Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, May 10, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -10 వ.భాగమ్

Posted by tyagaraju on 9:15 AM
Image result for images of saibanisa
Image result for images of flower garden in dubai

10.05.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయిబానిస గారికి బాబావారు ప్రసాదించిన ఆధ్యాత్మిక జీవితంపై మరికొన్ని సందేశాలు
Image result for images of saibanisa

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మిక జీవితం -10 వ.భాగమ్

91.  నీలోని పగకు కారణం నీకు జరిగిన అన్యాయం. అన్యాయానికి మూలం నీలోని అజ్ఞానంనీలోని అజ్ఞానాన్ని తొలగించుఅపుడు నీవాడు పైవాడు అనే భేదాలు నీలో ఉండవుఅపుడు నీలో పగ వైషమ్యాలకు చోటుండదు


92.  కుష్టువ్యాధితో బాధపడుతున్నవాడు తన శరీరావయవాల రూపును పోగొట్టుకుంటున్నాడు. అదే అసూయ అనే వ్యాధితో బాధ పడుతున్నవాడు తన మనశ్శాంతిని పోగుట్టుకుని తన జీవితాన్ని నాశనం  చేసుకుంటున్నాడు.
Image result for images of man without peace of mind


93.  స్త్రీలోని అందచందాలు పురుషునిలో వికారాలు లేపడం సహజం పురుషులలోని వికారాలే ఆ స్త్రీ నాశనానికి మొదటిమెట్టుఅందుచేత స్త్రీలు తమ అందచందాలను బహిర్గతం చేయకుండా ప్రశాంతంగా జీవించాలి.  
                        Image result for images of woman wearing saree


28.08.2007

                Image result for images of old man singing before lord krishna

94.  వృధ్ధాప్యములో మమతలు మమకారాలని చంపుకోభగవంతుడు నీకు ఏకాంతవాసాన్ని ప్రసాదించినపుడు దానిని సద్వినియోగం చేసుకుని భగవంతుడికి ప్రీతిపాత్రుడవు అగు.
         

95.  అన్నా తమ్ముడు, అక్క చెల్లి, ఈ బంధాలు లోకంలోకి వచ్చేటపుడు నీ వెంట రాలేదునీవు ఈలోకం వదలి వెళ్ళేటపుడు ఈబంధాలు నీవెంట రావుఅందుచేత నీవెంట రానివాటి గురించి ఆలోచించకునీకు సదా తోడునీడగా ఉండే ఆభగవంతుని దయ సంపాదించటానికి కృషి చెయ్యి.  

                  Image result for images of old man worshipping god  in house

02.09.2007

96.  రోడ్డుప్రక్కన పడిఉన్నవాడిని ఒక యోగి అని ఎవరయినా చెబితే వాడిని తీసుకుని వచ్చి నీ పరుపుమీద కూర్చుడబెట్టుకుని సకల మర్యాదలు చేస్తావేవాడు యోగి కాదు సాధారణమానవుడే అని తెలిసిన వెంటనే తన్ని తరిమి వేస్తావే.   ఇదెక్కడి న్యాయం అని ఆలోచించు.


                Image result for images of man sleeping happily

                Image result for images of man sleeping happily



97. మానవుడికి సుఖంగా నిద్ర పట్టకపోవడానికి కారణం ఎదుటివాడికి పట్టుపరుపు, పందిరిపట్టి మంచము ఉంది తనకు లేదు అనే భావన మాత్రమేనిజానికి సుఖ నిద్రకు మూలము తృప్తిఅంతేగాని ఎదుటివాడికి ఉన్న విషయాలపై ఆలోచన కాదుతనకు ఉన్నదానితో తృప్తి చెందితే రాత్రివేళ ప్రశాంతంగా నిద్రించవచ్చు.  

                    Image result for images of man sleeping on road side


09.09.2007

98.  మరణించిన తరువాత ఆ శరీరానికి దహనసంస్కారాలు ఎలాజరుగుతాయి అని ఆలోచించటం అవివేకముఎంత రక్త సంబంధీకులయినా ప్రాణం లేని శరీరాన్ని దగ్గిర ఉంచుకోరుఏదో విధంగా దహన సంస్కారాలు జరిపించి తమ బాధ్యతలను పూర్తిచేసి వివేకంతో జీవిస్తారుఅందుచేత నీవు నీమరణం తరవాత నీశరీరానికి దహన సంస్కారాల గురించి ఆలోచించవద్దు.  

99.  ఇతరుల బాధ్యతలను నీవు భుజాన వేసుకుని మరీ పిచ్చివాడిలాగ తిరగవద్దుఇతరుల వ్యవహారాలలో తలదూర్చవద్దుసద్గురుని మాటలను విని కష్టాలకు దూరంగా జీవించు.  ---
                                                                                                                                                                ---     సాయిబానిస

100.  తల్లిదండ్రులు, అన్నదమ్ములు కలిసి జీవించడంలో ప్రశాంతత లేనినాడు విడిపోయి ప్రశాంతంగా జీవించడం మంచిదిఎంతమంచి స్నేహితుడయినా అతని మనసులో అపార్ధము కలిగిననాడు అతడు స్నేహాన్ని కొనసాగించడుఅటువంటివాని వెనక తిరిగుతూ స్నేహం కోసం వానిని ప్రాదేయపడటము మన మూర్ఖత్వము.  అందుచేత అటువంటివానినుండి దూరంగా జీవించాలి.  

(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List