05.08.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
శాయి బంథువులకు శ్రావణ శుక్రవారము బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు తార్ఖడ్ వారి అనుభూతులలో మరొక అనుభూతిని తెలుసుకుందాము.
పునరుజ్జీవం పొందిన శవం
ఓం శ్రీ సాయినాథాయనమహ
సాయి బాబా భక్తులందరికీ అటువంటి ఆథ్యాత్మిక అనుభూతులు కలిగి ఉంటాయని నాకు బాగా తెలుసు, దాని ఫలితం వల్లనే బాబా పేరు ప్రతిష్టలు అన్ని దేశాలలోను వ్యాపించింది. న్యూఢిల్లీకి దగ్గరలో ఉన్న ఛత్తర్పూర్ శ్రీ సాయి మందిరానికి సంబంధించిన బాబా భక్తురాలు మిస్. భకునీ గారిని కలుసుకోవడం జరిగింది. ఆమె చరిత్రలో పీ.హెచ్.డీ. చేస్తోంది. ఆమె యెన్నుకున్నది సాయిబాబా గురించి. ఆమె బాబా మీద యింతో పరిశోథన చేసింధి. వారి ట్రస్ట్ మూడు మాసాలకొకసారి హిందీలొ పత్రిక ప్రచురిస్తోంది. అది చాలా విజ్ఞానదాయకంగా వుంది. బాబాగారు ఉన్న కాలంలో ఆయన బోథనలు బొంబాయి, మహారాష్ట్రలలో ముఖ్యంగా దాస గణు మహరాజ్ వల్ల తప్ప మరెవరి వల్లా వ్యాప్తి చెందలేదు. బాబా ఆయనని "గన్యా" అని పిలుస్తూ ఉండేవారు. వాటి ద్వారా ఆయన బాబా లీలలు ప్రజల మీద ప్రభావం చూపేలా చేసి ఆయన బోథననలని సామాన్య ప్రజానీకం లోకి కూడా వ్యాపింప చేశారు.
ఒకసారి దాస గణు గారు షిరిడీలో ఉన్నప్పుడు, షిరిడీకి దగ్గిరున్న గ్రామంలో హరికథ చెప్పమని ఆయనని పిలిచారు. దాసగణూ గారు హరికథ ప్రారంభించేముందు, ఒక చిన్న బల్ల మీద బాబా చిత్రపటం ఉంచి, దానికి దండ వేసి మొదలు పెడుతూ ఉండేవారు. షిరిడీ కి దగ్గర, చుట్టుపక్కల హరికథలు చెప్పడానికి బయలుదేరేముందు ఆయన బాబా వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేవారు. ఒక రోజు మథ్యాహ్ న్నం ఆయన ద్వారకామాయికి వచ్చి, తాను ఆ రోజు సాయంత్రం ప్రక్కనున్న గ్రామంలో హరికథ చెప్పడానికి వెడుతున్నానని, దానికి ఆయన ఆశీర్వాదములు కావాలని చెప్పారు.
బాబా గారు ఆయనతో స్వేచ్చగా వెళ్ళవచ్చుననీ, కాని తనతో కూడా భావూని (మా నాన్నగారిని) తీసుకువెళ్ళమని కోరారు.
దాస గణు, తనతో కూడా మా నాన్నగారిని తీసుకువెళ్ళడానికి అభ్యంతరం లేదని, కాని సాయంత్రం ద్వారకామాయిలో ఆయన లైట్లు వెలిచించే అలవాటుకు అడ్డంకి అవుతుందని అందుచేత యిష్టం లేదని చెప్పారు. యిది వినగానే బాబా దాని గురించి ఆయన బెంగ పెట్టుకోనవసరం లేదని, ఆపని యెవరైనా చేస్తారని కాని దాసగణుతో భావూని తప్పకుండా తీసుకుని వెళ్ళమని మరీ మరీ చెప్పారు. దాసగణు, మా నాన్నగారు (ఆయన అప్పుడు అక్కడే వున్నారు) అది బాబావారి యిష్టపూర్వకమైన ఆజ్ఞ అని అర్థం చేసుకున్నారు. ఆపుడు వారు ఒప్పుకున్న సమయం ప్రకారం, ఆ సాయంత్రం 7, 8 కి.మీ. దూరంలో ఉన్న గ్రామానికి బయలుదేరి వెళ్ళారు.
ఆ రోజుల్లో యిప్పటిలాగా ప్రయాణ సాథనాలు లేకపోవడం వల్ల వారు కాలినడకన వెళ్ళాల్సి వచ్చింది. వారు గ్రామలోకి ప్రవేశించేసరికి, సూర్యుడప్పటికే అస్తమించాడు. వారు చాపలని నేలమీద పరచి, ఒక బల్ల మీద బాబా చిత్రపటాన్ని ఉంచి దండ వేశారు. పెట్రోమాక్స్ లైట్లు వెలిగించి నాలుగు మూలలా వేలాడ దీశారు. గ్రామస్తులందరూ సమావేశమయ్యారు. దాసగణు గారు హరికథను మొదలుపెట్టారు.
ఒక గంట తరువాత బాగా రాత్రి అయాక వారు కష్టాన్ని యెదొర్కొన్నారు.
సుమారు 7, 8 మంది నల్లటిశరీర ఛాయలో , బహుశా భిల్ల జాతివారయి ఉండొచ్చు, అక్కడికి వచ్చారు. వారు తమ భుజాల మీద ఒక శవాన్ని మోసుకుని వస్తూ ఆఖరి సంస్కారాలు పూర్తి చేయడానికి సమాథిచేయడానికి వెడుతూ ఉన్నారు. వారి నాయకుడు దాసగణు మహరాజ్ వద్దకు వచ్చి, ఆయనని బెదిరించాడు. అతను బల్ల మీద ఉన్న ఫోటో గురించి అడిగాడు. దాసుగణు ఆ ఫోటో సాయిబాబా వారిదని వినయంగా చెప్పాడు. తను ఆయనని తన గురువుగా, దేవునిగా ఆరాథిస్తానని,. యింకా చెబుతూ సాయి బాబా బీదలకు వైద్యం చేసి వారి వేదనలని పోగొడతారని చెప్పాడు. గ్రామస్తులకు సంతోషాన్నిచ్చే హరికథలను చెబుతున్నానని వివరించారు.
అపుడా భిల్ల నాయకుదు తన తోటివారితో పాడెని కిందకి దిచమని చెప్పి, దాసగణూతో " అతని దేవుడే కనక శక్తిమంతుడయితే ఆ శవంలోకి ప్రాణం తెప్పించడం సాథ్యమే అని అన్నాడు. అతను ఆయనతో అలా చేయమని సవాలు విసిరి లేకపోతే ఆయనని, ఆయనతో ఉన్నవారిని చంపేస్తానని చెప్పాడు.
మా నాన్నగారు యిదంతా బహుశా బాబాగారు సృష్టించినదే అయి ఉండవచ్చని, రక్షించమని ఆయన దయకోసం ఆయననే వేడుకోవాలనుకున్నారు. ఆయన దాసగణుతో ఆయనకిష్టమయిన కీర్తన, "సాయి రహం నజర్ కర్నా, బచ్చోంకా పాలన్ కర్నా" పాడమని యిక బాబా నిర్ణయానికి వదలి వేయమని చెప్పారు. అపుడు దాసగణు తనకిష్టమయిన కీర్తనని పాడటం ప్రారంభించారు. ఆయన దానిలొ బాగా తన్మయత్వం చెందారు. మా నాన్నగారు ఆయనని ఆస్థితిలో యింతకు ముందెన్నడూ చూడలేదు. ఆయన అందులో లీనమయిపోయి నృత్యం చేస్తున్నారు. గ్రామస్తులు కూడా ఆయనతో కలిసి తలూపుతున్నారు. మానాన్నగారి దృష్టి శవం మీదే ఉంది. ఒక గంట సమయం గడిచి ఉంటుంది. అనుకోని సంఘటన జరిగింది. శవంలోకి ప్రాణం వచ్చింది. అది తనకున్న కట్లన్నిటినీ తెంచుకుని పాడె మీద కూర్చుని చప్పట్లు కొడుతూ మిగతావారితోపాటుగా పాటలొ పాలు పంచుకొంది. అది చూసి మా నాన్నగారికి మహదానందమయింది. ఆయన తన చోటునుంచి లేచి దాసగణుగారి దగ్గరకి వెళ్ళారు. ఆయన స్పృహలో లేరు. ఒక విథమైన పరవశత్వంలో ఉన్నారు. మా న్నాన్నగారు ఆయనని రెండు చేతులతో పట్టుకుని పాట పాడటం ఆపమని బాబాగారు తమని ప్రాణ భయాన్నించి రక్షించారని చెప్పారు. పాట ఆగింది. భిల్లులు లేచి నిలబడ్డారు. వారు ఆ శవాన్ని (యిక అది శవం కాదు) తనంత తానుగా నిలబడేందుకు సహాయం చేశారు. వారు అతనితో దాసగణుకి వంగి నమస్కారం చేయమని చెప్పారు. తరువాత బాబాగారి గురించి పుర్తి వివరాలు అడిగి తెలుసుకుని తాము వారి దర్శనానికి షిరిడీ వస్తామని మాట యిచ్చారు.
మరునాడు, దాసగణు, మానాన్నగారు ద్వారకామాయికి వెళ్ళినప్పుడు, బాబా " హే గన్యా ! నిన్న నా భావూ నీతో కూడా ఉన్నాడు, లేకపోతే ఆ భిల్లుల ఆగ్రహావేశాలనుండి నిన్నెవరు రక్షించేది?" యిది వినగానే యిద్దరూ బాబాతో అదంతా ఆయన సృష్టించిందేనని, అటువంటి పరిస్తితుల్లో తాము పూర్తిగా ఆయన మీదే ఆథార పడ్డామని, యెల్లప్పుడు ఆయన యొక్క దయ, ఆశీర్వాదముల జల్లు తమ మీద కురిపిస్తూ ఉండాలని అన్నారు.
ప్రియ పాఠకులారా యిక్కడ మీకు చాలా అనుమానాలు వచ్చి ఉండవచ్చు. నేను మిమ్మలిని వేడుకునేదేమంటే దయ చేసి దీనిని నమ్మండి ఆ శవం నిజంగా చనిపోయి ఉండకపోవచ్చు. కాని కోమాలో ఉంది. ముఖ్యమైన దేమిటంటే హరికథ చెప్పేటప్పుడు యేమి జరుగుతుందనేది బాబాకి ముందే తెలుసు లేక అదంతా దాసగణులో నమ్మకాన్ని గ్రహించుకునేలా చేయడానికి ఆయన సృష్టించినది కావచ్చు. మానవాళిని తన వైపుకు యెలా లాక్కోవాలో బాబాకి బాగా తెలుసు. యిదిలా జరుగుతూనే వుంటుంది. మనం ఆయనపై ఢృఢమైన నమ్మకాన్ని ఉంచుకోవాలి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment