28.06.2020 ఆదివారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (10)
గురుభక్తి 10
వ.భాగమ్
ఆత్రేయపురపు
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
మైల్
ఐ.డి. tyagaraju.a@gmail.com
గురుకృప లేనిదే మనసు పరమాత్మయందు లయించి శాంతించుట దుర్లభము.
గురుగీత శ్లో.
128
(
శ్రీ సాయి సత్ చరిత్ర అ.13 హరి ప్రసన్నుడైనపుడె మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం.
నిరంతర
హరిభజనయే దానికి మార్గం.)
గురుమార్గముననుసరించువారికి ఉత్తమమగు మోక్షము లభించుచున్నది.
అందువలన
మోక్షమును కాంక్షించువాడు గురుభక్తిని చేయవలెను.
గురుగీత
శ్లో. 179
గురుదీక్ష యొక్క మహిమ చేత సమస్త కర్మలు
సఫలమగును. గురువు లభించిన సర్వము
లభించును. గురువు లేనివాడు
అజ్ఞాని యగుచున్నాడు.
గురుగీత శ్లో. 194
సాష్టాంగ నమస్కారము చేత గురుదేవుని నిత్యము స్మరిస్తూ భజించాలి. అట్టి గురుస్మరణ వలన స్ఠైర్యము కలుగును. స్వస్వరూప స్ఠితి ప్రాప్తించును.
గురుగీత శ్లో. 97
చేతులచే, పాదములచే, మోకాళ్ళచే, వక్షస్ఠలముచే, శిరస్సుచే, నేత్రముచే, మనస్సుచే, వాక్కుచే, చేయునట్టి నమస్కారమును సాష్టాంగ నమస్కారము అందురు.
గురుగీత శ్లో. 98
మన సద్గురువుకు మనము అభిమానమును వదలి
సాష్టాంగ నమస్కారము చేయాలి.
గురువే తండ్రి, తల్లి, బంధువు, ఇష్టదైవము. సంసార మోహనాశము కొరకు అట్టి గురుదేవునకు
నమస్కరించుచున్నాను.
గురుగీత శ్లో. 66
నా ప్రభువగు గురుదేవుడే లోక ప్రభువు. నా గురుదేవుడె ప్రపంచమునకు సద్గురువు. నాలోని ఆత్మయే సర్వభూతములలోని పరమాత్మ. సర్వ భూతాంతరాత్ముడగు గురుమూర్తికి
వందనములు.
గురుగీత శ్లో. 78
శిష్యుడు నిరహంకారిగా గురువుని చేరి
సాష్టాంగ దండ ప్రణామం చేస్తే చాలు. అపుడా
గురువు అనుగ్రహంతో అతని దోషాలు నశిస్తాయి.`
పాపములనుండి విముక్తి పొందుట యెట్లన
శరీరమును, వాక్కును, మనస్సును సద్గురువు పాదములకు సమర్పించి ఆ గురువు
నామమునే జపించవలెను. మధురమగు సద్గురువు నామము జపించుటయే భక్తులకు
సులభసాధనము. ఈ సాధన వల్ల
మన పాపములు, రజస్తమోగుణములు నిష్క్రమించును. సాత్త్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును.
మన సద్గురువుకు మనము సర్వశ్య శరణాగతి
వేడుకున్నచో మన బాధలన్నిటినీ ఆయన హస్తస్పర్శచే దహించి వేయబడతాయి.
శ్రీ సాయి సత్ చరిత్ర అ 13. భీమాజీ పాటిల్ క్షయరోగంతో బాధ పడుతూ
ఉండేవాడు. అతడు షిరిడీకి
వచ్చి బాబా వద్దకు వచ్చి తనకు వేరే దిక్కులేదని అందువల్ల చివరకు నీ పాదములను ఆశ్రయించితిని
అని మొఱపెట్టుకున్నాడు.
అప్పుడు బాబా అతనితో “ ఊరడిల్లుము. నీ యాతురతను పారద్రోలుము. నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ, బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నియు నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దరార్ద్రహృయుడు. వారీ రోగమును తప్పక బాగుచేయును. ఆ ఫకీరు అందరిని ప్రేమతోను దయతోను కాపాడును” అని బాబా భీమాజీ పాటిల్ కు స్వప్నానుభవాన్నిచ్చి క్షయరోగము నుండి విముక్తుడిని గావించారు.
అదే విధంగా బాలాగణపతి షింపీ మలేరియా
జబ్బుతో బాధపడుతూ ఎన్ని ఔషధములు వాడినను తగ్గకపోవడం చేత బాబా సన్నిధికి వచ్చి ఆయన పాదాలనాశ్రయించాడు. బాబా అతనితో లక్ష్మీ మందిరము వద్ద
నల్లకుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పి పంపించారు. బాలాగణపతి బాబా చెప్పినట్లు చేయగానే
అతని మలేరియా జబ్బు శాశ్వతముగా పోయింది.
అదే విధంగా జిగట విరేచనములు, కలరా వ్యాధులనుండి
బాపూసాహెబ్ బూటిని, చెవిపోటుతో బాధపడుతున్న ఆళంది స్వామిని,
నీళ్ళ విరోచనములతో బాధపడుతున్న కాకా మహాజనిని, ఎన్నో సంవత్సరాలుగా కడుపునొప్పితో బాధపడుతున్న దత్తోపంతు, గంగాధరపంతు లను, మాధవరావు దేశ్ పాండె మూలవ్యాధిని,
నానాసాహెబ్ చాందోర్కర్ లాంటి భక్తులెందరినో బాబా వారి వారి బాధలనుండి
విముక్తులను గావించారనే విషయం శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేసిన మనకందరికి తెలుసు. వీరందరూ బాబా పాదాలనాశ్రయించి తమతమ
బాధలనుండి ఉపశమనం పొందినవారే. దీనిని బట్టి మనం గ్రహించుకోవలసిన విషయం. అన్ని వ్యాధులు బాగగుటకు అసలయిన ఔషధము
బాబా యొక్క వాక్కు. ఆశీర్వాదములు
మాత్రమే కాని, ఔషధములు కావు. అందువల్ల శ్రీ సాయి సత్ చరిత్ర అ.18
– 19 లో బాబా చెప్పినట్లుగా “నీ గురువునందు ప్రేమ,
విశ్వాసముల నుంచుము.
గురువే సర్వమును చేయువాడనియు, కర్తయని పూర్తిగా
నమ్ముము. ఎవరయితే గురువుయొక్క
మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే
గురువును బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు.”
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment