిస్తున్నాను.
సాయిని నమ్ముకో - నమ్మకం వమ్ము కాదు
" ఓం సాయి రాం" సాయి బంధువులు అందరికి.
మీ అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు.
ఒక నాస్తికుడిని బాబా ఎలా తన భక్తునిగా
మర్చినారో
తెలిపే కథ
ఇది.చదివి మీరు ఆనందించండి.
ముంబాయి లో ఉన్న కళ్యాణ్ అనే ఊరిలో వైతరణ లో
ఉన్న వీరేంద్ర పాండ్యా గారి స్వీయ అనుభవం.ఆయన మాటల్లోనే.....
మా పరివారం లో అందరం బాగా చదువుకున్న వాళ్ళమే. కానీ మాకు దైవం మీద అస్సలు విశ్వాసం ఉండేది
కాదు. నేను ఒకసారి మా బాబాయ్ వాళ్ళ అబ్బాయితో
షిర్డీ వెళ్ళాను. షిర్డీ నుంచి వచ్చేసరికి నాకు తెలిసింది, బీహార్ లో ఉన్న మా తల్లిదండ్రుల కు ఏదో పెద్ద
కష్టం వచ్చింది అని. నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను
షిర్డీ నుంచి ఒక చిన్న ఫోటో తెచ్చాను బాబా వారిది. అది నా బాగ్ లోనే ఉంది. దాన్ని బయటికి తీసి, బాగా శుభ్రం చేసి ఒక టేబుల్ మీద పెట్టి, ఒక దీపం పెట్టి ,"
బాబా ,నా పరివారం పైన వచ్చిన కష్టాన్ని దూరం చెయ్యి
స్వామి" అని మొక్కుకున్నాను.
రెండు,మూడు రోజులు గడిచిపోయినాయి. మాకు వచ్చిన కష్టం అలాగే వుంది. మళ్ళీ బాబా
దగ్గర ఈవిధంగా ప్రార్థన చేసాను" బాబా, నీకు తెలుసు, నేను అంత భక్తుడిని కాదు. ఎంతో మంది
నిన్ను భగవాన్ అని నమ్ముతారు. ఒకవేళ నువ్వు నిజమైన భగవంతునివే అయితే ఈరోజు సాయంత్రం లోపల మాకు వచ్చిన
కష్టాన్ని తీర్చు. లేకపోతే నేను నీ
ఫోటో తీసేస్తాను.”
( మనం అందరం అంతే,భగవంతునికి చాలా పరీక్షలు పెడతాము.పాపం,మన అజ్ఞానాన్ని ఆయన భరించి,మనల్ని సమాధాన పరుస్తాడు.) సాయంత్రం
అయ్యేసరికి మా కష్టం దూరం అయింది. నేను మా అమ్మగారికి ఉత్తరం రాసి అన్ని విషయాలు చెప్పాను. అదే సమయం లో మా
అమ్మగారు కూడా అన్ని సమస్యలు సమాధానం అయ్యాయి అని జాబు రాసింది. రెండు జాబులు
రెండు రోజుల తరువాత చేరాయి. ఈ సంఘటన తరువాత నాకు బాబా మీద భక్తి
రెండింతలు అయింది. నా జీవితం మొత్తం బాబా సేవలో గడపాలని
నిర్ణయించుకున్నాను. ఇంక పెళ్లికూడా ఇష్టం లేదు. అంతలో మా అమ్మగారు ఇలా అన్నారు, "నువ్వు కర్మయోగిగా బతకాలి" అని. ఎంతైనా అమ్మ
కదా. అప్పుడు మళ్ళీ బాబా నే ఆశ్రయించాను. బాబా ఫోటో కింద ఒక తెల్లకాయితం మీద ఇలా రాసి
పెట్టాను " బాబా, నీకు నాగురించి, నా మనసులో ఉన్న ఆలోచన గురించి తెలుసు. ఇప్పుడు నేను
ఏమి చెయ్యాలి.?
నువ్వు కూడా
నాకు రాసి చూపించు బాబా"
నేను ఎదురు చూస్తూ కూచున్నాను, బాబా ఎలా సమాధానం చెప్తారు? అని. ఇంతలో, భావనగర్ నుంచి, శ్రీ సాయి బాబా భక్త మండలి ద్వారా ప్రింట్
అయిన పుస్తకం
" శ్రీ
సాయి బాబా ఉపాసన" నా చేతికి అందింది.
ఆ పుస్తకం చదువుతూ ఉండగా దానిలో "భావసుధ"
అనే అధ్యాయంలో" నువ్వు కర్మయోగ ద్వారా నే నీ జీవితాన్ని గడుపు " అని రాసి
ఉంది. అప్పుడు అనుకున్నాను" బాబా, ఈ విధంగా జవాబు ఇచ్చారు" అని.
ఇంకో లీల..ఆరోజు బుధవారం. నేను బాబా ఫోటో
ముందు నిలబడి
" బాబా,రేపు గురువారం, ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఎవరన్నా
సాధువు, సన్యాసి..మా ఇంటికి రావాలి,వచ్చి నా తలపైన చెయ్యి పెట్టి నా పాదం వరకు నిమిరి నన్ను ఆశీర్వదించాలి" అని
మొక్కుకున్నాను. గురువారం రోజు నేను భోజనానికి కూర్చున్నాను, నిజంగానే ఒక సన్యాసి వచ్చాడు. అతనికి బాబా
ముందు పెట్టిన ప్రసాదం ఇచ్చాను. అతను వెంటనే వెళ్లిపోయాడు నన్ను
ఆశీర్వదించకుండానే. నేను అప్పుడు మళ్ళీ మనసులో అనుకున్నాను, బాబా ఎందుకు వెళ్లిపోయినావు? రా బాబా..అని..అతను మళ్ళీ వెంటనే వెనక్కు మా
ఇంటికి వచ్చాడు. నేను పెట్టిన భోజనం చేసాడు. రెండు రూపాయలు
ఇచ్చాను, తీసుకున్నాడు. ఎంతో అందంగా నవ్వారు. నా తల మీద చెయ్యి పెట్టి,నా పాదం వరకు ఆశీర్వదించారు నేను
అనుకున్నట్లు. నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఆనందంతో ఆయన
కాళ్ళ మీద పడ్డాను .నాతో అన్నారు" వచ్చే గురువారం మళ్ళీ
వస్తాను...అన్నారు. నేను అన్నాను,వీలు అవ్వదు, నేను వచ్చే గురువారం షిర్డీ లో ఉంటాను అన్నాను. దానికి ఆయన నేను
నీకు "
అక్కడే
కనపడతాను" అని.
తరువాత గురువారానికి మేము షిర్డీ
వెళ్ళాము. అక్కడ మధ్యాహ్న ఆరతి జరుగుతూవుంది. అకస్మాత్తుగా నాకు బాబా విగ్రహం లో ఆ సన్యాసి కనిపించాడు. నాకు చెప్పలేనంత ఆనందం వేసింది. బాబా
సర్వాంతర్యామి. ఆయనకు అసాధ్యం ఏమి ఉండదు. అంతా మన నమ్మకం
మీదనే ఆధారపడి ఉంటుంది. ఇలా ఎన్నో లీలలు నా జీవితం లో కలిగాయి.
" సర్వం సాయినాధార్పణ మస్తు"
వీరేంద్ర పాండ్యా..సాయి
లీల..నవంబర్...డిసెంబర్.
0 comments:
Post a Comment