13.05.2016 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
నెట్
సమస్య వల్ల నిన్న ప్రచురణకి సాధ్యం కాలేదు.
ఈ రోజు నుండి మధ్య మధ్యలో సాయి అంకిత భక్తుల గురించి కూడా ప్రచురిస్తూ ఉంటాను.
ఆ
రోజుల్లో సాయిబాబాని దైవం గా గుర్తించారు కాబట్టె ఆయనకు అంతమంది అంకిత భక్తులు ఉన్నారు. సాయిబాబా తాను ఎప్పుడూ భగవంతుడినని చెప్పుకోకపోయినా,
ఈ నాడు కూడా సాయి భక్తులందరూ ఆయనని దైవంగా కొలుస్తూ ఉన్నారు. మరి ఆరోజుల్లో బాబా గారు భక్తులనుంచి స్వీకరించిన
దక్షిణతో విలాసవంతంగా జీవించారా? లేదే? వచ్చినదంతా
ఆయన భక్తులకే పంచిపెట్టేశారు. కీర్తి ప్రతిష్టలకోసం
ఎప్పుడూ, మహిమలను ప్రదర్శించలేదు. సద్గురువు అంటే ఎలా ఉండాలో ఆయన జీవన విధానమే తార్కాణం.
ఈ
రోజు సాయి భక్తుడు శ్రీ జి.జి. నార్కే గారి గురించి తెలుసుకుందాము.
శ్రీ
సాయి అంకిత భక్తులు - ప్రొఫెసర్ శ్రీ జి.జి. నార్కే - 1
నార్కే
మంచి విద్యావంతుడు. ఏ విషయాన్నయినా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ ఉండేవారు. ఆయన మంచి బుధ్ది శాలి, సూక్ష్మ దృష్టి కలవాడిగా
ఖ్యాతి గడించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం బాబా అదృశ్య రూపంలో ఇతర లోకాలలో కూడ సంచరిస్తూ ఉంటారని ప్రగాఢంగా విశ్వసించేవారు. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటానని బాబా తరచూ చెబుతూ ఉండేవారని నార్కే చెప్పారు.
బాబా సాధారణ సత్పురుషుడు కాదు ఆయన భగవంతుడని నార్కే గారికి తెలుసు. బాబాకు ఆత్మలయొక్క భవితవ్యాన్ని కూడా నియంత్రించే శక్తి ఉందని నార్కే చెప్పారు.
ఆయన అభిప్రాయం ప్రకారం బాబా అదృశ్య రూపంలో ఇతర లోకాలలో కూడ సంచరిస్తూ ఉంటారని ప్రగాఢంగా విశ్వసించేవారు. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తూ ఉంటానని బాబా తరచూ చెబుతూ ఉండేవారని నార్కే చెప్పారు.
బాబా సాధారణ సత్పురుషుడు కాదు ఆయన భగవంతుడని నార్కే గారికి తెలుసు. బాబాకు ఆత్మలయొక్క భవితవ్యాన్ని కూడా నియంత్రించే శక్తి ఉందని నార్కే చెప్పారు.
గణేష్
గోవింద నార్కే జి.జి. నార్కే 1905 వ.సంవత్సరంలో ఎమ్.ఎ. పట్టా పుచ్చుకున్నారు. 1907 – 1909 లో ఆయన కలకత్తాలో జియోలాజికల్ సర్వే
డిపార్ట్ మెంటులో (భూగర్భ పరిశోధన) స్కాలర్ గా శిక్షణ పొందారు. 1909 లో భారత ప్రభుత్వం వారు ఆయనకు స్టేట్ స్కాలర్
గా మాంచెస్టర్ పంపించారు. ఆయన అక్కడ 1912 వరకు
మూడు సంవత్సరాలు ఉన్నారు. అక్కడ భూగర్భ శాస్త్రం,
గనులు వీటిలో ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు.
ఆగష్టు 1912 లో ఆయన భారత దేశానికి తిరిగి వచ్చారు. బాబా గారికి అంకిత భక్తుడయిన బూటి గారికి అల్లుడు
ఆయన. ఆయన భార్య, తల్లి, మామగారయిన బూటీ తరచూ
షిరిడీ వెడుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి అక్కడే
ఉంటూ ఉండేవారు. ఒకసారి షిరిడి వచ్చి బాబాను
దర్శించుకోమని వారు నార్కే గారికి ఉత్తరం వ్రాశారు. బాబా రమ్మని చెబితే తప్పక వస్తానని తిరుగు జవాబు
వ్రాశారు. బూటీ, బాబా దగ్గరకు వెళ్ళి విషయం
చెప్పగానే బాబా వెంటనే తన సమ్మతిని తెలిపారు.
బాబా షిరిడీ రమ్మని చెప్పారని బూటీ, నార్కేగారికి ఉత్తరం వ్రాశాడు. అపుడు నార్కే ఏప్రిల్ 1913 లో షిరిడీ వెళ్ళి బాబాను
దర్శించుకున్నారు. తన భార్యను, తల్లిని, బూటీని అందరిని బాబా ఎంతో ఆదరణగా చూస్తూ ఉండటం గమనించారు. శ్యామా నార్కేని బాబాకి పరిచయం చేయడానికి తీసుకుని
వెళ్ళాడు. నార్కేని చూడగానే బాబా “ఇతనిని నాకు
పరిచయం చేయాలా? నాకితను 30 జన్మలనుండి పరిచయం”
అన్నారు. నా గత జన్మల విషయాలు బాబాకు తెలియడం
ఎంత అద్భుతమో కదా అనుకున్నారు. నార్కేకి బాబా
వారి దివ్య శక్తులపై నమ్మకం ఏర్పడి తన తల్లి,
బూటీ లు సేవించినట్లే ఆయనను సేవించడం మొదలు పెట్టారు. ఆయన చిన్న తనంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా సాయిబాబా
మీద ఆయనకు నమ్మకం ఏర్పడడానికి దోహదపడ్డాయి.
ఆయన మామగారు బూటీ, ఆయన భార్య, తల్లి, సాయిబాబాని భగవంతుని అవతారంగా పూజిస్తూ
ఉండేవారు. నార్కే, జ్ఞానేశ్వరి ఇంకా సత్పురుషుల
గొప్ప వ్యక్తిత్వాన్ని తెలిపే గ్రంధాలను చదువుతూ ఉండేవారు.
ఒకసారి
ఆరతి జరుగుతుండగా నార్కే గారు అక్కడే ఉన్నారు.
ఆ సమయంలో బాబా ఆగ్రహావేశాలతో తిట్ల వర్షం కురిపిస్తుండటం చూశారు. ఆ సంఘటన చూసిన నార్కే గారికి, బహుశ బాబా పిచ్చివాడేమోననే సందేహం కలిగింది. అదే రోజు మధ్యాహ్నం
నార్కే బాబాగారి కాళ్ళు వత్తుతూ ఉన్నారు. బాబా
ఆయన తలమీద చిన్నగా కొట్టి “నేను పిచ్చివాడిని కాదు” అన్నారు. బాబా అన్న మాటలకు నార్కే కి చాలా ఆశ్చర్యం కలిగింది. ప్రతివారి మనసులో కలిగే భావాలన్నీ బాబాకు తెలుసుకునే
శక్తి ఉన్నదనీ, ఎటువంటి అనుమానం లేకుండా ఆయన భగవంతుడే అనే నిర్ధారణకు వచ్చారు.
1916
వ.సంవత్సరంలో షిరిడీలో విపరీతంగా ప్లేగు వ్యాధి సోకి ఉపద్రవాన్ని సృష్టించింది. ఆ అంటు వ్యాధి కలిగిస్తున్న విధ్వంసానికి ప్రతి
ఒక్కరూ చావు భయంతో తల్లడిల్లిపోసాగారు. నార్కే
గారికి కూడా చావు భయం పట్టుకుంది. తను షిరిడీలోనే
ఉండిపోతే తనకు కూడా చావు తప్పదనుకున్నారు.
అటువంటి పరిస్థితుల్లో బాబా నార్కేను పిలిచి అతనికి కొంత డబ్బిచ్చి రంగారావు
మిఠాయి దుకాణానికి వెళ్ళి బాబా ప్రసాదం కోసం మిఠాయి తెమ్మని చెప్పారు. షిరిడీలో మిఠాయి దుకాణాలు అంత ఎక్కువగా లేవు. నార్కేకు ఈ విషయం కూడా తెలుసు, అంతే కాక ఆయన కొంత
కాలంగా షిరిడీలోనే ఉండటం వల్ల రంగారావు మిఠాయి దుకాణం కూడా తెలుసు.
ఆరోజు
సాయంత్రం సమయంలో నార్కే బాబా చెప్పిన దుకాణానికి వెళ్ళారు. దుకాణదారుడయిన రంగారావు
ఆ రోజు చనిపోవడం వల్ల దుకాణం షట్టరు సగం దాకా మూసి ఉంది. అయన శవం నేల మీద పడుకోబెట్టబడి ఉంది. ప్రక్కనే అతని భార్య సీతాబాయి రోదిస్తూ ఉంది. అక్కడి పరిస్థితినంతా చూసిన నార్కే గారికి ఏమి చెయ్యాలో
అర్ధం కాలేదు. ఒకవైపు ప్లేగు వ్యాధితో మరణించిన
రంగారావు శవం దుకాణంలో ఉంది. మరొక పక్క బాబాగారేమో
దుకాణం నుంచి మిఠాయి పట్టుకురమ్మని ఆజ్ణాపించారు. ఏమి చేయాలి అని పెద్ద సందిగ్ధంలో
పడ్డారు. ఆయన గొప్ప విద్యావంతుడే కాదు ప్రతి
విషయాన్ని విశ్లేషించి మరీ ఆలోచించే వ్యక్తి.
అందుచేత బాబా తనను రంగారావు దుకాణంనుంచి మిఠాయి తెమ్మని చెప్పారంటే దానికి తగిన
కారణం ఉండే ఉంటుందని భావించారు. నార్కే గారు
కాస్త దైర్యం తెచ్చుకుని రంగారావు భార్యతో బాబాగారు మిఠాయి, ప్రసాదం కోసం తెమ్మని చెప్పారన్న
విషయం చెప్పారు. ఆమె అలమారా వైపు చూపుతూ “ఆ
అలమారునుండి మీరే మిఠాయి తీసుకుని వెళ్ళండి” అంది. నార్కే ఆమె చెప్పినట్లుగానే మిఠాయి తీసుకుని ప్రక్కనే డబ్బులు పెట్టారు. మిఠాయిని తీసుకుని మసీదుకు
వెళ్ళి బాబా పాదాల ముందు ఉంచారు. బాబా మసీదులో
ఉన్న భక్తులందరికీ ఆ మిఠాయిని పంచారు.
ఆ
తరువాత బాబా నార్కేతో “షిరిడీలో ఉంటే చావు తప్పదనీ , షిరిడీ విడిచి వెళ్ళితే క్షేమంగా
ఉండచ్చనీ ఆలోచిస్తున్నావా నువ్వు? అదంతా నీ భ్రమ. చావుకు దగ్గర పడని వారిని ఈ మసీదు రక్షిస్తుంది. మరణించవలసిన వారే మరణిస్తారు” అన్నారు. ఆ విధంగా
బాబా నార్కేలోని భయాన్ని పూర్తిగా తొలగించారు.
(ఇంకా
ఉంది)
(శ్రీ బోనగిరి జనార్ధనరావు గారి బ్లాగునుండి సేకరింపబడింది.)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment