01.01.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 21 వ.భాగమ్
(పరిశోధనా
వ్యాస రచయిత… శ్రీ
ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
నా డైరీలోని సారాంశాలు
ప్రశ్న --- సాయిబాబావారి బోధనలకు సంబంధించి మీరు నాకేమయినా చెప్పగలరా? ఆరు సంవత్సరాలు మీరు బాబాతో చాలా
సన్నిహితంగా మెలిగారు. ఆయన మీకేమయినా సూచనలు చేసారా?
జవాబు --- ఎవరయినా బాబాను దర్శించుకోవడానికి వచ్చినపుడు బాబా వారికి ఊదీని మాత్రమే ఇస్తూ
“నువ్వింక ఏమి చింతించకు, భవిష్యత్తు గురించి ఆలోచించకు. వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది”
అనేవారు.
ప్రశ్న --- ఆయన ఆవిధంగానే చెప్పేవారా?
తుకారామ్ --- అవును. ఆయన ఎవరికీ
ఎటువంటి మంత్రాన్ని ఉపదేశించలేదు.
ప్రశ్న --- బాబా తరచుగా భగవంతుడిని “ఫకీర్” అని ఇస్లామిక్ పదాలను, పదబంధాలను ఉపయోగిస్తూ ఉండేవారు. ఆయన ఆవిధంగా ఎందుకని అనేవారో వివరిస్తారా?
జవాబు --- ఆరోజుల్లో ఫకీరులు బాబాను కలుసుకోవడానికి షిరిడీకి వచ్చేవారు. బాబా వారితో కలిసి ఉండేవారు. వారితో కలిసి భోజనం చేసేవారు. వారు ఏవిధంగా చేస్తే బాబాకూడా ఆవిధంగానే
చేసేవారు. బాబా ఎల్లప్పుడూ,
‘అల్లామాలిక్’ అని “భగవంతుడు
ఒకడే” అని అనేవారు.
ఆయన ఆవిధంగా అన్నప్పుడెల్లా తన వ్రేలిని పైకెత్తి చూపేవారు.
ప్రశ్న --- ఆయితే బాబా తన చూపుడు వేలును
పైకెత్తి ‘అల్లా మాలిక్’ అనేవారు అవునా?
తుకారామ్ --- అవును, అదే పధ్ధతిలో ఆయన రామ, కృష్ణ,
శివ అని కూడా అంటు ఉండేవారు.
ప్రశ్న --- హిందు దేవుళ్ళ పేర్లయిన రామ,
కృష్ణ, శివ ఇటువంటివన్ని కూడా ఆయన అనేవారా?
జవాబు --- అవును. హిందూ, ముస్లిమ్ రెండూ అనేవారు.
ప్రశ్న --- బాబా పగలంతా ఏమిచేసేవారు? ప్రత్యేకించి ఆయన వ్యాపకాలు
ఏమిటీ?
జవాబు --- ఉదయాన్నే లేవగానే బాబా లెండీబాగ్ కు వెడుతూ ఉండేవారు. తిరిగి వచ్చిన తరువాత 9 గంటలవేళ గ్రామంలోకి వెళ్ళేవారు.
అక్కడ గ్రామంలో “లావో మాయి’ లావోమాయి’ అని అరిచేవారు. అనగా ‘నాకు
ఇవ్వు, నాకు ఇవ్వు’ అని అర్ధం. అనగా తనకి ఏమయినా పెట్టమని అడగటం. గంట తరువాత ఆయన ద్వారకామాయికి తిరిగి
వచ్చేవారు. ఇక్కడ ఆయన
స్నానం చేసేవారు. అపుడు
మధ్యాహ్న ఆరతికి తయారుగా ఉండేవారు.
ప్రశ్న --- భిక్షపూర్తయి బాబా ద్వారకామాయికి తిరిగి చేరుకొన్న తరువాత ప్రజలు ఆయనను దర్శించుకోవడానికి
యధేచ్చగా వెళ్ళేవారా లేక ఆయనను కలిసి మాట్లాడాలంటే బాబా అనుమతి అవసరమయ్యేదా?
జవాబు --- లేదు అందరూ ఎటువంటి నియమ నిబంధనలు
లేకుండా మసీదుకు వెళ్ళి బాబాతో మాట్లాడేవారు. ఒక్కోసారి బాబా ప్రత్యేకించి కొంతమంది
వ్యక్తులని మాత్రం లోపలికి అనుమతించేవారు కాదు. ఉదాహరణకి ఒక ఫకీరు ఉండేవాడు. అతనిని లోపలికి రానిచ్చేవారు కాదు.
తుకారామ్ --- ఆఫకీరు పేరేమిటో నాకిప్పుడు గుర్తులేదు. మహమ్మదీయులని కూడా ఆయన మసీదులోకి
రానిచ్చేవారు కాదు. పుస్తకాలలో
ఆపేరు ఉంది. నేను తరువాత
చెబుతాను.
(ఆయనకు గుర్తుకు రాని ఆపేరు బహుశ హాజీ సిధ్ధిక్ ఫాల్కే అయుండవచ్చు)
నేను (ఆంటోనియో) అయితే కొన్నికొన్ని సందర్భాలలో ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులను లోపలికి అనుమతించేవారు
కాదన్నమాట.
తుకారామ్ --- అవును ప్రత్యేక సందర్భాలలో మాత్రమే మహమ్మదీయులను కూడా మసీదులోకి ఆయన ప్రవేశించనిచ్చేవారు
కాదు.
ప్రశ్న --- బాబా ఎవరికయినా, ప్రత్యేకించి ఉపదేశం ఇచ్చి ఉండచ్చని
మీకేమయినా తెలుసా?
తుకారామ్ --- ఇంతకుముందె ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బాబా ఊదీనిచ్చి ఆశీర్వదించేవారు అంతే. ఎవరికీ ఉపదేశాలను గాని మంత్రాలను
గాని బోధించలేదు.
ప్రశ్న --- బాబాను దర్శించుకోవడానికి ఎక్కువగా హిందువులు వచ్చేవారా లేక ముస్లిమ్స్ వచ్చేవారా?
జవాబు ---
80 శాతంమంది హిందువులు. ముస్లిమ్స్ 20 శాతం మంది మాత్రమే వచ్చేవారు.
ప్రశ్న --- సాయిబాబా ప్రజలతో మాట్లాడేటపుడు ఆయన విధానం ఏవిధంగా ఉండేది?
జవాబు --- పగటివేళ బాబా ఎప్పుడూ విశ్రాంతి తీసుకునేవారు కాదు. నిద్రకూడా పోయేవారు కాదు. మధ్యాహ్న ఆరతి అయిన తరువాత బాబాను
కలుసుకోవడానికి ఎందరో భక్తులు వచ్చేవారు. ఒకోసారి భజనలు జరిగేవి. భగవంతుని మీద భక్తి గీతాలు,
కీర్తనలు పాడుతుండేవారు.
ప్రశ్న --- అయితే బాబా రాత్రివేళలలో మాత్రమే విశ్రాంతి తీసుకునేవారా?
జవాబు --- బాబా రాత్రి గం.7 – 8 మధ్య భోజనం చేసేవారు. ఒకరోజు రాత్రి ద్వారకామాయిలో నిద్రిస్తే,
మరుసటిరోజు రాత్రి చావడిలో నిద్రిస్తూ ఉండేవారు.
ప్రశ్న --- ఆయన ప్రతిరోజు ఎన్నిగంటలకు నిద్రలేచేవారు?
జవాబు --- తెల్లవారు జాము 5 గంటలకు.
ప్రశ్న --- సాయిబాబా ప్రార్ధన చేయడం గాని, ధ్యానం చేసుకోవడం గాని
మీరెపుడయినా చూసారా?
జవాబు --- గ్రామంలోకి వెళ్ళిన తరువాత మసీదుకు ఉదయం 10 గంటలకు తిరిగి
వచ్చేవారు. అక్కడినుండి
లెండీబాగ్ కు వెళ్ళి అక్కడే గంట, గంటన్నర సమయం గడిపేవారు. ఆయన అక్కడే ఒంటరిగా ఉండేవారు. ఆయన దగ్గర ఎవరూ ఉండేవారు కాదు.
ప్రశ్న --- ఆయన అక్కడ ప్రార్ధించడం గాని, ధ్యానం
చేసుకోవడం గాని చేసేవారు కాదని మీరు భావిస్తున్నారా?
తుకారామ్ --- బాలాజీ పిలాజీ చెప్పినదాని ప్రకారం ఆయన అక్కడ ఏమిచేసేవారో ఎవ్వరు ఎపుడూ చూడలేదు.
ప్రశ్న --- ఆరోజుల్లో గ్రామస్థులందరూ బాబా భక్తులేనా?
జవాబు --- అవును ప్రతివారూ బాబా భక్తులే.
ప్రశ్న --- నారాయణ బాబా గురించి ఆయనను అడుగుతారా?
జవాబు --- ఆయన ఈరోజు షిరిడిలోనే ఉన్నారు.
ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటారు.
ప్రశ్న --- ఇపుడు మనం వెళ్ళి ఆయనను కలుద్దామా?
తుకారామ్ --- అలాగే, నేను మిమ్మల్ని ఆయన వద్దకు తీసుకువెడతాను. నేనీరోజు ఆయనను చూసాను. ఆయన ఆలయంలో ఉన్నారు.
ప్రశ్న --- నారాయణబాబా తనకు తాను సాయిబాబాకు మాధ్యమంగా ఉన్న వ్యక్తినని చెప్పుకుంటారు. ఆయన చెప్పిన ఈ విషయాన్ని నమ్ముతున్నారా
అని బాలాజీ పిలాజీగారిని అడుగుతారా?
1959 నుండి నారాయణబాబా తాను సాయిబాబా ఆత్మతో అనుసంధానమయి ఉన్నానని
చెప్పుకుంటున్నారు.
కాని సంస్థానం వారు ఆయన చెప్పినదాన్ని నమ్మలేదు. ఆయనని ఒక సాధారణ బాబా భక్తునిగానే
పరిగణించారు.
జవాబు --- నారాయణబాబా 20 సంవత్సరాలుగా షిరిడికి
వస్తున్నారు. ఆయన రైల్వే
ట్రాక్ కీపర్ గా పనిచేసేవారు. ఇపుడు ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఇపుడు సాయిబాబా మీద భక్తికే అంకితమయ్యారు. ఆయన బొంబాయిలోని పన్వేల్ లో సాయిబాబా
మందిరాన్ని నిర్మించారు. అమెరికాలో కూడా భక్తులు సాయిబాబా మందిరాన్ని నిర్మించారని
విన్నాను.
ప్రశ్న --- నారాయణబాబా ‘సాయిబాబా’ కు మాధ్యమంగా
ఉన్న వ్యక్తి అని మీరు భావిస్తున్నారా?
జవాబు --- ఈరోజుల్లో ఎంతోమంది నారాయణబాబాను చూడటానికి వస్తున్నారు.
ప్రశ్న --- ఆయనలో శక్తులున్నాయని మీరు నమ్ముతున్నారా?
జవాబు --- నారాయణబాబా కేవలం ఒక బాబా భక్తుడు అంతే.
ప్రశ్న --- మీరాయనను ఒక సామాన్య బాబా భక్తునిగానే భావిస్తున్నారా?
తుకారామ్ --- అవును, అంతే. ఆయనలో ఎటువంటి శక్తులు లేవు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment