04.07.2020 శనివారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 11
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
గృహస్థాశ్రమంలో గృహస్థుని బాధ్యత
క్రిందటి వారం బాబా ఇచ్చిన సందేశం
గృహస్థాశ్రమంలో యజమానియొక్క పాత్ర గురించి
సందేశం ఇచ్చారు. దానిని గురించి శోధిస్తూ ఉండగా 02.07.2020 గురువారము నాడు తైత్తరీయోపనిషత్తులో సమాచారం దొరికింది.
దానిని
మీముందుచుతున్నాను.
తైత్తరీయోపనిషత్ లో గృహస్థుడు ఏవిధంగా ఉండాలి అన్నదానికి సంపూర్ణ వివరణ…
తన ఇంటికేతెంచిన ఏ అతిధికైనను ప్రతికూల సమాధానమీయరాదు.
ఆదర
భావముతో అతిధి సత్కారము చేయవలెను.
నికృష్టభావముతో మర్యాదా
రహితముగా అతిధిని చూచినచో అట్టిఫలమే తనకు లభించును.
దీనిని
గ్రహించి ఏమానవుడు విశుధ్ధ భావముతో అతిధి సత్కారము చేయునో అతడు సర్వోత్తమ ఫలమునందగలడు.
గృహస్థు తన ఇంటికి వచ్చిన ఏ అతిధినయినా నిరాదింపరాదు.
ప్రేమ,
మర్యాద, శ్రధ్ధ, సత్కార భావములను కలిగియుండవలెను.
అట్లు
అతిధులను సేవింపవలసినదే.
దాని
నిమిత్తము గృహస్థు అధికాహారమును ఏదో విధముగా సేకరించి యుంచుకొనవలెను.
ఇక్కడ
ఏదోవిధముగా అనగా అర్ధం న్యాయసమ్మతముగా ఆర్జించినది అని అర్ధం చేసుకోవాలి. తన ఇంటికేతెంచిన అతిధిని శ్రధ్ధతో, ప్రేమతో ఆహ్వానించి అర్ఘ్యపాద్యోచితాసనాదుల నర్పించి, అన్నము పెట్టవలెను.
అట్లు
శ్రధ్ధాపూర్వకముగా
అతిధిని సేవించు గృహస్థుకూడ అంతటి ప్రేమ మర్యాదలతో కూడిన ఆహ్వానమును, అన్నాదులను పొందగల్గును.
మధ్యశ్రేణి సత్కారమును అతిధులకిచ్చు గృహస్థు తానును అట్టి ఆదరముతో కూడిన అన్నమునకే పాత్రుడగును.
అతిధిని
శ్రధ్ధారహితముగా
చూచు గృహస్థు తానును అట్టి ఆదరముతో కూడిన అన్నమునకే పాత్రుడగును.
అతిధిని
శ్రధ్ధారహితముగా
చూచు గృహస్థు తానును అట్టి నిరాదరణమునకు ఛీత్కారమునకు గురియగును.
అన్నము
లభించవచ్చును, కాని ఆదరణమునకు చోటుండదు.
తానాచరించిన
కదా తనకు లభించునది.
కావుననే
గృహస్థులయినను
సర్వోత్తమ విధానముతో శ్రధ్ధాపూర్వకముగ, అతిధి సేవనము గావించుట ప్రధానాంశమై యున్నది.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.18 – 19 బాబా ఉపదేశం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాము.
ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు పోరు.
ఎవరుగాని,
ఎట్టి జంతువుగాని నీవద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమి వేయకుము.
వానిని
సాదరముగా చూడుము.
దాహము
గలవారికి నీరిచ్చినచో ఆకలితో నున్నవారికి అన్నము పెట్టినచో, వస్త్రములు లేనివారికి వస్త్రములిచ్చినచో నీ ఇంటి వసారా ఇతరులు కూర్చొనుటకు, విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు ప్రీతి చెందును.
ఎవరయినా ధనసహాయము గోరి నీవద్దకు వచ్చినచో, నీకిచ్చుటకు ఇష్టము లేకున్న నీవు ఇవ్వనక్కరలేదు.
కాని
వానిపై కుక్కలా మొఱగవద్దు.
ఇతరులు
నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబివ్వకుము.
అట్టివానిని
నీవెల్లపుడు
ఓర్చుకొనినచో
నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.
అన్నం పరబ్రహ్మ స్వరూపమని తైత్తరీయ ఉపనిషత్ లో చెప్పబడింది. అన్నమునుండియే సమస్త భూతములు జనించుచున్నవి.
జనించినవి
అన్నము వలననే జీవించుచున్నవి.
అందువల్ల
పరబ్రహ్మస్వరూపమయిన
అన్నమును నిందింపరాదు.
అన్నముయొక్క
మహిమను తెలిసికొనినవాడు సమస్త సంపదలను పొంది మహిమాన్వితుడగును.
అన్నమును
అవహేళన చేయరాదు.
దానినభివృధ్ధి చేయవలెను.
అతిధిని గౌరవించి బ్రహ్మమును సర్వశ్రేష్టుడని ఉపాసించినచో, సర్వోత్తముడగును. మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్యదేవోభవ,
అతిధిదేవోభవ
అని కూడా చెప్పబడింది.
తైత్తరీయ ఉపనిషత్తులో గృహస్థు అయినవాడు అతిధిని ఏవిధంగా ఆదరించి భోజనం పెట్టవలెనో వివరంగా మీరిప్పుడు చదివారు.
అతిధిని గౌరవించి
అన్నము పెట్టనట్లయితే ఆ
గృహస్థుకు అన్నము లభించును గాని ఆదరముతో లభింపదు అన్న విషయానికి ప్రత్యక్ష ఉదాహరణ మీకు వివరిస్తున్నాను.
కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
ఒకసారి మాకు బాగా కావలసిన దంపతులిరువురు మా ఇంటికి వచ్చారు. మేము ఆస్పత్రికి అత్యవసరంగా వెళ్లవలసి వచ్చింది. ఆ సమయంలో వంట చేయడానికి పరిస్థితులు అనుకూలించనందువల్ల ప్రక్కనే ఉన్న ఇంటివారు ఆ దంపతులిద్దరిని భోజనానికి పిలిచారు. ( ఆస్పత్రినుండి వచ్చిన తరువాత మేము కూడా వారింటిలో భోజనం చేసాము.) అప్పుడు
ఇంటిలో గృహ యజమాని భార్య, ఆమె తండ్రి ఉన్నారు.
గృహ
యజమాని బయటకు వెళ్లి ఉండవచ్చు.
ఆ
దంపతులు భోజనం చేస్తూ ఉండగా,
ఆ
గృహయజమానియొక్క
భార్య, ఆమె తండ్రి అన్న మాటలు..” అసలు మేము మీకు భోజనం ఎందుకు పెట్టాలండీ, మాకేమి అవసరం” అని ఇష్టం వచ్చినట్లుగా తృణీకార భావంతో ఎన్నో మాటలు అనడం జరిగింది.
ఆవిధంగా
అనడానికి గల కారణం మాత్రం తెలియదు. మాకు మా పొరుగువారితో ఎటువంటి అభిప్రాయభేదాలు లేవు. దంపతులను భోజనానికి తమంతట తామే ఆహ్వానించి పరబ్రహ్మ
స్వరూపమయిన అన్నమును వడ్డించి అతిధులను నిరాదించడంవల్ల ఆ అన్నమును అనగా పరబ్రహ్మమును అవహేళన చేసినట్లేనని భావించవచ్చు.
ఆ
దంపతులిద్దరూ
మౌనంగా భోజనం ముగించారు. ఆ విధంగా జరిగిన విషయం నాకు చాలా కాలం తరవాత తెలిసింది.
దాని
ఫలితంగా ఆ గృహ యజమానికి భార్యా వియోగం కలిగి ఆదరంతో అన్నం తినే భాగ్యం కలుగలేదు.
ధనం
ఉండవచ్చుగాక, హోటల్ లో తినే యోగం పట్టిందంటే ఆదరం కరువవబట్టే కదా.
అందువల్ల ఉపనిషత్ లలోను, వేదాలలోను మనకు విధించిన ధర్మాలను మనం ఆచరించే తీరాలి.
గృహస్థు
మంచి నడవడిక, ధర్మాలను ఆచరిస్తూ ధర్మ సూత్రాలను పాటించినట్లయితే కుటుంబంలోనివారు కూడా అతని అడుగుజాడలలో నడుస్తారు.
యజమానే
ధర్మం తప్పినట్లయితే భార్యా, పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు.
(రేపటినుండి సాయిబానిసగారి సాయి సాగరంనుండి వెలికితీసిన ఆణిముత్యాలు ప్రారంభం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment