04.01.2020 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 24 వ.భాగమ్
(పరిశోధనా వ్యాస రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ- కోపర్ గావ్ – షిరిడీ
శనివారమ్ – అక్టోబరు, 19, 1985
బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు …
నా డైరీలోని సారాంశాలు
ప్రశ్న --- బాబా శరీరం మీద వారికేమి కనిపించింది?
జవాబు --- బాబా ప్రాణాలు విడిచిన తరువాత ప్రజలు ఆయనకు ఆఖరి స్నానం చేయించి శరీరాన్ని
శుభ్రపరిచారు. హిందూ
భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిధంగా చేసిన సమయంలోనే బాబా ధరించిన
లంగోటీ కనిపించింది.
ప్రశ్న -- అంటే బాబా లంగోటీ ధరించినట్లుగా వారు గమనించారని మీ అభిప్రాయమా?
జవాబు --- బాబాకు స్నానం చేయించడానికి ఆయన దుస్తులన్నిటినీ తీసివేసినపుడు బాబావారు లంగోటీ
ధరించినారని తెలిసింది. ఆవిధంగా కనుగొనడం జరిగింది.
ఆ లంగోటీని అందరికీ చూపించారు. అక్కడ ఆసమయంలో చాలామంది మహమ్మదీయులు కూడా ఉన్నారు. అపుడు వారంతా హిందూ సాంప్రదాయం కాబట్టే బాబా లంగోటీ ధరించారన్న
విషయాన్ని అంగీకరించారు. అందువల్లనే ఇన్స్ పెక్టర్ ముస్లిమ్స్ లంగోటీ ధరించరనే
కారణంగా బాబా శరీరం హిందువులకే చెందుతుందని నిర్ధారించారు.
ప్రశ్న --- ఇపుడు కూడా బాబాకు ముస్లిమ్ భక్తులు చాలామంది ఉన్నారా?
జవాబు --- అవును, ఉన్నారు. కాని ఎక్కువమంది లేరు
తుకారామ్ ---
20 శాతం మంది మాత్రమే ఉన్నారు.
బాలాజీ పిలాజీ --- అందువల్ల బాబా శరీరాన్ని హిందువులకు
అప్పగించారు.
ప్రశ్న --- బాబా కీర్తనలు పాడటం మీరు ఎప్పుడయినా విన్నారా?
జవాబు --- చాలా
అరుదుగా విన్నాను. ఒకోసారి బాబా తన మనసులో
ఏదో భావం కలిగిన సమయంలో పాడేవారు. కాని కొద్దిగా
మాత్రం పాడేవారు. అంత ఎక్కువగా కాదు.
ప్రశ్న --- రామ, కృష్ణ ఇలాంటి భగవత్ సంబంధమయిన పాటలు పాడుతూ
ఉండేవారా?
జవాబు --- అవును.
కాని చాలా అరుదుగా, అప్పుడప్పుడు మాత్రమే పాడేవారు.
షిరిడిలో సంస్థానంవారి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం గం.5.15
ని.
బషీర్ బాబా గురించి షిరిడీ సంస్థానంవారితో సంగ్రహంగా జరిపిన
సంభాషణ.
ప్రశ్న --- హైదరాబాద్ లోని బషీర్ బాబా గురించి మిమ్మల్ని అడగదలచుకొన్నాను,
అడగమంటారా?
జవాబు --- బషీర్ బాబా 1980వ.సం.లో మరణించారు.
ప్రశ్న --- ఆయన గురించి ఏమయినా చెబుతారా?
జవాబు --- ఆయన తరచూ ఇక్కడికి వస్తూ ఉండేవారు. ఆయనతో కూడా ఆయన భక్తులు కొంతమంది వస్తూ ఉండేవారు. కాని మాకు ఆయన సంస్థానం గురించి గాని, ఆయన తన అనుచరులకు
ఏమని చెప్పారన్నది కూడా మాకు తెలీదు. మాకు
ఏవిషయాలు తెలియవు. ఆయన ఇక్కడికి ఒక సాయిబాబా
భక్తునిగానే వచ్చేవారు.
ప్రశ్న --- ఆయన బ్రతికి ఉన్నరోజులలో ఆయనకు భక్తులు చాలామంది
ఉండేవారన్న విషయం మీకు తెలుసా?
జవాబు --- తెలుసు.
బషీర్ బాబాకు ఎంతోమంది శిష్యులు ఉన్నారు.
వారందరూ హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చినవాళ్ళే. మహారాష్ట్ర, షిరిడీనుంచి కాకుండా అందరూ హైదరాబాద్
నుంచి వచ్చినవాళ్ళే.
ప్రశ్న --- అయితే హైదరాబాద్ లో ఉన్న ఆయన ఆశ్రమంలో ఆయన భక్తులు
చాలామంది ఉన్నారన్నమాట, అవునా?
జవాబు --- అవును, హైదరాబాదులో ఉన్నారు.
ప్రశ్న --- మీకు ఆయన ఆశ్రమం పేరు తెలుసా?
జవాబు --- మాకు తెలీదు
ప్రశ్న --- ఆయన 1980 వ.సంలో మరణించి ఉండవచ్చా?
జవాబు --- 1980 లో గాని 1981 లో గాని అయి ఉండవచ్చు. మీకు కావాలంటే ఖచ్చితమయిన తేదీ తరువాత ఇస్తాము.
ప్రశ్న --- బషీర్ బాబా పుస్తకాలు ఏమయినా రాయడం గాని, ప్రత్యేకంగా
ఏమయినా బోధనలు చేయడం గాని చేసారా?
జవాబు --- మాకు ఆవిషయాలు ఏమీ తెలీవు.
నేను (ఆంటోనియో) --- నేను
ఇలా ఎందుకని అడిగానంటే బషీర్ బాబా తాను సాయిబాబాకు వారసుడినని చెప్పుకున్నట్లుగా చదివాను.
జవాబు --- లేదు, లేదు.
షిరిడి బాబా ఎవరినీ తన వారసులుగా నియమించలేదు. అలాంటిదేమీ లేదు.
ప్రశ్న --- బషీర్ బాబా ఖచ్చితంగా షిరిడీ బాబా భక్తుడయి ఉండాలి,
అవునా?
జవాబు --- ఆయన ఇక్కడికి వచ్చారు అంతే…
ప్రశ్న --- ఆయన తరచూ వస్తూ ఉండేవారా?
జవాబు --- సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు.
ప్రశ్న --- ఒంటరిగా వచ్చేవారా?
జవాబు --- కొంతమంది శిష్యులతో వచ్చేవారు. ఆయన శిష్యులు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు.
ప్రశ్న --- ఆయన ఆశ్రమం ఇప్పటికీ ఉందా? మీకేమయినా తెలుసా?
జవాబు --- మాకు తెలీదు.
ఆయన మరణించిన తరువాత ఆశ్రమం విషయాలు ఏమీ మాకు తెలీవు.
ప్రస్న --- ఆశ్రమం ఇక అంతరించిపోయిందని మీరు అనుకుంటున్నారా?
జవాబు --- ఆయన మరణించిన తరువాత ఆయన భక్తులు ఇక్కడికి రాలేదు. అయినా మాకు ఎటువంటి వివరాలు తెలియవు.
ప్రశ్న --- ఆయన ఆశ్రమం చిరునామా మీదగ్గిర ఉండి ఉండవచ్చు. బహుశ ఆయన ఇక్కడికి వచ్చిపుడు తన చిరునామా ఇచ్చారా?
జవాబు --- లేదు.
ప్రశ్న --- హైదరాబాదులో ఏప్రాంతంలో ఆశ్రమం ఉందో కూడా మీకు
తెలియదా?
జవాబు --- లేదు.
కాని మీరు ఈ వివరాలను శివనేశన్ స్వామి గారిని అడగండి. ఆయన చావడిలో ఉంటారు. అక్కడికి వెళ్ళండి మీరు.
నేను (ఆంటోనియో) మీకందరికీ
నాధన్యవాదాలు.
(రేపటి సంచికలో శివనేశన్ స్వామిజీతో సంభాషణ)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment