16.08.2020 ఆదివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
డా.ప్రియ, ముంబాయి నుండి తమ అనుభవాన్ని ఆంగ్లంలో శ్రీమతి మాధవి, భువనేశ్వర్ గారికి పంపించారు. దానిని తెలుగులోని అనువాదం చేసి మీకు అందిస్తున్నాను. ఇది చదివిన తరువాత బాబా లీలలు అమోఘమని, అనూహ్యమని మనకి అర్ధమవుతుంది.
'ఆ వ్యక్తి' - ఆస్పత్రిలో పరిచయం - 2
హటాత్తుగా
ఆయోగి నావైపు తన దృష్టిని మరల్చి, “అమ్మాయి,
ఆస్పత్రిలో ఎవరున్నారు?” అని ప్రశ్నించాడు. “మానాన్నగారు ఉన్నారు. ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంవల్ల ఆస్పత్రిలో చేర్పించామని”
చెప్పాను. ఇపుడు డా.చోంకర్ గారు వచ్చి 2 డి.ఎకో
పరీక్ష చేస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందోననే
నేను చాలా ఆందోళన పడుతున్నానని చెప్పాను.
యోగి
నావైపు మాతృభావంతో చూసి, నా తలమీద చేయిపెట్టి, “మీనాన్నగారికి ఏమీ కాదు. ఎల్లుండి ఆయనను డిస్ఛార్జి చేస్తారు. బాబా నిన్ను ఆశీర్వదిస్తారు” అని అభయమిచ్చారు. నాకు దుఃఖం ఆగటల్లేదు. ఆయనకు రూ.51/- దక్షిణ సమర్పించుకొన్నాను. ఆయన చిరునవ్వుతో దక్షిణ స్వీకరించి వెళ్ళిపోయారు. నేను, నాతో మాట్లాడుతున్న ‘ఆవ్యక్తి’ ఇద్దరం ఒకరిమొహాలు
ఒకళ్ళం చూసుకున్నాము. ఏమి జరుగుతోందో ‘ఆవ్యక్తి’
కి తెలుసు. కాని జరుగుతున్నదేమిటో నాకు మాత్రం
అంతుబట్టడంలేదు. నేను రెప్పవేయకుండా చూస్తున్నాను. మేమిద్దరం ఆయోగి వెళ్ళినవైపు చూసాము. మాఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఒక్క నిమిషమాత్రంలోనే ఆయోగి ఎలా అదృశ్యమయ్యాడో తెలీదు
ఆయన మా కంటికి కనిపించలేదు. ఆవెంటనే ఆస్పత్రినుంచి
ఫోన్ వచ్చింది. డా.చోంకర్ గారు 2 డి.ఎకో చేసారని,
గుండె మామూలుగానే 50% EF తో పనిచేస్తోందని చెప్పారు. డాక్టర్ చెప్పిన మాటలు నాకెంతో ఉపశమాన్ని కలిగించాయి. ఆ అధ్భుత క్షణంలో నాకు మాటలు రాలేదు. నేను వెంటనే పై అంతస్థులోకి చేరుకొన్నాను. “భయపడనవసరం లేదు, ఒకసారి కార్డియాలజిస్టుని కలవండి”
అన్నారు డాక్టర్.
ఇక్కడ
జరిగిన అధ్భుతం ఏమంటే యోగి చెప్పిన రోజునే మానాన్నగారిని డిశ్చార్జ్ చేసారు.
మానాన్నగారికి
యాంజియోగ్రఫీ గానీ, సర్జరీ గాని చేసే అవసరం రాలేదు. నా గుండె భారం దిగింది. అప్పుడే
‘ఆవ్యక్తి’ నుంచి నాకు ఫోన్ వచ్చింది.
“డాక్టర్, యోగి రూపంలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినదెవరో తెలుసా? ఆయనే దత్తమహరాజ్”.
అవును
నిజమే. ఆయన ఆశీర్వాదాలు నాకు లభించాయి. ఆయన ఉనికిని నేను అనుభూతి చెందాను. నన్నొక పిచ్చుకగా లాగుకున్నట్లు నాకనిపించింది. సద్గురు తన పాదాల చెంత నేను నిత్యం ఉండేలాగ నన్ను
లాగుకొన్నారు. దత్తమహారాజే సాయినాధులవారు తప్ప
మరెవరూ కాదు.
చాలా సార్లు నేను ‘ఆవ్యక్తి’ అని సంబోధించాను. ‘ఆవ్యక్తి’ లోనే బాబా ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. కాకపోయినట్లయితే నాతో పరిచయం లేకుండానే నాకు మాత్రమే తెలిసిన విషయాలను 'ఆవ్యక్తి' ఎలా చెప్పగలడు? 'ఆవ్యక్తి' సాయిబాబాకు విశేషమయిన భక్తుడు.
చాలా సార్లు నేను ‘ఆవ్యక్తి’ అని సంబోధించాను. ‘ఆవ్యక్తి’ లోనే బాబా ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. కాకపోయినట్లయితే నాతో పరిచయం లేకుండానే నాకు మాత్రమే తెలిసిన విషయాలను 'ఆవ్యక్తి' ఎలా చెప్పగలడు? 'ఆవ్యక్తి' సాయిబాబాకు విశేషమయిన భక్తుడు.
“సచ్చిదానంద
సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై”
డా.ప్రియ, ముంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు)
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు 13 వ.భాగం ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చదవండి.
http://teluguvarisaidarbar.blogspot.com/2020/08/13.html#more
శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణిముత్యాలు 13 వ.భాగం ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చదవండి.
http://teluguvarisaidarbar.blogspot.com/2020/08/13.html#more
0 comments:
Post a Comment