Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, July 6, 2020

శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్

Posted by tyagaraju on 6:54 AM
   Dattatreya Sai | Sai baba pictures, Sai baba, Sai baba photos

     White Rose Wallpapers - Top Free White Rose Backgrounds ...
05.07.2020  ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు మరియు
గురుపౌర్ణమి శుభాకాంక్షలు
ఈ రోజునుండి బాబాగారు సాయిబానిస గారికి ప్రసాదించిన  ‘శ్రీసాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలను’ సాయి భక్తులందరికి అందజేస్తున్నాను.
శ్రీసాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు - 1 వ.భాగమ్
-   
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
-       సాయిదర్బార్హైదరాబాద్
ముందుమాట
నాపేరు శ్రీమతి రావాడ మధుగోపాల్.  నాభర్త సాయిబానిస రావాడ గోపాలరావుగారు కంటిచూపు మందగించటంతో ఇంటికే పరిమితము అయి సాయిదర్బార్ పనులునుండి 30.01.2020 నుండి పూర్తి విశ్రాంతి తీసుకోసాగారు.  12.02.2020 నాడు శ్రీసాయి వారికి సాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను  గంపనిండా పోసి చ్చారు. గంపనిండా ఉన్న ముత్యాలను రోజు ఒక ముత్యాన్ని రాత్రి నిద్రించేముందు తన శిరస్సుపై పెట్టుకొని నిద్రించమన్నారు.



ఇది వారికి శ్రీసాయి కలలో చ్చి ఆదేశము.  నా భర్త నాకు ఈవిషయము తెలియచేసి 13.02.2020 నుండి బాబా ఇచ్చే ఆధ్యాత్మిక సందేశాలను శ్రీసాయి సాగరమునుండి వెలికి తీసిన ఆణిముత్యాలను ఒక మాలగా (ఒక పుస్తకరూపంలోకూర్చమని కోరారు.  నేను నా భర్త ఆదేశానుసారము 13.02.2020 నుండి బాబావారు నా భర్తకు ఇచ్చే సందేశాలను శ్రీసాయి భక్తులకు తెలియచేస్తాను
శ్రీ సాయి సేవలో
శ్రీమతి మధుగోపాల్

13.02.2020  కుతుబ్ (QUTUB) అని నామకరణం.
నేను (సాయిబానిసహైదరాబాద్ నగరము బయట ఉన్న ఒక పల్లెటూరిలో ఉన్న ఒక ముస్లిమ్  ఫకీరు దర్గా దగ్గర తిరగసాగాను.   దర్గా ప్రక్కన ఒక రాతితో చేయబడిన ఒంటి స్తంభము ఆకాశములోనికి చాలా ఎత్తుగా నిలబడి ఉంది.   స్తంభము చూడగానే నాకు కుతుబ్ మీనార్ గుర్తుకు వచ్చినది.   స్తంభానికి ఎక్కడానికి మెట్లు స్తంభము చుట్టూ ఉన్నాయి.   స్తంభమును చూస్తూ ఉంటే ఒక ఫకిరు వచ్చి నీవు స్తంభము ఎక్కగలిగిన నిన్ను నేను కుతుబ్ అని పిలుస్తాను అన్నారు.  నేను  ఫకీరు ఆశీర్వచనాలతో  స్తంభము చుట్టు ఉన్న మెట్లను మెల్లిగా ఎక్కసాగాను.  
       Quṭb Mīnār | minaret, Delhi, India | Britannica
ఆఖరికి స్తంభము చివరకు చేరుకొన్నాను.  అక్కడినుండి క్రింద ఉన్న ఫకీరును చూసాను.  నాకు భయము వేసి నేను స్తంభము దిగిపోతాను అన్నాను.   ఫకీరు ఒకసారి నావైపు చూసి, నీవు ఆధ్యాత్మిక కుతుబ్ మీనార్ క్కావు.  ఒకసారి పైకి ఎక్కిన తిరిగి క్రిందకు దిగరాదు.  నీకు ఇంకా ప్రాపంచిక రంగములో ఆశ పూర్తిగా పోలేదు.  నీవు స్తంభము చివరనే నిలబడు.  నేను నా శక్తితో ఆమీనార్ ను వంగేలాగ చేస్తాను.  నీవు ఆసమయంలో మీనార్ పైనుండి దగ్గరలోని శివాలయాల పైకి దూకివేయి.  నీవు సురక్షితముగా ఆమందిరములోనికి చేరుకొంటావు అన్నారు.

ఇంతలో పెద్ద సుడిగాలి వీచసాగింది.  నేను  మీనార్ చివరి రాతి పలకను గట్టిగా పట్టుకొని ఉన్నాను.  గాలివేగానికి నాబట్టలు ఎగిరిపోయాయి.  నేను నగ్నముగా ఆమీనార్ పై భాగములోనే నిలబడి ఉన్నాను.  ఇంతలో  మీనార్ మెల్లిగా వంగసాగింది.   మీనార్ పైనుండి దగ్గరలోని శివాలయం పై భాగానికి దూకివేసాను.

ఆశివాలయం పై భాగమునుండి క్రిందకు దూకి అక్కడకు ధర్శనానికి వచ్చిన భక్తులతోపాటు మందిరములోనికి పరమశివుని దర్శనానికి వెళ్ళసాగాను.  ఆవరసలో మరణించిన నా తమ్ముడు ఉన్నాడు.  అతను నన్ను గుర్తు పట్టలేదు.  అతను నన్ను చూసి మీరు నగ్నముగా ఈమందిరములోనికి రాకూడదు అని తన వద్ద ఉన్న శాలువాను నాపై ప్పాడు.  నేను నాతమ్మునికి మనసులో కృతజ్ఞతలు చెప్పాను.  అతను నాకు షిరిడీనుండి తెచ్చిన ఊదీ పొట్లాలు ఇచ్చాడు.  నేను ఆపొట్లాలను చించి అక్కడ ఉన్న శివలింగము మీదగణపతిదుర్గామాతమరియు దత్తాత్రేయస్వామిల విగ్రహాలపై చల్లాను.  ఇంతలో అక్కడకు మరణించిన నాతల్లి వచ్చి నాచేతిలో హారతి కర్పూరము పెట్టి వెలిగించి గోడమీద శ్రీషిరిడీసాయి పటానికి హారతి ఇప్పించింది.  ఆమె నన్ను గుర్తు పట్టలేదు.  నాచేయి కాలలేదు.  నేను శ్రీషిరిడీసాయికి హారతి ఇచ్చి బయటకు వచ్చాను.  మందిరము బయట వాన పడసాగింది.  నేను వానలో తడుస్తూ ముందుకు వెళ్లసాగాను.

 వానలో నాముందు దర్గా దగ్గర కనిపించిన ఫకిరు దర్శనము ఇచ్చి నన్ను ప్రేమతో (కుతుబ్అని పిలిచి తనవద్దనున్న ఒక పాత కఫనీ నాశరీరముపై ధరింపచేసాడు.  నీవు ఈరోజునుండి మరణించేవరకు కుతుబ్ గా పిలవబడతావు.  అంతవరకు ఈప్రాపంచిక రంగములో భగవంతుని నామమును స్మరించుతు జీవించి అన్నారు.
విశ్లేషణ.
సూఫీ తత్త్వములో భగవంతుని గొప్పతనము మరియు భగవత్ తత్త్వమును మానవాళికి తెలియచేసే వ్యక్తులను కుతుబ్ అని పిలుస్తారు.  మన సనాతన ధర్మములో కుతుబ్ అనే మాటకు అర్ధము మునీశ్వరుడు అని గ్రహించగలరు.


సాయిబానిస.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List