Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, April 28, 2020

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – బాబా సమాధానాలు – 5

Posted by tyagaraju on 7:20 AM
Significance of the Neem Tree – Guru Vani
               Beautiful Orange Rose Flower HD Wallpapers | HD Wallpapers
28.04.2020 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

నాకు కలిగిన సందేహాలు - బాబా సమాధానాలు - 4 
సాయిభక్తుల స్పందన
శ్రీమతి కృష్ణవేణి , చెన్నై,  బాబా గారు చెక్కబల్లపై పడుకోవడమ్ వెనుక ఏదో యోగనిద్రలాంటి కారణమ్ ఉంటుంది అనుకున్నాను.  కాని వారు మనకోసమే నిద్రకూడా పోకుండా భగవంతుని ప్రార్ధించడం కోసమే అని ఇప్పుడే అర్ధం చేసుకున్నాను.  ఏమిచ్చి బాబాగారి ఋణమ్ తీర్చుకోగలమ్.  కాని ఇప్పుడు ఉన్న పరిస్తితుల్లో కూడా ఏదో ధైర్యమ్ బాబాగారు ఉన్నారనే నమ్మకమ్ చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.  బాబాగారు ఆవిడను కాపాడే విషయంలో విఫలమయ్యారని ఆయన మనకోసం ఎంత ప్రయత్నం చేసారో ఇప్పుడే తెలుసుకున్నాను.  నిజంగా మనమందరం ఎంతో ధన్యులం ఇలాంటి యోగిరాజు సహవాసమ్ దొరికినందుకు. 


శ్రీమతి శారద, ముంబాయి : బాబాగారి యోగనిద్రగురించి, కొయ్యబల్లపై నిద్రించడం వెనుక ఉద్దేశ్యం చక్కగా తెలియచేసారు.  సిధ్ధపురుషులయ్యుండి కూడా ఆడంబరం లేకుండా సాధారణ ఫకీరులా షిరిడీలో నివసించిన బాబా మన సద్గురువు కావడం మన అదృష్టం.  ఈరోజు మీద్వారా బాబా గురించి మంచి విషయాలు తెలుసుకోగలిగాం.  ధన్యవాదాలు.   ఓమ్ సాయిరామ్.

శ్రీ పార్ధసారధి గారు, పాలకొల్లు...  అష్టసిధ్ధుల గురించి వివరాలందించినందుకు ధన్యవాదములు.

శ్రీమతి మాధవి, భువనేశ్వర్  ...  చాలా బాగుంది...చాలా బాగా వివరించారు.

శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు – 
బాబా సమాధానాలు – 5

13.04.2020 -  ఈ రోజు బాబాని ఒక ప్రశ్న అడిగాను… ???  ???  ???
బాబా సమాధానమ్ :   “ టైమ్ వేస్ట్ చేసుకోకు”

అంటే నేనడిగిన ప్రశ్నకు సమాధానమ్ చెప్పడం బాబాకు ఇష్టం లేదని గ్రహించాను.  కారణం ఆయన సమాధానం చెప్పేంత వరకు ప్రతిరోజు నేను అడుగుతూనే ఉన్నాను.  అందువల్ల మళ్ళి మళ్ళి అడుగుతాననే ఉద్దేశ్యంతో టైమ్ వేస్ట్ చేసుకోకు అని సమాధానం ఇచ్చారు.  బాబాకే ఇష్టం లేనప్పుడు నేనడిగిన ప్రశ్నను కూడా మీకు తెలియపరచడం లేదు.  ఎవరూ కూడా వ్యక్తిగతంగా కూడా నన్ను అడగవద్దు.  కారణమేమిటంటె నేనే ప్రశ్న అడిగానో ఇతరులకి తెలియపరిస్తే అది బాబాను అగౌరవించినట్లవుతుంది.
మరి అలాంటప్పుడు దీని గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించారనే సందేహం మీకు కలగవచ్చు.  దానికి నా సమాధానం … బాబా కూడా కొన్నింటికి సమాధానం ఇవ్వడానికి ఇష్టపడరని తెలియచేయడానికే.

ఉదహరణకి ః  బాబా శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసినవారందరికి తెలిసిన విషయం...బాబా తాను హిందువా లేక ముస్లిమా అని భక్తులు అడిగినా సమాధానం చెప్పలేదు.  ఒకరోజు ధుని ముందు తన బట్టలన్నీ విప్పి  ధునిముందు నగ్నంగా నిలుచుని ఇప్పుడు చెప్పండిరా నేను హిందువునా ముస్లిమునా అని సీమోల్లంఘనం చేసారు.

ఆ తరువాత 14.04.2020 నుండి నేనడుగుతున్న ప్రశ్న…
బాబా నువ్వు ఎప్పుడూ వేప చెట్టు క్రిదనే ఎందుకని ధ్యానం చేసుకునేవాడివి?
       THE STORY SHIRDI SAI BABA'S NEEM TREE – WITH PHOTOS | Saiprema
15.04.2020  -- ఈ రోజున నా ప్రశ్న  .. బాబా నువ్వు ఎప్పుడూ వేపచెట్టు క్రిందనే ఎందుకని ధ్యానం చేసుకునేవాడివి?

బాబా సమాధానమ్ : “డిసీజెస్ రా”   

అంటే రోగాలు, జబ్బులు…   దాని గురించిన పూర్తి విశ్లేషణ నన్నే చేసుకోమన్నారు.  వేపచెట్టు ఎంత పవిత్రమయినదో మనందరికీ తెలుసు.  కొన్ని కొన్ని కాలాలలో వచ్చే అంటు వ్యాధులకు ఉపశమనంగా వేపాకులను మనం ఉపయోగిస్తూ ఉంటాము.  మనకు చాలా కొద్ది మాత్రమే తెలుసు.  బాబా చెప్పిన డిసీజెస్ ఏమిటో చూద్దామని ధ్యానం లోనుండి లేచిన వెంటనే గూగుల్ లో వెతికాను.  వికీపీడియాలో ఉన్న సమాచారాన్నంతా మీకు అందిస్తున్నాను.  ఇది చదివిన తరువాత ఇప్పటికయినా మనం వేపచెట్టులో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో గ్రహించుకోగలం.  మనం చక్కగా సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది.  మనమందరం ఏ చిన్న జ్వరం వచ్చినా ఇంగ్లీషు మందులు వాడటానికి అలవాటు పడటం వల్ల మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఆయుర్వేద మందుల గురించిన అవగాహన పోగొట్టుకొన్నాము.

ఇక ముందుగా బాబా వేపచెట్టుక్రింద తపస్సు చేసుకుంటు ఏమి చేసారో తెలుసుకుందాము.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.4 "భక్తుల కొరకు బాబా పదునారేళ్ళ బాలుడుగా షిరిడీలోని వేపచెట్టుక్రింద నవతరించెను.  ఎల్లప్పుడు వేపచెట్టు క్రిందనే కూర్చొనువాడు.")

సాయిబాబా మొట్టమొదటగా 16 ఏండ్ల బాలునిగా షిరిడీకి వచ్చి వేపచెట్టు క్రింద ధ్యానమగ్నులై ఉండేవారు.  గ్రామస్థులు ఆయనను దర్శించుకుని తమకు వచ్చిన వ్యాదులనుండి ఉపశమనం పొందేవారు. 
వ్యాధులతో బాధపడుతున్నవారు తనని దర్శించుకోవడానికి వచ్చినపుడు బాబా కొన్ని వేపాకులను కోసి చేతిలో వేసుకొని బాగా నలిపి బాధపడుతున్నవారికి ఔషధంలా ఇచ్చేవారు.  ఈవిధంగా ఆయన ఎంతోమందిని రోగాలనుండి విముక్తులను చేసారు.  ఈ అధ్భుతమయిన విషయం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ తెలిసి అందరూ బాబాను దర్శించుకోవడానికి వస్తూ ఉండేవారు.  వారందరూ బాబా ఇచ్చిన వేపాకుల ముద్దను తీసుకుని తమకు వచ్చిన వ్యాధులను నయం చేసుకుని సంతోషంగా తిరిగి వెళ్ళేవారు.
వేప చెట్టు ఉపయోగాలు  (వికీ పీడియా ద్వారా సేకరించిన సమాచారమ్)

సర్వరోగ నివారిణి

వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టు నుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలు పంచుకుంటున్నాయి.  మనిషికి కావలసిన స్వఛ్చమైన గాలిని ఈ వేపచెట్టు అందిస్తుంది.  అలాగే ఆరోగ్యం కూడా.  దీనివలన ప్రాచీన కాలంనాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు.  ఇంటికి వాడె ద్వారబంధాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితర వస్తువులన్నింటిని ఈ వేపచెట్టు కాండంనుండె తయారు చేసుకుని వాడుకుంటున్నాము.  అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు.  భారతదేశంలో వేపచెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు.  తెలుగు సంవత్సరాది ఉగాది పండుగరోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.  అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది.  వేప  ఎన్నో సుగుణాలున్న చెట్టు.


సర్వరోగ నివారిణి
వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. ఆయుర్వేదంలో పేర్కొన్న పిత్త- ప్రకోప లక్షణాలను నివారించడానికి వేప ఆకును ఉపయోగిస్తారు. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో చరకుడు ఇలా చెప్పాడు.... "ఎవరైతే పగటిపూట వేప చెట్టు నీడలో విశ్రమిస్తారో వారు ఆరోగ్యవంతంగా, ఎక్కువకాలం జీవిస్తారు". ఇన్ని సుగుణాలున్న వేప చెట్టును ఇంటి ఆరోగ్య దేవతగా అభివర్ణించవచ్చు. 
         Neem Tree (Azadirachta indica) - Richard Lyons Nursery, Inc.
భారతదేశంలో వేప చెట్టు నుండి వచ్చే ఎన్నో పదార్థాలను ఆయుర్వేదంలో గృహవైద్యంలో తరతరాల నుండి ఉపయోగిస్తున్నారు. వేపపువ్వు హిందువులు ఉగాది పచ్చడిలో చేదురుచి కోసం వాడతారు. వేపకొమ్మను పళ్ళు తోముకోవడానికి ఉపయోగిస్తారు. వేప నూనెను సబ్బులు, షాంపూ, క్రీమ్ లు మొదలైన సౌందర్య సాధనాలలో వాడుతున్నారు. అనేక చర్మవ్యాధులలో ముఖ్యంగా గజ్జి, మొటిమలకు పైపూతగా ఇది బాగా పనిచేస్తుంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపకాయ గుజ్జును క్రిమిసంహారిగా వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాలలోనూ లభించే మహత్తరమైన ఔషధి వేప. కాలుష్యాన్ని నివారించగల వేప సౌందర్య సాధనంగానూ పనికొస్తుంది. చర్మ రోగాలు, పేగుల్లో చేరిన పురుగులుమధుమేహం వంటి వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో చాలామంది చుండ్రు సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెలో వేప బెరడును, ఆకులను వేసి రెట్టింపు పరిమాణం నీళ్లు చేర్చి, చిన్న సెగ మీద నీటి భాగం ఆవిరైపోయేలా మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత వచ్చిన మిశ్రమాన్ని వారానికి ఒకసారి చొప్పున తలకు పట్టించాలి. చుండ్రు సమస్యను అధిగమించవచ్చు. అంతేకాదు సాధారణ వైరల్ సంబంధ జ్వరాల్లో వేప చెక్కను కషాయంగా కాచి అరకప్పు మోతాదులో తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. నులిపురుగులతో ఇబ్బందిపడేవారు చెంచాడు వేపాకు రసానికి అర చెంచా తేనె చేర్చి తీసుకోవాలి. చర్మ వ్యాధులు కలిగినవారు వేపచెక్క పొడిని త్రిఫల చూర్ణంతో కలిపి చెంచాడు మోతాదులో తీసుకోవాలి. ఆయుర్వేదిక్ ఉపయోగాలు.. రెండు కప్పుల నీటిలో నాలుగైదు వేపాకులు వేసి బాగా మరిగించి ముఖానికి ఆవిరి పట్టి గోరువెచ్చని నీటిలో ముఖం కడుక్కుంటూ ఉంటే ముఖం జిడ్డుతనం పోయి నిగారింపు సంతరించుకుంటుంది. మొటి మలు, మచ్చలు తగ్గుతాయి. వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగుసేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేప చిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. మీజిల్స్‌, చికెన్‌పాక్స్‌లాంటి వైరస్‌ వ్యాధులు తగ్గుతాయి. వారానికి ఒకటి రెండుసార్లు వేప చిగుళ్లకు రెట్టింపు చింతఆకు కలిపి నూరి ఉండ చేసి పరగడుపున కరక్కాయ ప్రమాణంలో తీసుకుని పాలు తాగుతూ పథ్యం చేస్తే కఠినమైన కామెర్ల వ్యాధి కూడా రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గుతుంది. వేపాకు, నెయ్యి సమానంగా తీసుకుని నెయ్యిలో వేపాకు నల్లగా మాడిపోయేట్లు కాచి మొత్తమంతా కలిపి నూరి నిలువ ఉంచుకోవాలి. రోజూ రెండు సార్లు దీనిని లేపనం చేస్తుంటే వ్రణాలు, దీర్ఘకాలిక పుళ్లు, దుష్ట వ్రణాలు తగ్గుతాయి. పావు స్పూను వేపచెక్క చూర్ణంలో తగినంత పంచదార కలిపి ఉదయం, సాయంత్రం పాలతో తీసుకుంటూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. మూత్రమార్గ ఇన్‌ఫెక్షన్‌ తగ్గి మూత్రమార్గంనుంచి చీము రావడం తగ్గుతుంది. పావు స్పూను వేపచెట్టు బెరడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో కలిపి రాత్రంతా నానించి, ఉదయం ఆ నీటిని వడబోసి స్పూను తేనె కలిపి తాగాలి. అలాగే ఉదయం నానబెట్టి సాయంత్రం తాగుతూ ఉంటే రక్త శుద్ధి జరిగి ఒంటి దురదలు, తామర, పుండ్లు, మచ్చలు, గుల్లలులాంటి వివిధ రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. వేపబంక చూర్ణాన్ని రెండుపూటలా అరస్పూను చొప్పున సేవిస్తుంటే మూత్రాశయ కండరాలు బలోపేతమై అసంకల్పిత మూత్ర విసర్జన తగ్గుతుంది.
ఆయుర్వేదంలో వేప
   Pmw® - Neerudu Seeds - Chalmogara Seeds - Gynocardia Odorata ...
     (నీరుడు కాయల చెట్టు)
వేపనూనె, నీరుడు విత్తుల (చాల్ మొగర) తైలం ఒక్కొక్కటి రెండు వందల గ్రాములు తీసుకుని వేడి చేసి అందులో ఇరవై అయిదు గ్రాముల వంట కర్పూరాన్ని కరిగించి వివిధ చర్మవ్యాధుల్లో ఉపయోగిస్తారు. నింబాది తైలంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆయుర్వేద ఔషధాన్ని పై పూత మందుగా కుష్టువ్యాధిలో ఎక్కువగా వాడుతారు. ఎండించిన వేపపండ్ల చూర్ణం, ఉప్పు  పొంగించిన పటిక సమంగా కలిపి దంతధావన చూర్ణంగా వాడవచ్చు. . వేపపుల్లల బదులు ఈ ఔషధాన్ని ఉపయోగించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చు. అరస్పూను వేప గింజల చూర్ణాన్ని రోజూ ఉదయంపూట నీటితో సేవిస్తూ పై పూత మందుగా వేపపప్పును రెండింతలు నువ్వుల నూనెలో వేసి నల్లగా అయ్యేంత వరకూ మాడ్చి ల్లారిన తరువాత కొద్దిగా మైలుతుత్తం కలిపి నిలువ ఉంచుకుని లేపనం చేస్తుంటే మొలలు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే  5 వేపాకులు, 5  మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే ఆ సంవత్సరమంతా వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వైరస్‌ వ్యాధులు తీవ్రరూపం దాల్చే తరుణంలో వాడుకో దగిన దివ్యౌషధమిది. కాడలను తొలగించిన తాజా వేప పువ్వులను వెడ ల్పాటి పాత్రలో వేసి తగినంత పంచదార లేదా పటికబెల్లం వేసి బాగా కలిపి ఒక గాజుపాత్రలో వేసి సూర్యరశ్మిలో ఒక నెలపాటు ఉంచితే అంతా కలిసిపోయి చక్కని ఔషధం తయారవుతుంది

Forestry :: Neem
. వేపగుల్కందుగా పేర్కొనే ఈ ఔషధాన్ని రోజూ పరగడుపున ఒక స్పూను వంతున సేవిస్తుంటే ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు ఉండటం, ముక్కులోనుంచి రక్తం కారడం, ఆకలి మందగించడం, గొంతు ఎండిపోయినట్లు ఉండటం, రక్త దోషాలు తగ్గిపోతాయి. పొంగించిన పటిక ఒక భాగం, వేపాకులు రెండు భాగాలు కలిపి నీటితో నూరి, కంది గింజంత మాత్రలు చేసుకుని మలేరియా వ్యాధిలో జ్వరం వచ్చే సమయానికి ఒక గంట ముందు, జ్వరం తగ్గిన ఒక గంట తరువాత రెండు రెండు మాత్రల చొప్పున సేవిస్తుంటే మలేరియా తగ్గుతుంది. వేపాకు బూడిదను రసికారే పుళ్లపై చల్లితే అవి త్వరగా మానిపోతాయి. బూడిదను నెయ్యితో కలిపి రాసుకుంటూ ఉంటే సొరియాసిస్‌ అనే చర్మవ్యాధిలో సుగుణం కనిపిస్తుందని అనుభవ వైద్యం చెబుతోంది.
-------------------------------------------------------------------------------------------------------------------
ఇటువంటి వేపచెట్టు యొక్క ఉపయోగాలను మనం పక్కన పెట్టి నిర్లక్ష్యం చేయడంవల్లనే అమెరికా లోని ఒక బహుళ జాతి సంస్థకి   వేపచెట్టులో ఉండే ఔషధ గుణాలకి పేటెంట్ హక్కులు సంక్రమించాయి పేటెంట్ మీద భారతీయుల అభ్యంతరం, కోర్టు కేసుల ద్వారా 2000 సంవత్సరంలో హక్కులు రద్దు చేయబడ్డాయిఇందులో ప్రముఖ పాత్ర పోషించినది వందనా శివ అనే పర్యావరణ పరిరక్షకురాలు
      Vandana Shiva - Wikipedia
 2001 లో తిరిగి బహుశజాతి సంస్థలు పేటెంట్ కోసం అప్పీలు చేసుకోగా, 2005లో  అప్పీలు కొట్టివేయబడింది.
ఈ సాంప్రదాయక విజ్ఞానం ఇదివరకే భారతదేశంలో ఎందరో ఉపయోగించినట్లు నిర్ధారించబడి, వేప పైన ఆ సంస్థలకి ఇచ్చిన పేటెంటు రద్దు చేయబడినది.
ఇప్పుడు చెప్పండి మన ప్రాచీన వేద విజ్ఞానాన్ని మన నోటితో మనమే మూఢనమ్మకంగా ఈనాడు తూలనాడితే, అదే విజ్ఞానాన్ని రేపు పాశ్చాత్యులు కనిపెట్టినట్లుగా చెప్పుకుని, పేటెంటు హక్కు పొంది ప్రచారం చేసుకుంటారు. ద్వారా అందులో మనం ఏ ఒక్క దాన్ని వాడాలన్నా కూడా వారికి రుసుము చెల్లించి వారి అనుమతి తీసుకుని వాడాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త పడదామా?
(రేపు మరొక సందేహమ్ - బాబా సమాధానమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)









Kindly Bookmark and Share it:

1 comments:

Madhavi on April 28, 2020 at 8:03 AM said...

మంచి సందేహాలు అడుగుతున్నారు మీరు.అందరికీ usefull గా ఉన్నాయి.వేపచేట్టు గురించి చాల బాగుంది.ఇక్కడ పూరి జగన్నాథ్ లో విగ్రహాలను వేప మద్ది తోనే చేస్తారు.అది శ్రీమహావిష్ణువు కూడా ను.

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List