Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 5, 2021

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 25 వ.భాగమ్

Posted by tyagaraju on 6:49 AM

 



05.01.2020  మంగళవారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 25 .భాగమ్

(రచయిత… శ్రీ ఆంటోనియో రిగోపౌలస్ – ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేటహైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీకోపర్ గావ్ – షిరిడీ

శనివారమ్ – అక్టోబరు, 19, 1985

బాలాజీ పిలాజీ చెప్పిన మరికొన్ని విషయాలు  …

 నా డైరీలోని సారాంశాలు

బషీర్ బాబా గురించి శివనేశన్ స్వామితో సంగ్రహంగా జరిపిన సంభాషణ.  ఆయన వయసు 59 సంవత్సరాలు.  చావడిని కనిపెట్టుకుని ఉంటూ అక్కడె నివసిస్తున్నారు.  షిరిడిలో 30 సంవత్సరాల పైగా నివసిస్తున్నారు.

శివనేశన్ స్వామి చెప్పిన వివరాలు.

ఎప్పుడో నేను క్రితంసారి బషీర్ బాబాను చూసాను.  ఆయన నాకు కనిపించి తనకు యోగానంద (మంత్రదండం) , కొన్ని శక్తులు లభించాయని చెప్పారు.  ఆతరువాత కొన్ని సంవత్సరాలుగా ఆయన షిరిడికి రాలేదు.


ప్రశ్న   ---   ఆయన ధనసంపాదనకోసం, ప్రచారం కోసం అన్వేషిస్తూ ఉన్నారని నేను విన్నాను, కారణం అదేనా?

జవాబు   ---   ఆయన వేరే వ్యాపకాలలో అంటే, ఆయన తన ఇల్లు, తన పొలం, కుటుంబం వీటినే చూసుకుంటున్నారు.  ఆయనకు వివాహమయింది.  భార్యా పిల్లలు ఉన్నారు.

ప్రశ్న   ---   అయితే ఆయన అసలయిన గురువు కాదన్నమాట?

జవాబు   ---   కాని ఆయనకు కాస్తంత అత్యాశ ఎక్కువ.

బయటనుంచి ఎవరిదో స్వరం జవాబు

ఆయన కష్టాలలో పడ్డారు.

ప్రశ్న   ---   ఆయన 1983 లో మరణించారని మీరు అంటున్నారు?

జవాబు   ---   అవును.

బయటనుంఛి ఎవరో జవాబు

కాదు, 1983లో కాదు, జవరి 1985 లో.

ప్రశ్న   ---   ఈ సంవత్సరంలోనా?

తుకారామ్   ---   అవును, ఆయన ఈ సంవత్సరమే 1985 లో మరణించారు.  ఇది నిజమా కాదా అని ఎవరూ చూడటానికి వెళ్ళలేదు.

నేను  (ఆంటోనియో)   ---   మనం ఇంకా మాట్లాడుకోవడానికి రేపు మళ్ళీ వస్తాను.

జవాబు   ---   సరేనండి.  బషీర్ బాబా ఇక్కడ ఉన్నపుడు నేనాయనను చూశాను.  అప్పట్లో ఆయన చాలా ప్రఖ్యాతి వహించారు.  ఎంతోమంది భక్తులను కూడగట్టుకోవడానికి భారతదేశమంతటా పర్యటించారు.  కాని ఇటీవల ఆయన ప్రవర్తన బాగాలేదు (నవ్వుతూ)

బయటినుంచి మరొక స్వరం జవాబు

ఆయన తనకు తానే తను ఏమిటో నిరూపించుకొన్నారు.  ప్రజలందరూ అర్ధం చేసుకొన్నారు.

ప్రశ్న   ---   ఆయన ఒక మోసగాడని అర్ధమయిందా?

బయటినుంచి ఎవరో  అవును.

నేను  (ఆంటోనియో) ---   ధన్యవాదాలు, రేపు మళ్ళీ కలుస్తాను.

షిరిడిలోని లెండీతోటలో, సాయంత్రం గం.6.45 కు

స్వామి శేఖరరావుతో రెండవసారి సంభాషణ.

స్వామి శేఖరరావు---

ఇపుడు మీకు నా అలవాట్లు చెబుతాను

నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేచి బాబా దర్శనం చేసుకొంటాను.  రోజంతా బాబా జపం చేసుకుంటు ఉంటాను.  ఆయన నామస్మరణ అంతే.  బాబాకు సంబంధించిన పుస్తకాలు చదువుతాను.  నాకెటువంటి సుఖాలు, కోరికలు, ధనం, చింతలు ఏమీ లేవు.

ప్రశ్న   ---   అయితే మీరు అన్ని బంధాలను పూర్తిగా వదిలించేసుకుని జీవిస్తున్నారా?

జవాబు   ---   అవును.  నాకు ధనం అవసరం లేదు.  ఇంకా ఎటువంటివి నాకు అవసరం లేదు.

ప్రశ్న   ---   ఆవిధంగా సాధుజీవితం గడుపుతున్న భక్తులు ఇంకెవరయినా షిరిడిలో ఉన్నారా?

జవాబు   ---   దీని గురించి నేను చెప్పలేను.  వారికి, భగవంతునికి మాత్రమే తెలుసు.  పుట్టపర్తిలో బాబాకు ఉన్న ఆశ్రమంవంటిదే ఇక్కడ    కూడా అలాంటి ఆశ్రమం ఉండాలని నా కోరిక.  ఇక్కడ ఆశ్రమాలు ఏమీ లేవు.  షిరిడీకి ఎంతోమంది సాధువులు, సన్యాసులు వస్తూ ఉంటారు.  వారు ఉండటానికి ఇక్కడ వసతి లేదు.

ప్రశ్న   ---   అంటే మీ ఉద్దేశ్యంలో ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమయిన ప్రదేశం ఉండాలనా?

జవాబు   ---   అవును. ధ్యానానికి ఇంకా మిగతా అవసరాల కోసం వారికి ఇక్కడ చుట్టుప్రక్కల అటువంటి ప్రదేశం ఏదీ లేదు.

ప్రశ్న   ---   అయితే మీరు ఒక ఆశ్రమాన్ని కట్టిద్దామనుకుంటున్నారా?

జవాబు   ---   అవును.  నామనసు ఆవిధంగా నాకు చెబుతోంది.  కాని ఏమి జరుగుతుందో బాబాకు మాత్రమే తెలుసు.

నేను  (ఆంటోనియో)   ---   ఇది చాలా ఆసక్తికరంగా ఉంది  చాలా బాగుంది.

తుకారామ్   ---   అవును.

నేను  (ఆంటోనియో)   ధన్యవాదాలు.

షిరిడి  --  సాకోరి  --  షిరిడి

ఆదివారమ్, అక్టోబరు, 20, 1985

నాడైరీలోని సారాంశాలు

సాకోరీమధ్యాహ్నం. గం.2.30.  ఈరోజు మరొక శుభదినం.  షిరిడిలో గత 30 సంవత్సరాలుగా చావడి దగ్గరనే నివాసముంటున్న శివనేశన్ స్వామితో ఈ రోజు ఉదయం చాలా సుదీర్ఘంగా సుమారు గంటన్నర సేపు మాట్లాడాను.  మా సంభాషణ చాలా బాగా జరిగింది.  ఆయన తన గురించి సాయిబాబా గురించి ఆయన బోధనల గురించి చాలా విపులంగాను ఆసక్తిదాయకంగాను అనేక వృత్తాంతాలను వివరించారు. ఆయన చెప్పిన విషయాలు హృదయాన్ని కదిలించాయి.  శివనేశన్ స్వామితో మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న మరొక వ్యక్తితో కూడా మాట్లాడాను.  అతను అక్కడే 5 సంవత్సరాలుగా భిక్షమెత్తుకుంటు జీవిస్తున్న సాధువు.  అతని పేరు ఎ.నగేష్ చూర్య.  ఈమధ్యనే అతను బొంబాయిలోని అంధేరీ ప్రాంతానికి వెళ్ళిపోయాడు.

ఆతరువాత నేను సాకోరీకి వెళ్లాను.  కన్యాకుమారి సంస్థానం కార్యదర్శి, నిర్వాహకుడు (మేనేజరు) అయిన శ్రీ టి.ఎన్. టిప్నిస్ తో చాలా సుదీర్ఘంగా మనసు ఆకట్టుకునే రీతిలో సంభాషించాను.  సతీ గోదావరి మాత తరువాత రెండవ స్థానంలో ఆయనే అత్యంత ప్రాముఖ్యత వహించిన అధికారిక వ్యక్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు.  ఆతరువాత నేను మాతాజీని దర్శించుకొన్నాను.  మరలా మరొకసారి అక్టోబరు, 24.తేదీన సాకోరికి రావాలి.  అపుడు ఆమెతో మాట్లాడె అవకాశం కలుగుతుందనుకుంటున్నాను.  ఇపుడు జరుగుతున్న యజ్ఞ కార్యక్రమాలన్నీ అక్టోబరు 23.తేదీతో పూర్తయిపోతాయి కాబట్టి, 24.తారీకున కనీసం కొద్ది నిమిషాలయినా ఆమె నాతో మాట్లాడటానికి సమయం కుదరచ్చు.

నేను మళ్ళీ టిప్నిస్ గారిని కలవాలి.  ఆయన నా పరిశోధనకు ఉపయోగ పడతాయని చెప్పి కొన్ని ముఖ్యమయిన పుస్తకాలు ఇస్తానని చెప్పారు.  ఇక్కడ ఆశ్రమంలో భోజనం బాగుంది..  ఇపుడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.

రాత్రి గం.7-15 షిరిడీలో నేను ఉంటున్న హోటల్ గదిలో…

సాకోరీలో ఎన్నో పుస్తకాలు కొన్నాను.  వాటిల్లో వాల్యూమ్ I లో మొదటి రెండు భాగాలు ఉన్న పుస్తకం The Talks of Sadguru Upasani Baba Maharaj – Edited by Godamasuta, మరొక పుస్తకం Sage of Sakori (Life Story of Sri Upasani Maharaj) by Sri B.V.Narasimha Swamy (Part I) మరొక పుస్తకం by SrI Subba Rao (Part II).  నేను టిప్నిస్ తో మట్లాడాను.  ఆయన 1975 లో ప్రచురించిన పుస్తకం “The Saints of the Deccan of the 20th Century” ఇచ్చారు.  ఆ పుస్తకంలో స్వామి రామదాస్, గులాబ్ రావు మహరాజ్, గొండావలేకర్ మహరాజ్ ల గురించి వివరంగా రాశారు.  ఆపుస్తకాన్ని గోదావరి మాతకు అంకితమిచ్చారు.  నేను మరలా 24వ.తారీకున వస్తానని అయనతో చెప్పాను.  ఆయన తను ఉపాసనీ మహరాజ్ మీద వ్రాసిన పరిశోధనా వ్యాసాన్ని  (Phd.thesis) చూపిస్తానని, ఇంకా మరికొంత ఉపయోగకరమయిన సమాచారాన్ని కూడా ఇస్తానని నాకు మాటిచ్చారు.  నేను సతీగోదావరీ మాతను కలుసుకుని మాట్లాడటానికి అదే ఆఖరి అవకాశం.  ఆమెకు నాగురించి, నేను చేస్తున్న పరిశోధన గురించి సమాచారం ఇచ్చినట్లుగా టిప్నిస్ చెప్పారు.  సాకోరి గురించి కన్యాకుమారి సంస్థానం గురించి ముఖ్యమయిన అన్ని విషయాలను నాకు చెప్పమని ఆమె టిప్నిస్ గారికి ఆదేశమిచ్చినట్లుగా నాకు స్పష్టంగా అర్ధమయింది.

(ఇంకా ఉంది)

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List