Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, July 17, 2016

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు వారి తత్వము - (2) ఆహారం – 5వ.భాగమ్

Posted by tyagaraju on 8:21 AM
Image result for images of shirdi sai annadanam
Image result for images of rose

17.07.2016 ఆదివారమ్
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
      Image result for images of m.b.nimbalkar
ఆంగ్ల మూలం : లెఫ్టినెంట్ కల్నల్ ఎం.బి. నింబాల్కర్ 
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 

శ్రీసాయిబాబావారి బోధనలు మరియు వారి తత్వము
(2) ఆహారం – 5.భాగమ్
(అన్నదానము -  నిన్నటి సంచిక తరువాయి భాగం)
తార్ఖడ్ గారి భార్య ఆమె భోజనం చేసేవేళకి ఒక కుక్క ఆకలి తీర్చినపుడు, సాయిబాబా ఎంతగా సంతోషించారో మనకు గుర్తుకొస్తుంది.  (అధ్యాయం – 9).  “నువ్వు ఎల్లప్పుడూ ఈవిధంగానే చేస్తూ ఉండు.  నువ్వు చేసే మంచిపని నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుంది.  మొదటగా ఆకలితోనున్న వారికి రొట్టెనిచ్చి ఆతరువాతనే నీవు తిను” అన్నారు బాబా.


అదే విధంగా లక్ష్మీబాయి షిండే బాబా కోసం వండి తెచ్చిన రొట్టె, కూరలను బాబా,  కుక్కకు పెట్టడంతో, లక్ష్మీబాయి షిండేకి కోపాన్ని కలిగించింది.  
                      Image result for images of shirdisaibaba feeding dog

అపుడు బాబా ఆమెకు ఏమని బోధించారో మనకందరకూ తెలిసినదే – “ఏమీలేనిదానికెందుకు బాధపడతావు? ఆకుక్క ఆకలి నా ఆకలి ఒకటే.  అయితే కొంతమంది మాట్లాడగలరు, కొంతమంది మూగగా ఉంటారు.  జీవరాశులన్నిటి ఆకలి సమానమే.  ఎవరయితే ఆకలిగొన్నవారికి ఆకలి తీరుస్తారో వారు నా ఆకలిని తీర్చినట్లేనని నిశ్చయంగా తెలుసుకో” అన్నారు బాబా. ఈవిషయంలో బాబా తనే స్వయంగా చేసి చూపించారు.  ప్రారంభంలో తరచూ ఆయనే పెద్దపెద్ద గుండిగలలో వంట చేసి బీదవారికి, నిస్సహాయులకి భోజనాలు పెడుతూ ఉండేవారు.  
                            Image result for images of shirdi sai annadanam

బాబా బజారుకు వెళ్ళి పప్పుదినుసులు, మసాలా సరుకులు కొని తెస్తూ ఉండేవారు.  తానే స్వయంగా తిరగలిలో విసరుతూ ఉండేవారు. 
                                 Image result for images of shirdi sai baba grinding
తరువాత భక్తులు అధిక సంఖ్యలో షిరిడీకి రావడం ప్రారంభమయింది.  భక్తులందరూ నైవేద్యంకోసం ఎన్నో పదార్ధాలను తీసుకొస్తూ ఉండేవారు.  అందుచేత బాబాకు ఇక వండే అవసరం లేకపోయింది.  అయినప్పటికి నైవేద్యం కోసం తెచ్చిన పదార్ధాలను అందరికీ పంచిపెట్టడం మాత్రం మానలేదు.  ఆయన కొద్దిగా మాత్రమే రుచి చూసేవారు.

ముగింపుః
బాబా చెప్పిన సలహాలన్నీ కూడా ఎప్పుడూ ఆచరణాత్మకంగాను. వాస్తవికంగాను ఉండేవి.  దానం గురించి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి చెప్పినా గాని, అతిగా చేసి అప్పుల పాలవద్దని హెచ్చరించారు.  (భక్త లీలామృతం – దాసగణు అధ్యాయం – 32).  ఆయన చెప్పిన సలహాలోని అతి ముఖ్యమయిన అంశం ఆహారం గురించి.  ఆహారం ఏది వడ్డించబడినా దానితోనే తృప్తిపడటం నేర్చుకోమని బోధించారు. అంతేగాని జిహ్వ చాపల్యంతో నాకు ఫలానా పదార్ధం కావాలి, ఇప్పుడు మీరు వడ్డించిన పదార్ధం నాకు ఇష్టం లేదు అని నిరసన వ్యక్తం చేసినట్లయితే బాబా  చెప్పిన సలహాను పాటించనట్లే.  అందుచేత బాబా ఇచ్చిన సలహాలని తూచా తప్పక పాటించినట్లయితే మనకి ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాక, ముక్తికోసం మనం చేసే ప్రయత్నాలలో కూడా సహాయపడుతుంది. 


(రేపటి సంచికలో మూడవ విషయం వాక్కు - Speech)
-----------------------------------------------------------------
19.07.2016 గురుపౌర్ణమి సందర్భంగా గురుపౌర్ణమి గురించి తెలుసుకుందాము. 
                     

 మన (చాంద్రమాన) పంచాంగం లో ఆషాఢ మాసం (జులై-ఆగస్టు) లో వచ్చే పౌర్ణమిని "గురు పూర్ణిమ" లేదా "వ్యాస పూర్ణిమ" గా పరిగణిస్తారు. ఇది వేద వ్యాసుని జన్మ దినం (వ్యాస జయంతి).

రోజున ఉపవాసము ఉండే వారు రోజంతా ఉపవాసముంటారు.

గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోథించేవాడు.

గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గురుపౌర్ణమి నాడు గురుపూజ చేసే వారికి శుభఫలితాలుంటాయి. అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

వ్యాసపూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించి ఇల్లంతా  శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి. పూజకు పసుపు రంగు అక్షతలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి.

గురుపౌర్ణమి రోజున  శ్రీ సాయిబాబా, దత్త స్తోత్రములు, శ్రీ గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి. లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి

అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్ సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది. అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది.

అలాగే గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్తకాలతో ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతిబాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

గురుపౌర్ణమి దివ్యశక్తుల ప్రసారం భూమిపైన విశేషంగా ఉండేరోజు . అందుకే జ్ఞానరూపుడై ,సద్గురువై లోకానికి వెలుగుబాటచూపిన వ్యాసభగవానులవారి పేరున పండుగగా జరుపుకుంటాము . సద్గురుపరంపరయంతా ఒకటేననే సత్యాన్ని నమ్మి, వివిధసాంప్రదాయాలలో అధ్యాత్మిక మార్గం లో నడుస్తున్న పుణ్యభూమిలో సాధకులంతా పౌర్ణమిని విశేషపూజలతో వేడుకలు నిర్వహిస్తారు. ఆరోజు గురుమూర్తిని పూజించటం ,ఆయన అనుగ్రహానికి  పాత్రులవటానికి మనం ప్రయత్నించాలి . సంకల్పంతో గురుచరిత్రలను పారాయణం చేయటం ,వ్యాసపూజ చేయటం విశేషఫలప్రదం.

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' 

గురుపూజకు శ్రేష్టమైన గురుపౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.

వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు. మాటలు విన్న భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.

క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.

అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.

వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం దంపతులు వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిధ్యానికి ఎంతో సంతుష్ఠులైన ముని శ్రేష్ఠుడు.. పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.

ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..!

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List