05.08.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ రామ జయరామ జయజయ రామ
సాయి నిర్ణయం
ఒక సాయి భక్తునికి బాబా అతని జీవితానికి ఏవిధంగా మార్గదర్శకత్వం చూపారో తెలుగుకుందాము. సాయిలీల పత్రికలో ప్రచురింపబడిన ఈ సమాచారాన్ని తెలుగులోకి అనువాదం చేసి పంపించినవారు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవి గారు.
ఇప్పుడు నేను చెప్పబోయేది 38 సంవత్సరాల క్రిందటి విషయం.
అపుడు
నా వయసు 13 సంవత్సరాలు.
ఆ
వయసులో నన్ను నా తల్లిదండ్రులు మొదటిసారిగా షిరిడికి తీసుకొనివెళ్లారు.
ఆ
వయసులోనే సాయిసమాధి మందిరంలో ఆయన చరణస్పర్శ చేసుకున్నవెంటనే నాలో ఒక విధమయిన చైతన్యం కలిగిందనిపించింది.
“సమాధి తరువాత కూడా నేనప్రమత్తుడనే.
ఈ
నిజాన్ని నీవు అనుభవంలో తెలుసుకో’
సాయిచెప్పిన
ఈ వచనాలు నా జీవితంలో అనుభవమయ్యాయి.
ఆ
క్షణంనుండి మనసా వాచా కర్మణా నేను సాయికి అంకితమయ్యాను.
కొన్ని
సంవత్సరాలకి
నా ఉన్నతపాఠశాల చదువు పూర్తయింది.
1977వ.సంవత్సరంలో నేను యూనివర్సిటీలో చదివే రోజులలో నా స్నేహితులతో కలిసి షిరిడీ వెళ్లాను.
ఆ
తరువాత నాకు ఒక్కడినే షిరిడీ వెళ్లాలనిపించేది.
ఒంటరిగా
వెళ్లినట్లయితే
ఏకాగ్రతతో ధ్యానం చేసుకోవచ్చని నా భావం.
అందువల్లనే
నాకు ధైర్యసాహసాలు ఎక్కువయ్యాయి.
తరువాత
ప్రతి డిసెంబరు 31 కి, జనవరి 1వ.తారీకుకి షిరిడీ వెళ్లేవాడిని. 2001వ.సంవత్సరంలో నాకు వివాహమయింది. నాభార్య కూడా నాతోపాటు షిరిడీకి వస్తూ ఉండేది.
నాకు
ప్రింటింగ్ టెక్నాలజీ మీద చాలా ఆసక్తిగా ఉండేది.
అందువల్లనే
దానికి సంబంధించిన చదువు కొనసాగించాను.
ఆ
తరువాత నాకు దానికి సంబంధించిన ఉద్యోగమే వచ్చింది.
ముద్రణాలయంలో
నాతోపాటు రమేష్, గణేష్ ఇద్దరు స్నేహితులయ్యారు.
వారిద్వారా
ప్రింటింగ్ టెక్నాలజీ నేర్చుకొన్నాను.
అన్నీ
నేర్చుకున్నాక
స్వంతంగా ఒక ముద్రణాలయాన్ని పెట్టుకుందామనే ఆలోచన కలిగింది.
నేను
మా ఇంట్లోనే నాగదిలో ఉదయం లేవగానే బాబా దర్శనం కలగాలనే ఉద్దేశ్యంతో సాయిబాబా విగ్రహం ఒకటి పెట్టుకున్నాను.
2001 మే
14 నుండి నాజీవితం మారిపోయింది.
ఆరోజునుండి
నాజీవితం పూర్తిగా సాయిమయం అయిన రోజు, మరిచిపోలేని రోజు.
ఆరోజు తెల్లవారుజామున నాకు ఒక కలవచ్చింది.
ఆ కలలో
నాగదిలో ఉన్న సాయిబాబా విగ్రహం, ఆయన పాదాల చెంత 'దినదర్శిక' అనే పంచాంగం కనిపించాయి.
పంచాంగం
చదివేవారికి
అందులో చాలావిషయాలు తెలుస్తాయి.
నా
భవిష్యత్తు గురించి నాకెటువంటి విచారం లేకపోవడంతో దీనిని ఒక సామాన్యమయిన కలగానే భావించి అంతగా పట్టించుకోలేదు.
ఆ
తరువాత ఇలాంటి కల ఎందుకు వచ్చింది దాని అర్ధం ఏమిటి అని అనేక ఆలోచనలు నాలో ఉదయించాయి.
నాకు
వచ్చిన కల గురించి నా స్నేహుతులకు చెప్పాను. “బాబా నీకు ఒక సందేశం ఇచ్చారు.
పంచాంగాలు
ముద్రించే ఒక ముద్రణాలయాన్ని పెట్టమని ఆ సందేశానికి అర్ధం” అని వారు నాకు వచ్చిన కలకి అర్ధం చెప్పారు.
నాకీ
ఆలోచన ఎందుకురాలేదని అపుడనిపించింది.
‘సాయినిర్ణయ్’
అనే పేరుతో పంచాంగాలను ముద్రించే ముద్రణాలయాన్ని ప్రారంభించాను. పంచాంగానికి ముందు కాలగణన అవసరమవుతుంది.
అది
ఎలా చేయాలా అని అనుకునేలోపే విఖ్యాత పంచాంగ కర్త శ్రీసోమణజీ గారిని కలిసాను.
ఆయన
నాకు సహాయం చేస్తానని చెప్పారు.
శ్రీ
పవార్ జీ వెంటనే సాయినిర్ణయ్ పంచాంగాల కోసం ఒక చిత్రపటాన్ని కూడా వెంటనే తయారు చేసారు.
ఇక
బాబా అనుగ్రహంతో అన్నీ సిధ్ధం చేసుకొన్నాను.
కాని
బాబా నాకు పెట్టే పరీక్ష అయిపోలేదు.
ఆ సమయంలోనే మా అమ్మగారు కాలం చేసారు.
దినదర్శి
అమ్మకాల విషయంలో చాలా అవరోధాలు కలిగాయి.
ఏమయినా
సాయినామస్మరణతో
అన్ని విపత్తులను దాటుకొని, దినదర్శినిని మరాఠీ, హిందీ, ఆంగ్లభాషలలో ముద్రణ చేయించాను.
వాటిని
ప్రతి దుకాణానికి వెళ్ళి స్వయంగా ఇచ్చేవాడిని. నా అదృష్టం ఎంత ఉంటుందో అంతే అవుతుందని అనుకొని సాయినామస్మరణతో వాటిని అమ్మడం మొదలుపెట్టాను.
సాయినిర్ణయ్
లాగే సాయిపాదయాత్ర 2003వ.సంవత్సరంలో మొదలుపెట్టాను.
దాదర్
లో ఉన్న విఠల్ వాడినుంచి భక్తులను తీసుకొని షిర్ది వరకు పాదయాత్ర చేసేవాడిని.
పాదయాత్ర
చేస్తున్న రోజులలో ప్రతిక్షణం సాయిమయం.
నన్ను
నేను మర్చిపోయేవాడిని.
మూడు
భాషలలో ఉన్న ‘సాయినిర్ణయ్’ అనే పంచాంగాలు ఇపుడు నాలుగుభాషలలో ముద్రణ చేస్తున్నాను.
ఎన్నోరకాలుగా
ప్రచారం ప్రారంభించాను.
‘సాయినిర్ణయ్’
పంచాంగాలు మహారాష్ట్రలోని పల్లె పల్లెకు చేరాయి.
విదేశాలలో
ఉన్నవాళ్లు కూడా ఉత్తరాలు రాసి తెప్పించుకొంటున్నారు.
ఇదంతా ఒకవైపు మాత్రమె.
రెండవకోణంలోంచి గమనిస్తే
కావలసినంత ఆదాయం మాత్రం రావడంలేదు.
ముద్రణ
నష్టాలలోనే నడుస్తూ ఉంది.
కాని
సాయినాధుడు ఏదో ఒక రూపంలో వచ్చి ధైర్యాన్ని కలుగచేస్తున్నారు. ఇప్పటికి పది సంవత్సరాలయింది. లాభం
లేదు నష్టం లేదు అన్నట్లుగా ఉంది వ్యాపారం.
అయినా
గాని సాయిబాబా మీద భక్తివిశ్వాసాలు రోజురోజుకు ధృఢమవుతున్నాయి.
అది
సాయిధనమే కదా. ఏదో ఒకరోజు ధనం రాకపోతుందా అనే ఆశ.
బాబా
మీద నమ్మకం. అంతే…
మహేష ఖర్ద్,
ముంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
Chala baagundi.sir
Post a Comment