29.06.2020 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (11)
గురుభక్తి 11
వ.భాగమ్
ఆత్రేయపురపు
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
మైల్
ఐ.డి. tyagaraju.a@gmail.com
గురువు సంతృప్తి చెందుటచేత శిష్యుడు
తరించుచున్నాడు. అణిమాది
అష్టసిధ్ధులు గురుకృప చేతనే సిధ్ధించుచున్నవి. గురుగీత -- శ్లో 253
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 18 – 19 సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి, వారి మనస్సు కలత చెందకుండ తగిన బోధ చేసి, తుదకు వారి
లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 16 – 17 సద్గురువును భగవంతునివలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కధలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.47 గంగానదిలో స్నానము చేయువారి పాపములన్నియు తొలగును. అట్టి పావనమైన నది కూడ యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి, తనలో ప్రోగైన పాపములన్నిటిని వారి పాదధూళిచే పోగెట్టెదరాయని యాతురతతో జూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొనిపోవునని గంగామాతకు తెలియును. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి.)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ. 21 భక్తిలేని సాధనములన్నియు అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంధముల పారాయణ, వానిలోని సంగతులనితరులకు బోధించుట మొదలగువన్నియు నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, గొప్ప జ్ఞాని అనే ప్రఖ్యాతి , నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నియు వ్యర్ధము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. )
ఇక చివరిగా
పార్వతీ! ముల్లోకములందు దుర్లభమైన దానిని నీకు చెప్పుచున్నాను. ఆలకింపుము. గురుదేవుని కన్నను అన్యమైనది లేదనుట పరమ సత్యము.
గురుగీత శ్లో. 21
ధ్యానవైభవంలో పరమశివుడు పార్వతీదేవికి చెప్పి195వ. శ్లోకానికి తాత్పర్యం…
గురుదేవులు లేని సాధకుడు పశువుతో సమానుడు. ఒక కీటకము, పక్షిగా పిలువబడుచున్నాడు. దానికి కారణం గురుసేవ, వారినుండి శిక్షణ, గురువు
అనుగ్రహము లేక పరబ్రహ్మనును గూర్చి జ్ఞానము లేకుండుట. అటువంటివాడు. శివునెరుగడు, జీవుని ఎరుగడు.
శ్రీసాయి సత్ చరిత్ర అ.8 ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప యదృష్టవంతులు.
శ్రీ సాయి సత్ చరిత్ర అ. 10 గురువొకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన యదృష్టమును బాగుచేయగలరు. వారిని శ్రధ్ధగా సేవించినచో సంసారబంధములనుండి తప్పించుకొనగలము. న్యాయమీమాంసాది షద్దర్శనములను చదువ పనిలేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా జేసికొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము. సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవానియందు నమ్మకముంచినట్లు, సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను. భక్తులయొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును.
శ్రీ సాయి సత్ చరిత్ర అ. 12 “భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతునికంటె వేరుకారు.
శ్రీ సాయి సత్ చరిత్ర అ.11 విగ్రహము, యజ్ఞవేదిక,
అగ్ని, వెలుతురు, సూర్యుడు,
నీరు, బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు. కాని సద్గురువు వీనియన్నిటికంటె నుత్కృష్టుడు.
దీనిని బట్టి చివరిగా మనం గ్రహించుకోవలసినది మన గురువు మీద మన భక్తి ఏవిధంగా ఉండాలనేది. ఏవిద్యకయినా గురువు ఆవశ్యకత ఎంతయినా ఉంది. ఆధ్యాత్మిక విద్యకు మరీ కావాలి. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా సద్గురువు అవసరం ఎంతయినా ఉందనే సత్యాన్ని గురుగీత బోధలద్వారా మనం బాగా అర్ధం చేసుకోవాలి.
శిష్యుడు ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్ననాడే గురువుకు తృప్తి. బ్రహ్మజ్ఞానమును ఒసంగిన గురుడు శ్రేష్టుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఉత్తమ శిష్యుడు మనోవాక్కాయ కర్మములతో
గురుసేవా తత్పరుడై ఎల్లవేళలా గురువునే సంతోషపెట్టవలెను. అట్లుచేయని శిష్యుడు కృతఘ్నుడగును.
ఒక మనవి.. నా బ్లాగులోని అనుభవాలలోని కొన్నిటిని మరొక బ్లాగులో ప్రచురించే ముందు ఒక్కసారి నాకు తెలియపరచవలసినదిగా మరొక్కసారి కోరుతున్నాను. అంతే కాదు వాటిని ఫలానా బ్లాగునుండి తీసుకోబడినది అని కూడా ప్రచురిస్తే బాగుంటుంది. కారణమేమంటే ఈ మధ్య నాబ్లాగులో నేను ప్రచురించిన కొన్ని అనుభవాలను మరొక బ్లాగులో చూసాను. కాని వాటిని మరలా టైపు చేసి ప్రచురించడం వల్ల కొన్ని వాక్యాలు, సంగతులు పూర్తిగా మరుగున పడిపోయాయి. పాఠకులకు కాస్తంత అవగాహన చేసుకోవడానికి కూడా ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల యధాతధంగా కాపీ పేస్ట్ చేసినట్లయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని నా అభిప్రాయం. బాబా గురించిన తత్త్వం సాయిభక్తులందరికీ అందాలన్నదే నా ఆకాంక్ష.
(రేపటితో గురుభక్తి ముగింపు)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment