17.08.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మీకందరికి మరొక అధ్భుతమైన బాబా లీలను అందిస్తున్నాను.
ఈ
అధ్బుతమైన లీల ను చెన్నై నుండి శ్రీమతి మంజు భాషిణి గారు ఆంగ్లంలో భువనేశ్వర్ లోని
శ్రీమతి
మాధవి గారికి పంపించారు.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
మనసులోని కోరిక
మేము నెలకు ఒకసారి చొప్పున ప్రతినెల 20 నుండి 25 మందికి అన్నదానం చేస్తూ ఉంటాము.
బాబా
మందిరం వద్ద ఉన్న వారికి ఆహారపొట్లాలను అందిస్తాము. అన్నదానం కోసం ప్రతిరోజు గుప్పెడు బియ్యం వేరేగా తీసి పెడుతూ ఉంటాము. ఆఖరులో ఆ విధంగా తీసిపెట్టిన బియ్యాన్నే వండి సాంబారు అన్నం గాని, పెరుగన్నంగాని పొట్లాలుగా కట్టి అలందూర్ లో ఉన్న బాబా మందిరం వద్ద అన్నార్తులకు పంచెపెడుతూ ఉంటాము. వారు త్రాగడానికి మంచినీళ్ళ సీసా కూడా ఇస్తాము.
మా అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు. అన్నదానం ప్రారంభించేముందు ప్రతిసారి మా అమ్మాయి అన్నదానం స్వీకరించే మొదటి వ్యక్తి ఎటువంటి రంగు దుస్తులు ధరిస్తాడో చెబుతూ ఉండేది. మా అమ్మాయి చెప్పినట్లుగానే మేమిచ్చే ఆహారపొట్లం తీసుకునే మొదటి వ్యక్తి అదే రంగు దుస్తులలో ఉండటం జరిగేది.
మా అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు. అన్నదానం ప్రారంభించేముందు ప్రతిసారి మా అమ్మాయి అన్నదానం స్వీకరించే మొదటి వ్యక్తి ఎటువంటి రంగు దుస్తులు ధరిస్తాడో చెబుతూ ఉండేది. మా అమ్మాయి చెప్పినట్లుగానే మేమిచ్చే ఆహారపొట్లం తీసుకునే మొదటి వ్యక్తి అదే రంగు దుస్తులలో ఉండటం జరిగేది.
ఈ రోజు అనగా 16.08.2020, మా అమ్మాయి చెప్పడం కాకుండా, అన్నదానం స్వీకరించే వ్యక్తి ఏ దుస్తులు వేసుకుంటాడో ఈసారి నేనే చెప్పాలి అనుకున్నాను. బాబా నువ్వు నా కోరిక తీర్చాలి మనసులో అనుకున్నాను. అలా జరుగుతుందా లేదా చూద్దామనుకుని మొదటగా తీసుకునే వ్యక్తి క్రీమ్ కలర్ దుస్తులతో ఉండాలని అనుకున్నాను.
ఈ
విధంగా అనుకుని బాబా మందిరం ముందు ఆహార పొట్లాలు పంచడానికి వెళ్ళాను.
బాబా
మందిరం ముందు ఒక స్త్రీ పడుకుని ఉంది.
ఆమె
పసుపు రంగు దుస్తులను ధరించి ఉంది.
ఆమెకి నేను ఆహార పొట్లం ఇచ్చాను.
అపుడామె
కొంచెం ఆగు నేను మీ కుటుంబం కోసం ఒకటి ఇవ్వదలచుకున్నాను అని
చెప్పి
లడ్డూలు ఉన్న ఒక కొత్త బాక్స్ ఇచ్చింది.
ఆ
లడ్డూలు ఆమెకి సంబంధించినవనే ఉద్దేశ్యంతో నాకు వద్దు తీసుకోనని చెప్పాను.
కాని,
ఆస్త్రీ ఇది సాయి ప్రసాదం, ఇది మీకుటుంబానికి ఇస్తున్నాను తీసుకువెళ్ళు .
సంతోషంగా
ఉండండి అని అంది.
ఇన్ని
సంవత్సరాలుగా
అన్నదానం చేస్తున్నా గాని నాకిటువంటి అనుభవం ఎప్పుడూ జరగలేదు.
ఆమె
ఇస్తున్న లడ్డూలను ఎలా తీసుకోవాలో నాకు అర్ధం కాలేదు.
ఆమె
ఇస్తున్నదాన్ని
ముట్టుకోవడానికి
కాస్త సంకోచించాను.
అపుడు
నాభర్త “బాబా మందిరం ముందు ఉన్నది సాయి.
సాయి
ఒక ఫకీరు.
అలాగే
ఈమెకూడా. అందుచేత
ఎటువంటి సందేహంలేకుండా ఆమె ఇస్తున్నది తీసుకో” అన్నారు.
మేము
ముగ్గురం ఆమె ఇస్తున్న బాక్స్ లోనుండి ఒక లడ్డూ తీసుకొని మూడు భాగాలు చేసుకొని తిన్నాము.
ఆ స్త్రీ మమ్మల్ని శాసిస్తున్నట్లుగా అనిపించింది.
మీరు
ఈ లడ్డులన్నిటినీ మీకుటుంబంలోనివారందరికి తీసుకువెళ్లండి అని చెప్పి మా అమ్మాయిని చూపించి ముందుగా ఆమెకి ఇవ్వండి అని ఆజ్ఞాపించింది. ఆమె అలా ఆజ్ఞాపించేసరికి నేను అలా నిలబడి చూస్తూ ఉండిపోయాను.
నేనెందుకలా
ఉండిపోయానో నాకే తెలియదు.
ఒక్కమాట
కూడా మాట్లాడలేకపోయాను.
కాని
ఆమె అన్నమాటలకు భయపడి మాత్రం కాదు.
కాని
ఏదో తెలియని అనుభూతి నాలో కలిగింది.
నాకు ఆసమయంలో అక్కల్ కోటస్వామి చరిత్ర గుర్తుకు వచ్చింది.
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment