19.07.2022 మంగళవారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ
మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 17 వ, భాగమ్
అధ్యాయమ్
–15
సాయిబాబావారి
ఊదీ
ఇది
నా స్వీయానుభవం. 1971 వ.సం.లో మాబాబుకి 7 –
8 నెలల వయసులో జ్వరం వచ్చింది. నా భర్త వైద్యుడవడం
వల్ల బాబుకి ఆయనే వైద్యం చేయసాగారు. కాని జ్వరం
మాత్రం తగ్గడంలేదు. బాబు వళ్ళు తెలియకుండా
మనలోకంలో లేనట్లుగా ఉన్నాడు. నా భర్త కూడా
బాబు గురించి చాలా ఆందోళన పడ్దారు. ఎంత వైద్యం
చేసినా ఫలితం లేకపొవడంతో ఇక తనవల్ల కాదని చెప్పేశారు. మేము బాబుని బొంబాయి తీసుకువడదామనుకున్నాము గాని,
బాబుకి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యపడలేదు. మా అత్తగారు బాబుని సాయిబాబా ఫోటో వద్ద ఉంచి అగరువత్తులు
వెలిగించారు. వెలిగించగా వచ్చిన అగరువత్తుల బూడిదనే బాబావారి పవిత్రమయిన ఊదీగా
భావించి బాబు నుదుటన రాసారు. మేమందరం సాయిని
ప్రార్ధించసాగాము. అరగంటలోనే జ్వరం తగ్గుముఖం
పట్టడం ప్రారంభమయింది. బాబుకి గండం గడిచింది. ఈ రోజు వరకు నేను బాబా ఊదీ లీలల గురించి విన్నాను. ఇది మాత్రం నా స్వీయానుభవం. ఇపుడు మా అబ్బాయికి 43 సం. వయసు. మాకు ఏ సమస్య
వచ్చినా బాబా ఊదీ మాకు రక్షణగా ఉండి రాబోయే ప్రమాదాలనుండి కాపాడుతూ ఉంది.
నీలిమా
గావంకర్
శ్రీ
సాయి దయాసాగరమ్ – 18 వ.భాగమ్
అధ్యాయమ్
– 16
సాయి
నామస్మరణ ప్రాముఖ్యత
మా
అబ్బాయి ఇంజనీరింగ్ చదువు పూర్తయిన తరువాత ఒక మల్టీనేషషల్ కంపఎనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ శుభ సందర్భంలో మేము షిరిడీ వెళ్లాలనుకున్నాము. మాకు మారుతీ వాన్ ఉంది. మేము మొత్తం నలుగురం ఉన్నాము. నేను, నాభర్త, మా ఇద్దరు అబ్బాయిలు, కాక మా కుటుంబ
స్నేహితుని కొడుకు. మేము వసైలో ఉదయం బయలుదేరి
నాసిక్ కి క్షేమంగా చేరుకున్నాము. నాసిక్ లో భోజనం చేసి దగ్గరలో ఉన్న దుకాణంలో కూల్ డ్రింక్ తాగాము. ఆ తరువాత కారు మా అబ్బాయి
డ్రైవ్ చేయసాగాడు. ఒక గంట తరువాత ఒక అంబాసిడర్
కారు మాకు ఎదురుగా చాలా వేగంగా వస్తూ మా కారుని గుద్దింది. చాలా పెద్ద ప్రమాదం జరిగి మా అబ్బాయికి బాగా దెబ్బలు
తగిలి గాయాలయ్యాయి. కాలు విరిగింది. మిగతా ఇద్దరబ్బాయిలకి కూడా దెబ్బలు తగిలాయి. మా కారు బాగా చిత్తయిపోయింది. మా కారుని అక్కడే వదిలేసి మేము టాక్సీలో నాసిక్
చేరుకున్నాము.
ముందు
మా అబ్బాయికి వైద్యం చేయించడానికి ఆస్పత్రికి తీసుకు వచ్చాము. నేను నా భర్త ఇద్దరం అయోమయ స్థితిలో ఉన్నాము. మా కుటుంబాన్ని రక్షించి మా అబ్బాయిని కూడా కాపాడమని
బాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను. నేను చాలా నిరాశలో
ఉండి ప్రమాదం జరిగినందుకు బాబాని నిందించడం మొదలుపెట్టాను.
ఈ
ప్రమాదంనుండి మా అబ్బాయి బయటపడనట్లయితే నేను షిరిడీకి కూడా రానని బాబాకి మనసులోనే చెప్పాను. బాబా మా అబ్బాయిని కనిపెట్టుకుని ఉన్నారు. అందువల్లనే చాలా కొద్ది సమయంలోనే మా అబ్బాయి కోలుకున్నాడు. అది బాబా మాత్రమే చేయగల అధ్బుతం.
తన
భక్తులు ఎక్కడ ఉన్నా బాబా ఎల్లపుడూ వారి యోగక్షేమాలను చూస్తూ ఉంటారనే దానికి ఇది నా
స్వీయానుభవం. మనం చేయవలసినదల్లా నామస్మరణ.
నీలిమా
గాగంకర్.
బాబా
నిరంతర నామస్మరణ చేస్తూ స్కూటర్ మీద వెడుతున్న నన్ను పాము గండంనుంచి బాబా కాపాడారు. దీనికి సంబంధించిన లీలను ఇదే బ్లాగులో కొన్ని సంవత్సరాల
క్రితం ప్రచురించాను ,,,,, త్యాగరాజు
(సర్వం
శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment