02.01.2021 శనివారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 22 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
నా డైరీలోని సారాంశాలు
బాలాజీ పిలాజీ (దుబాసీ చెప్పిన విషయాన్ని సవరిస్తూ)
నారాయణబాబాకు కొన్ని శక్తులున్నాయని పిలాజీ గారు చెప్పారు.
ప్రశ్న --- ఏమయినప్పటికీ ఆయనను ఒక బాబా భక్తునిగానే ఆయన భావిస్తారు
అంతేనా?
జవాబు --- అవును మీరు చెప్పినది నిజమే
బాలాజీ పిలాజీ ఇంకా ఇలా చెప్పారు.
నారాయణబాబాగారి గురువు ఎవరో నాకు తెలియదు. నేననుకోవడం ఆయనకు సాయిబాబాయే గురువు. నారాయణబాబా కూడా సాయిబాబానే తన గురువుగా భావిస్తున్నారని
నా ఉద్దేశ్యం.
ప్రశ్న --- సాయిబాబా గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగిన కధనం
ఏమయినా ఉంటే వివరించగలరా?
జవాబు --- షిరిడిలో నీటికొరత సంభవించినపుడు బావిలో జొన్నలు
వేయడం ఒక అధ్భుతం. సాయిబాబా ఎప్పుడూ ‘టీ’ త్రాగలేదు. ఒకరోజు ఒక సన్యాసి బాబాను దర్శించుకోవడానికి హరిద్వార్
నుండి వచ్చాడు. ఆసన్యాసి అసలయిన సన్యాసిలాగే
కనిపించాడు ఆసమయంలో. కారణం ఆయనవద్ద తను ధరించిన
కఫినీ తప్ప మరేదీ లేదు. ఆసన్యాసి బాబాతో “నేను
ఎటువంటి పరిస్థితులలో ఉన్నానో మీరే చూడండి.
మహరాజ్, మహరాజ్, మహరాజ్, దయచేసి నాకు సహాయం చేయండి” అని ప్రార్ధించాడు. అపుడు బాబా ఎవ్వరితోనూ ఏమీ అనలేదు. ఆసమయంలోనే బాబా భక్తుడయిన దేశ్ పాండే భోజనం, రొట్టె,
టీ, ఇంకా కొన్ని పదార్ధాలను తీసుకుని మసీదుకు వచ్చాడు. తను తీసుకువచ్చినవ్నాటిని దేశ్ పాండే బాబాకు సమర్పించాడు. కాని బాబా, “వద్దు, ఇది నాకోసం కాదు, ఇది ఆసన్యాసికి
ఇవ్వు” అన్నారు.
ప్రశ్న --- ఆ సన్యాసి సాయిబాబాను ఏమీ అడగకుండాను, చెప్పకుండానే ఆవిధంగా
అన్నారా?
తుకారామ్ --- కాదు, కాదు,
ఆసన్యాసి తనకు ఏమికావాలో సాయిబాబాకు చెప్పుకొన్నాడు. అపుడు బాబా ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే
ఊహించని విధంగా అకస్మాత్తుగా దేశ్ పాండే భోజనాన్ని తీసుకువచ్చాడు.
ప్రశ్న --- అయితే భోజనం తీసుకురమ్మని ఎవరితోనూ చెప్పకుండానే తీసుకురాబడిందన్నమాట, అంతేనా?
తుకారామ్ --- అవును దేశ్ పాండే తీసుకువచ్చాడు. దానినే బాబాకు సమర్పించాడు.
బాలాజీ పిలాజీ (మసీదుకునుండి లెండీబాగ్ కు వెడుతున్నప్పటి ఫొటో చూపిస్తూ దాని గురించి వివరించారు.)
ఎడమనుండి కుడివైపు ఉన్న వ్యక్తి నానాసాహెబ్
నిమోన్కర్, కుడివైపు చివరనున్న వ్యక్తి బూటీసాహెబ్. మధ్యలో గొడుగును పట్టుకున్న వ్యక్తి
భాగోజీ షిండే.
ప్రశ్న --- అయితే ఫొటోలో మహల్సాపతి లేరు అవునా?
జవాబు --- అవును. ఆయన లేరు. ఈఫొటోలో ఉన్నవారంతా
లెండీబాగ్ కు వెడుతున్నారు.
బాలాజీ పిలాజీ ఇంకా చెప్పిన వివరాలు…
1914వ.సంవత్సరంలో బూటీసాహెబ్,
బాబాను కలుసుకోవడానికి షిరిడీ వచ్చారు. ఆయన ఇక్కడకు రావడానికి ముందు షేన్
గాన్ లో ఉన్న గజానన్ మహరాజ్ గారి వద్దకు వెళ్ళారు. గజానన్ మహరాజ్ బూటీతో షిరిడీ వెళ్ళి
బాబాను కలుసుకోమని చెప్పారు, ఆవిధంగా చెబుతూ ఎంతో కాలంగా నువ్వు
కోరుకుంటున్నదానిని ఆయన నీకు ప్రసాదిస్తారు” అని చెప్పారు.
నేను
(ఆంటోనియో) --- గజానన్ మహరాజ్, షిరిడీ సాయిబాబాకు మధ్య ఉన్న సంబంధం చాలా
ఆసక్తికరంగా ఉంది.
తుకారామ్ --- బూటీ మొట్టమొదటగా గజానన్ మహరాజ్ గారి దగ్గరకు వెళ్ళారు. అపుడు గజానన్ మహరాజ్ సాయిబాబాను కలుసుకోమని
షిరిడికి పంపించారు.
బాలాజీ పిలాజీ…
ఒక జ్యోతిష్యుడు బూటీతో నీకు త్వరలోనే
మరణం సంభవించబోతోందని జోస్యం చెప్పాడు. గండంనుంచి
తప్పించుకునే మార్గం వాస్తవానికి లేకపోయినా చాలా జాగ్రత్తగా ఉండమని బూటీతో చెప్పాడు. బూటీకి చాలా నిరాశ ఆవరించింది. ఆకారణంగానే ఆయన మొట్టమొదటగా గజానన్
మహరాజ్ దగ్గరకు వెళ్లారు. ఆయన సాయిబాబాను కలుసుకోమని సలహా ఇచ్చారు.
ఆతరువాత బూటీ సాయిబాబాను కలుసుకుని తన
పరిస్థితినంతా వివరించారు. బాబా (బాలాజీ పిలాజీ తను చెబుతున్న వివరాలను
మధ్యలో ఆపి, ఆతరువాత వెంటనే మరలా చెప్పడం మొదలుపెట్టారు)
నేనొక విషయం చెప్పాలి. బూటీ షిరిడికి వచ్చినపుడు ఆయన ఇక్కడే
స్థానికంగా నివసిస్తున్న పాటిల్ అనే ఆయనని కలుసుకొన్నారు. పాటిల్ బూటీతో బాబాను కలుసుకొమ్మని,
అంతా శుభమే జరుగుతుందని చెప్పారు. ఎటువంటి భయాందోళనలను పెట్టుకోవద్దని
అన్నారు. బూటీ,
బాబాను కలుసుకొన్నారు.
ఆవిధంగా ఆయన మరణాన్నించి తప్పించబడ్డారు. అప్పటినుండి బూటీ బాబాకు అంకిత భక్తుడయ్యారు.
“బాబా
వద్దకు వెళ్ళి అక్కడే కూర్చో, అక్కడే ఉండు, అక్కడికీ ఇక్కడికీ ఎటూ వెళ్ళవద్దు, అపుడు అంతా శుభమే
కలుగుతుంది” అని పాటిల్ బూటీతో అన్నాడు. ఆరోజు సాయంత్రం గడిచింది. బూటీకి ఏమీ కాలేదు. ఆవిధంగా ఆయన మరణాన్నుంచి తప్పించుకున్నారు.
తుకారామ్ --- బూటీగారు బాగా చదువుకున్నవారు, గొప్ప ధనవంతుడు.
బాలాజీ పిలాజీ ఇంకా చెబుతున్న వివరాలు…
ఆమరుసటిరోజు ఉదయం 8 గంటలకు బూటీ, బాబాగారి కాళ్ళు వత్తుతున్నారు. బాబా నేను మూత్రశాలకు వెళ్ళాల్సి ఉంది,
నాకు అనిమతివ్వండి, అని బూటీ, బాబాను అడిగారు. కాని బాబా, “వద్దు, ఇపుడు వెళ్లద్దు,
ఇపుడు నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. తరువాత వెళ్ళు” అన్నారు. అదేరోజు
గంట తరువాత బూటీ మరలా బాబాతో “బాబా ఇపుడు వెళ్ళమంటారా? నేను తొందరగా లఘుశంక తీర్చుకోవడానికి
వెళ్ళాలి” అన్నారు.
కాని బాబా ఆయనకు అనుమతినివ్వలేదు. “ఇపుడు కాదు, నువ్విపుడు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు” అన్నారు. గం.10.30 గరువాత
బాబా ఆయనకు ఎక్కడికయినా వెళ్లచ్చని నీ యిష్టమయిన చోటకు వెళ్ళు” అని అనుమతినిచ్చారు.
ప్రశ్న --- వీటన్నిటికీ సంబంధించిన వివరాలు చెబుతారా?
జవాబు --- జ్యోతిష్యుడు చెప్పిన జోశ్యం గురించి బూటీ బాగా భయపడ్డాడు. బాబావద్దకు వెళ్ళినట్లయితే ఆపదలన్నీ
తొలగిపోతాయని భావించారు. కాని బూటీకి ఆ రెండు గంటల సమయం చాలా ప్రమాదకరమయినదని,, ప్రతికూలంగా ఉంటుందనే కారణంగా బాబా ఆయనను ఎక్కడికీ వెళ్ళనివ్వలేదు.
(ఇంకా ఉంది)
(రేపటి సంచికలో బూటీని బాబా కాపాడిన మరికొన్ని విశేషాలు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment