Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, August 6, 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 10 వ.భాగమ్

Posted by tyagaraju on 7:32 AM
Shirdi Sai Blog – Dedicated to Shirdi Sai Maa's Lotus Feet
        Best HD Wallpaper Rose Images - Best Rose Images

06.08.2020  గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 10 .భాగమ్
-      సాయిదర్బార్, హైదరాబాద్
-      సాయిబానిస
-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్
-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు
23.  రెండుమేకల కధ
06.03.2020  శుక్రవారమ్
షిరిడీకి నేను బాలునిగా వచ్చాను.  నాకు యుక్త వయస్సు రాగానే జీవనోపాధికి అనేక నగరాలకు వెళ్ళాను.  ఆ సమయంలో నేను సముద్రతీరాన ఉన్న మాండవి నగరంలో ఒక వజ్రాల వ్యాపారి వద్ద పనివానిగా చేరి వజ్రాలకు నగిషీ పని చేసేవాడిని.  ఆ వజ్రాల వ్యాపారికి ఇద్దరు కుమారులు.  వారు నా వయసువారె, నాతో చాలా స్నేహముగా ఉండేవారు.  నా యజమాని నా పనితనానికి మెచ్చుకొని నన్ను తన కుమారులతో సమానముగా చూసేవాడు.



నా యజమాని అనారోగ్యముతో మరణించాడు.  నా యజమాని ఇద్దరు కుమారులు వజ్రాల వ్యాపారములో ఆస్తి వాటాల కోసం తగవులాడుకొని ఇద్దరూ ఒకరిని ఇంకొకరు కత్తులతో పొడుచుకొని చనిపోయారు.  ఇది నాకు చాలా బాధను కలిగించింది.  నేను మాండవి నగరము వదలి బీడ్ గావ్ కు చేరుకొని అక్కడ నేతపనివాడిగా పనిచేసేవాడిని.  నేను చాంద్ పాటిల్ పెళ్ళివారితో కలిసి షిరిడీకి వచ్చాను. షిరిడీలోని లెండిబాగ్ వద్ద కూర్చున్న సమయములో నేను ఓ మేకల మందను చూసాను.  ఆ మేకల మందలో మాండవి నగరములోని నా స్నేహితులను గుర్తుపట్టాను.  వారు ఆస్తి తగాదాలో కొట్టుకొని మరణించి, రెండు మేకలుగా జన్మించారు.  వారిని దగ్గరకు తీసుకొని రెండుశేర్ల శనగపప్పు పెట్టి వారిని సంతోషపెట్టి వారిని తిరిగి వాటి మందలో వదలివేసాను.  నేను నా స్నేహితులకు శనగలు పెట్టినందులకు సంతోషించాను.
           Shirdi Sai Baba Life Story: Life History of Shirdi Sai Baba ...
24.  చోల్కర్ చక్కెర లేని తేనీరు కధ
07.03.2020  శనివారము

నీవు నా జీవితచరిత్రలోని 15.ధ్యాయము అనేకసార్లు పారాయణ చేసావునా అంకిత భక్తుడు చోల్కర్ గురించి ఎక్కువగా చెప్పనవసరం లేదుఅతను నా దర్శనానికి రావడానికి తాను త్రాగే తేనీరులో చక్కెర వేయకుండా, ధనము దాచి దానితో షిరిడీ దారిఖర్చులకు వాడుకొని నా దర్శనము చేసుకొని నా అనుగ్రహమునకు నోచుకొన్న ధన్యజీవి.

                         Tea without Sugar | Digin - Your Market is here!
మరి నీవు (సాయిబానిస) 1990 సంవత్సరము షిరిడీకి రావడానికి నీకు ధనము ఏవిధముగా లభ్యము అయినది అన్న విషయము నీకు ఇప్పుడు చెబుతానునీవు ఆశ్చర్యపడతావునీవు 1989 లో మొదటిసారిగా షిరిడీకి వచ్చి నా దర్శనము చేసుకొన్నావుమరి 1990 లో షిరిడీకి రావడానికి నీవద్ద ధనము లేదునా దర్శనము చేసుకోవాలనే ఆతృతతో నీ ఆఫీసులో నీవద్దకు వచ్చిన వ్యాపారినుండి నీవు వెయ్యి రూపాయలు లంచము తీసుకొని షిరిడీకి వచ్చిన మాట వాస్తవము కాదా విషయము ద్వారా నేను నా భక్తులకు తెలియజేసేదేమిటి అంటే మీరు ప్రపంచంలో ఎక్కడయినా ఉండండి, మీరు అక్కడ చేసే ప్రతి పని నాకు తెలుస్తూ ఉంటుందిచోల్కర్ చక్కెర లేకుండా టీ త్రాగడము, మరి నీవు నా దర్శనానికి వెయ్యి రూపాయలు లంచము తీసుకోవడము అన్నీ నాకు తెలుసుమీ అందరికి నేను ఇచ్చే సలహా మీరు షిరిడీ యాత్ర చేయడానికి, తీర్ధ యాత్రలు చేయడానికి అప్పు చేయకండిలంచాలు తీసుకోవద్దునేను సదా మీ అందరి గుండెలలో ఉన్నాను అని తెలుసుకోండి.

(మరలా వచ్చే ఆదివారమ్)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List