18.06.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు – డిసెంబరు, 2008 వ.సంవత్సరంలో ప్రచురింపబడిన సాయిలీల
షిరిడీ సాయిబాబా – గురునానక్ – 5 వ.భాగమ్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
కలిపురుషుని ప్రభావం మన మీద పడకుండా
గురునానక్ గారు మనకి రక్షణ కల్పించారు. ఆయన
మహాపవిత్ర స్థానంలోకి ప్రవేశించి ఎటువంటి కోరికలు లేని జీవితాన్ని సుఖంగా ప్రశాంతంగా
గడపాలా వద్దా అన్నది ఇపుడు మనం నిర్ణయించుకోవాలి.
నానక్ ప్రసిధ్ధమయిన పదాలను ఉఛ్చరించారు.
ఏక్ ఓంకార్ – ఒకటే ఓంకారం. సృష్టి మొదట ఒకే ఒక మొదటి ద్వని (సమస్తం అంతమయినా నిరంతరం
కొనసాగుతూ ఉంటుంది) ఒకే భగవంతుడు. (అనేక
తరంగాలు ఉన్నా సముద్రం ఒక్కటే)
సత్ నామ్ – వాస్తవము అదే పరమార్ధము (వాస్తవమయినదేదో అదే పరమార్ధము)
కర్తా పురుఖ్ – సృష్తికర్త
నిర్ భయ్ – భయం లేకుండా - నిర్భయుడు.
నిర్ వైర్ – శతృవులు లేనివాడు (అజాతశతృవు)
అకాల్ మూరత్ – వర్ణింపశక్యము కానట్టివాడు.
కాలాతీతుడు. శాశ్వతుడు (కాలాతీతుడు భగవంతుడిని కాలము బంధించలేదు. కాలము భగవంతునికి సేవకుడు
) భగవంతునికి కాలము యజమాని కాదు.)
(కాల్ అనగా సమయం అకార్ అనగా కాలాతీతము. కాలము మారుతూ ఉంటుంది. కాని భగవంతునికి మాత్రం మార్పులేదు. ఆది మధ్యాంతరహితుడు.)
అయోనిసాయిభన్ – అయోని సంభవుడు.
గురుప్రసాద్ – గురువుయొక్క దయ. (ఆయన దయతో భగవంతుని నామాన్ని స్వీకరించడం వల్ల అహం కరిగిపోయి ఆనందానుభూతిని
అనుభవించుట)
మానవుడు తనంతతాను ప్రయత్నించి భగవంతుడిని
పొందలేడు. భగవంతుడిని గురించి తెలుసుకోవాలనే
జిజ్ఞాస, తపనలతో తన జీవితాన్ని
అంకితం చేసుకున్న గురువు చెప్పే బోధనల ద్వారా భగవంతుడు మొదటగా వారి కళ్ళు తెరిపించి తన ఇచ్చాపూర్వకంగా జ్ఞానాన్ని
ప్రసాదిస్తాడు.
జప్ – భగవన్నామ స్మరణ
ఆది సచ్ – జుగాదీ సచ్ – సృష్టి మొదలునుంచి ఉన్నది. అదే పరమార్ధము.
హై భీ సచ్. ఇపుడూ ఉన్నది.
నానక్ హోసీభీ సచ్
--- తాను ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటానని చెప్పారు
ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే పైన చెప్పబడిన పదాలు గురుగ్రంధ సాహెబ్ పవిత్ర గ్రంధంలో పారంభంలోనే పొందుపరచబడ్డాయి.
ఓ! బాబా! అదేవిధంగా
శాశ్వతంగా నిలిచిపోయే నువ్వు చెప్పిన వచనాలు కూడా శ్రీసాయి సత్ చరిత్ర సువర్ణ పుటలలో లిఖింపబడ్డాయి.
ముముక్షి – స్వేఛ్ఛ పొందాలనే తీవ్రమయిన కోరిక.
ఈ
స్వేఛ్ఛ దేనినుండి? బంధాలకు తాను కట్టుబడి ఉన్నానని ఆ బంధాలనుండి విముక్తిని కోరుకుంటూ ఆదిశలో మనస్ఫూర్తిగా, ధృఢసంకల్పంతో శ్రమిస్తూ ఇతర ఆలోచనలు ఏమి లేకుండా ఉన్నవాడు, ఆధ్యాత్మిక జీవనానికి అర్హత పొందినవాడు, భగవత్ కృపను పొందాలని కోరేవాడికే ముముక్షువు అని పేరు.
విరక్తి – ఈ ప్రాపంచిక విషయాలు, ఆ తరువాతివాటియందు విరక్తి.
ఆసక్తి
లేకుండుట. మానవుడు
తన సంపాదనను, తన చేతలద్వారా సంపాదించుకున్న గౌరవ మర్యాదలపైనను ఎటువంటి ఆసక్తి కనపరచకుండా వైరాగ్యాన్ని పెంచుకొనుట.
ఈ
వైరాగ్యము లేని మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడానికి అర్హుడు కాడు.
అంతర్ముఖత – మన ఇంద్రియాలను భగవంతునిచే సృష్టింపబడ్డాయి.
అవి
ఎప్పుడూ బాహ్యప్రపంచాన్నే చూస్తాయి.
అందుచేత
మానవుడు ఎల్లప్పుడూ బాహ్యజగత్తునే చూస్తాడు.
అమరత్వాన్ని
కోరుకునేవానికి
అంతరదృష్టి ఉండాలి.
(అంతర్ముఖులు బాహ్య జగత్తులోని వస్తువులు, వ్యక్తుల ఆకర్షణలకు అతీతంగా ఉంటారు.
అంతర్ముఖులు
కార్యార్ధం బాహ్య ముఖతలో వచ్చి ఇంద్రియాలను ఆధారం చేసుకుని కార్యం పూర్తికాగానే ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళి అనుభవాలనే సాగరంలో మునిగి ఉంటారు.
అంతర్ముఖత – అంతర్+ముఖము – అనగా మన బుద్ది లోపలవైపుకు ఉండాలి.
లోపల
ఉన్న ఆత్మ స్వరూపాన్ని చూస్తూ ఆత్మాభిమానిగా కావటమే అంతర్ముఖత.
క్షాళన ప్రక్రియ -
పాపములనుండి
ప్రక్షాళన. మానవుడు
తన దుష్టత్వమునుండి బయట పడకుండా తప్పులు చేయడం మానకుండా పూర్తిగా తనకు తానే మలచుకుంటాడు.
అటువంటి
మానవునికి మానసిక ప్రశాంతత ఉండదు.
జ్ఞానం
ఉన్నా మనస్సు శాంతి పొందనివాడు ఆత్మజ్ఞానాన్ని సాధించలేడు.
సత్ప్రవర్తన -
సత్యమార్గంలో
నడవనివాడు, అంతర్ దృష్టి, తపము, బ్రహ్మచర్యము ఇవేమీ ఆచరించనివానికి భగవత్ సాక్షాత్కారము దుర్లభము.
శ్రేయమును (మంచిని) కోరుకొనుట, ప్రేయము… ప్రియమయినవి (ఆనందమును కలిగించునవి) -
మానవుని
జీవితంలో ఎంచుకోదగ్గవి రెండు ఉన్నాయి.
అవి
మనకి మంచిని కలిగించేవి.
రెండవది
ఆనందాన్ని కలిగించేవి.
మొట్టమొదటిది
ఆధ్యాత్మిక వ్యవహారాలకు సంబంధించినవయితే, రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది.
మానవుని
అంగీకారం కోసం ఈ రెండూ మానవుని సమీపంగా వస్తాయి.
మానవుడు
ఆలోచించి ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి.
వివేకవంతుడు
ప్రేయానికన్నా
శ్రేయమయినదే
కోరుకుంటాడు. (ఆనందాన్ని కాకుండా మంచిని కలుగచేసేదానినే).
కాని
దురాశ, మోహం ఉన్న అవివేకి ఆనందాన్నిఇచ్చేదానిని కోరుకుంటాడు.
(పైన ఉదహరించినవన్నీ శ్రీ సాయి సత్ చరిత్ర 16 – 17 అధ్యాయాలలో మనకు కనిపిస్తాయి.
బ్రహ్మజ్ఞానాన్ని కోరిన
వ్యక్తికి బాబా చేసిన హితబోధ)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment