12.07.2022 మంగళవారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
గురు పౌర్ణమి శుభాకాంక్షలు
శ్రీ
సాయి దయా సాగరమ్ 16వ, భాగమ్
అధ్యాయమ్
–14
సాయిబాబా
ప్రసాదించిన అధ్భుత లీల
అధ్యాయమ్
13 'GREAT POWER AND MIRACLE' “షిరిడి సాయిబాబాతో తర్ఖడ్ కుటుంబమువారి అనుభవాలు” లో వెండిభరిణి అనే పేరుతో ప్రచురించాను. ఆంగ్ల పుస్తకంలో చాలా తక్కువగా ఇచ్చినందువల్ల దానిని ప్రచురించటంలేదు.
మా
అత్తగారయిన శ్రీమతి యశోదా బాయి రంగనాధ్ గావంకర్ సాయిబాబాబా భక్తురాలు. ఆవిడది అందరికీ సహాయపడే మనస్తత్త్వం. సాయిబాబా వారి కులదైవం. బాబాగారు జీవించి ఉండగా ఆవిడ తన జీవితకాలంలో మూడుసార్లు
షిరిడీకి వెళ్ళారు. బాబాను స్వయంగా కలుసుకున్న
అదృష్టవంతురాలు.
ఎం.బి.బి.ఎస్.
వైద్యుడయిన రంగనాధ్ నారాయణ్ గావంకర్ గారిని వివాహమాడింది. ఆయనతో వివాహమయినప్పుడు మా అత్తగారి వయసు 14 సంవత్సరాలు. సాయిబాబాయే వారి వివాహాన్ని నిశ్చయించారు. మా మామగారు వసైలోనే ఉండేవారు. అందువల్ల వివాహాన్ని వసైలోనే జరిపించాలని అన్నారు. కాని మా అత్తగారి తలిదండ్రులు వసైలో జరిపించడానికి
ఇష్టపడలేదు. వారి కూతురు ఒకామెకి వసైలోని వ్యక్తికే
ఇచ్చి వివాహం చేసారు. కాని విధివశాత్తు వివాహం
అయిన సంవత్సరంలోపే ఆమె భర్త చనిపోవడంతో వసైలో వివాహం చేయడం వారికిష్టం లేకపోయింది.
అది
1917 వ,సంవత్సరం. దేశమంతా ప్లేగు వ్యాధి వ్యాపించి
ఉంది. వసైలో కూడా ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రజలందరూ వసై వదిలి వెళ్ళిపోసాగారు. వివాహ కార్యక్రమం జరిపించడానికి కొద్ది మంది బంధువులు
మాత్రమే ఉన్నారు. సాయిబాబా దీవెనలతో ఎటువంటి
అడ్డంకులు లేకుండా వివాహం జరిగింది.
వివాహమయిన
తరువాత క్రొత్త దంపతులు సాయిబాబా దర్శనానికి షిరిడీ వెళ్లారు. డా.గావంకర్ గారు కొత్తగా ఆస్పత్రిని ఎక్కడ ప్రారంభించమంటారని
బాబాని అడిగారు. వసైలోనే ఆస్పత్రిని ప్రారంభించమని
బాబా అన్నారు. బాబా ఆదేశానుసారం గావంకర్ గారు
వసైలోనే తన ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి
‘సాయి ఆస్పత్రి’ అని పేరు పెట్తారు. 94 సంవత్సరాలనుండి
వసైలోనే ఆ ఆస్పత్రి ఇప్పటికీ ఉంది. ఆయన కుమారుడు
డా.విజయ్ గావంకర్ ఆ ఆస్పత్రిని నిర్వహిస్తూ ఉన్నారు.
అక్కడ
పేదప్రజలకు, అవసరమయిన వారందరికీ సేవ చేస్తున్న ఆస్పత్రిగా సాయిఆస్పత్రి ప్రాచుర్యం
పొందింది.
నీలిమా
గావంకర్
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment