08.07.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు ఒక ఆసక్తికరమయిన అంశాన్ని మీకు అందచేస్తున్నాను.
బాబా
ఎవరినీ తన శిష్యులుగా చేసుకోలేదు,
ఆయనకు
వారసులు కూడా లేరు. దీనికి సంబంధించిన వ్యాసమ్ shirdisaisevatrust.org చెన్నై
వారినుండి గ్రహింపబడినది.
(సాయిలీల పత్రిక నవంబరు, డిసెంబరు 1983 సంచికలో పునర్ముద్రితం.)
తెలుగు అనువాదం --
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
ఫోన్. 9440375411 ,
8143626744
( ఈ వ్యాసాన్ని shirdisaisevatrust.org నుండి యధాతధంగా అనువాదం చేసి ప్రచురిస్తున్నాను. అందువల్ల ఇందులో తెలియపరచబడిన అభిప్రాయాలన్నీ శ్రీ శంకరయ్యగారివేనని గ్రహించవలెను.)
సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు -1 వ.భాగమ్
సాయిబాబాకు వారసులు గాని శిష్యులు గాని లేరు -1 వ.భాగమ్
(రచయిత కీ.శే. డి. శంకరయ్య)
27.02.1983
లో నేను షిరిడీలోని సాయిసంస్థానం ఆఫీసులో ఒక ప్రకటనని చూడటం తటస్థించింది.
ఆ
ప్రకటనలో ఈ విధంగా వ్రాసి ఉంది.
“సాయిబాబాకు
వారసులు గాని, శిష్యులు గాని లేరు”(Saibaba left no heir or disciple).
ఈ ప్రకటన గురించి నేను సమాధిమందిరంలోను, ద్వారకామాయిలోను చావడిలోను కూర్చుని పదే పదే ఆలోచించాను.
ఆవిషయం
గురించే చాలా తీవ్రంగా ఆలోచించగా వచ్చిన సమాధానమే ఇపుడు నేను మీకు వివరించబోతున్నది.
నేడు మన భారతదేశంలో బాబాలకు, స్వామీజీలకి గురువులకి ఎటువంటి లోటు లేదు. సాయిబాబా పేరు చెప్పుకుని సంచరిస్తూ ఎన్నో పనులు చేస్తున్న బాబాల గురించే ఇపుడు చర్చించుకుందాము. అసలు సాయిబాబాకు జననమరణాలు లేవు. ఆయన ఎప్పటికీ సజీవులే. అటువంటిది కొంతమంది బాబాలు తామే సాయిబాబా అవతారమని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది సాయిబాబా తమకు కొన్ని శక్తులు ఇచ్చారని కూడా చెప్పుకుంటు ఉంటారు. సాయిబాబా తన భక్తులలో ఉన్నటువంటి ప్రగాఢమయిన భక్తిని బట్టి, వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి, భక్తులందరిని అనుగ్రహిస్తారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆవిధంగా బాబాని సరిగా అర్ధం చేసుకుని ఆయనయందే తమ నమ్మకాన్ని నిలుపుకున్న భక్తులపై బాబా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. ఎటువంటి ఆర్భాటాలు ప్రచారాలు లేకుండా నిశ్శబ్దంగా సాయిసేవ చేసిన ఎంతోమంది భక్తులకు నిగూఢంగా ఆధ్యాత్మికోన్నతిని కలిగించారు.
సంపూర్ణమయిన శక్తి అంతా బాబా సమాధిలోనే ఉంది. శక్తి ప్రసారానికి కేంద్రస్థానమయిన బాబా మహాసమాధినుండే ఆయన శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. బాబా అవరాతాలమని చెప్పుకునేవారు ఈ యదార్ధమయిన విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారంటే వారిని అంధులుగానే పరిగణించాలి. బాబా సమాధినుండి శక్తి ప్రవహిస్తున్నంత వరకు ఈ బాబాలందరు తమ ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎప్పుడయితే ఆశక్తి ప్రసారం నిలిచిపోతుందో ఈ బాబాల బండారం ప్రజలముందు బయటపడిపోతుంది. అప్పుడు వారి పరిస్థితి ఒడ్డునపడ్డ చేపల్లాగ ఉంటుంది. దానికి కారణం సాయిబాబావారు ప్రసాదించిన అనుగ్రహాన్ని తమ స్వార్ధప్రయోజనాలకోసం దుర్వినియోగం చేసుకోవడమే. సాయికి అమూల్యమైన సేవలు చేస్తున్న ఎంతోమంది భక్తులు ఉన్నారు. యదార్ధమయిన శక్తి బాబామాత్రమే అని గ్రహించుకున్న కొంతమంది బాబాలు భక్తులను ఎంతో వినయంగా షిరిడీకి మాత్రమే పంపిస్తున్నారు.
ఖండోబా దేవాలయంవద్ద పెండ్లివారి బృందంతో కలిసివస్తున్న ఒక యువ ఫకీరును మొట్టమొదటిసారి చూసినవెంటనే మహల్సాపతి (ఆ తరువాత బాబాకు అంకిత భక్తుడయాడు) అసంకల్పితంగా ‘ఆవో సాయి’ అని సంబోధించాడు. అప్పటినుండి ఆయువఫకీరు సాయిగా ప్రసిధ్ధి చెందాడు. ఇపుడు కొంతమంది బాబాలు, తమ తల్లిదండ్రులు పెట్టిన పేర్లకు ముందుగాని, చివర గాని. ‘సాయి’ అనే పదాన్ని చేర్చుకుంటున్నారు. వారు స్వంతంగా తమ పేర్లు ముందు, చివర సాయి అని చేర్చుకోవడాన్ని నేను తప్పు పట్టడంలేదు. కాని వారు తమకు తామే సాయి అవతారములని చెప్పుకోవడం తప్పు. రామ అనేపేరు గల వ్యక్తి ఉన్నట్టే పది అవతారాలలో “రామ” అనే పదం ఉంటుంది.
నేటి సాయి అవతారాలమని చెప్పుకునేవారు తమ పేర్లను ఈ అవతారంలో ఎందుకని మార్చుకోలేదో అర్ధంకాదు.
శ్రీసాయి
సత్ చరిత్ర పేజీ 236 (8 వ.ముద్రణ) సాయిబాబా తాను సమయం వచ్చినపుడు 8 ఏండ్ల బాలునిగా వస్తానని కొంతమంది భక్తులతో చెప్పారు.
(8 సంవత్సరాల
తరువాత అని భావించవద్దు).
బాబా
నమ్మకంగా చెప్పిన ఆమాటని కొంతమంది బాబాలు వక్రీకరించి చెప్పడం, కొంతమంది అమాయకులైన భక్తులను ఆవిధంగా నమ్మించారు.
సాయిబాబా
8 సంవత్సరాల తరువాత వస్తానని తన భక్తులతో చెప్పారని వక్రభాష్యం చెప్పారు.
బాబా
1918వ.సంవత్సరంలో మహాసమాధి చెందారు. ఆ తరువాత 1926 లో జన్మించినవారు తామే సాయి అవతారాలమని నమ్మించారు.
బాబా
ఇచ్చిన మాటని ఆవిధంగా వక్రీకరించి చెప్పడం ఎంత హాస్యాస్పదం?
బాబా మహాసమాధి చెందకముందు ఆయన చెప్పిన సూత్రాలను ఈ బాబాలమని చెప్పుకునేవాళ్ళు, వారి శిష్యులు అర్ధం చేసుకోలేనంత అజ్ఞానులా? “ఈ భౌతిక దేహానంతరము సైతము నేనప్రమత్తుడనే, నా సమాధినుండె నేనన్ని కార్యములను నిర్వహిస్తాను. నన్నాశ్రయించువారిని, నన్ను శరణు జొచ్చినవానిని నిరంతరము రక్షించుటయే నాకర్తవ్యము.”
ఒకవేళ బాబా అంత తక్కువవ్యవధిలో ఎనిమిది సంవత్సరాల తరువాత మరలా ప్రకటితమవుతాననే కనక చెప్పిఉంటే బాబా తన భక్తులకు అటువంటి అభయప్రదానమయిన మాటలను అన్ని చెప్పి ఉండేవారు కాదు.
బాబా తన సమాధికి ఇచ్చిన అత్యంత ప్రాముఖ్యతను అర్ధం చేసుకోగలిగితే ఎవ్వరూ కూడా తాము బాబా అవతారాలమని చెప్పుకునే వారిని ఎప్పుడూ నమ్మరు.
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో ఆణి ముత్యాలు 2 వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో ఆణి ముత్యాలు 2 వ.భాగమ్)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment