24.08.2016 బుధవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
కృష్టాష్టమి శుభాకాంక్షలు
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
శ్రీసాయిబాబావారి బోధనలు మరియు తత్వము
ఆంగ్ల మూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు
అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు
8.
ఇంద్రియ సుఖములు – 3వ.భాగమ్
౩. శ్రీసాయి సత్ చరిత్ర 20వ.అధ్యాయంలొ బాబా, దాసగణుకు వచ్చిన సందేహాన్ని కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ద్వారా చాలా చమత్కారంగాను, మనోహరంగాను బోధపడేలా చేశారు. ఇంద్రియములు, విషయములపై ఏవిధంగా ఆనందాన్ని పొందుతాయో పనిపిల్ల ద్వారా సోదాహరణంగా అర్ధమయేలా దాసగణుకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసారు.
దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల ఎల్లప్పుడు సంతోషంగాను, తృప్తిగాను ఉండేది. ఆమె తన పేదరికాన్ని తలుచుకుని బాధ పడేది కాదు. దాసగణు ఆమెను చూసిన మొదటిరోజున ఆమె చిరిగిన బట్టలను ధరించినా చాలా ఆనందంగా ఉంది. మరిసటిరోజు ఎమ్.వి.ప్రధాన్ ఆమెకు బహూకరించిన కొత్త చీరను కట్టుకుని వచ్చి ఎంతో సంతోషంగా తక్కిన పిల్లలతో కలిసి పాటలు పాడి ఆటలాడింది. ఆ తరువాతి రోజు తనకిచ్చిన కొత్త చీరను ఇంటిలో దాచిపెట్టి మరలా యధావిధిగా చింకి బట్టలు కట్టుకొని ఇంటిపనికి వచ్చింది. కాని, ఎప్పటిలాగే ఎంతో సంతోషంగా ఉంది. ఈవిధంగా బాబా మనకి కాకాసాహెబ్ పనిపిల్ల ద్వారా మనకు కూడా ఈశావాస్య ఉపనిషత్ యొక్క అర్ధాన్ని చాలా చక్కగా బోధించారు.
ఈశావాస్యమిదం
సర్వ యత్కించ జగత్యాం జగత్ I
తేన
త్యక్తేన భుజ్జీధా, మా గృశ్ధః కస్య స్విధ్ధనమ్ II
(ఈ
సృష్టిలో చరాచరములన్నీ కూడా భగవంతుని ద్వారా వ్యాప్తి చెందినవే. తనది కానిదాన్ని ఆపేక్షించకుండా భగవంతుడిచ్చినదానితో
తృప్తి చెంది ఆయనను సదా స్మరిస్తూ సంతోషంగా జీవించాలి).
దీనిని
బట్టి మనం గ్రహించుకోవలసినది మనకు ఏదయితే లభ్యమయిందో దానితో సంతృప్తిగా జీవించాలి.
భగవంతుడిచ్చినదానితో తృప్తిగా హాయిగా జీవించాలి. మన తాహతును బట్టే మనం సంపాదించుకోగలగాలి. మన తాహతుని మించి జీవించాలనుకుంటే అప్పులపాలయి మనశ్శాంతిని
కోల్పోతాము. ఇతరులు మనకన్నా ఎక్కువ స్థోమత కలిగి ఉండవచ్చు. వారి స్థాయిని బట్టి వారు చాలా విలాసవంతంగా జీవిస్తూ
ఉండవచ్చు. వారిని చూసి మనం ఆవిధంగా విలాసవంతంగా
లేమని బాధపడకుండా భగవంతుడిచ్చినదానితో మనం తృప్తి చెందినపుడే జీవితాన్ని ఆనందంగా గడపగలం. పూరిగుడిసెలో జీవిస్తున్నవాడు తన ప్రక్కనే పెద్ద
బంగళాలో నివస్తిస్తున్నవానిని చూసి ప్రతిరోజు బాధపడేకన్నా, తనకున్న దానితో తృప్తిగా
జీవించినపుడే ఆనందంగా ఉండగలడు. పెద్ద బంగళాలో
నివసిస్తున్నవాడు తనకన్నా అధిక సంపాదనలో తులతూగుతున్నవానిని చూసి అసంతృప్తితో జీవించేకన్నా
తనకు లభించిన దానితోనే తృప్తిపడి జీవించే జీవితమే ఆనందకరం.
ఆవిధంగా
బాబా, సంసార జీవనం సాగిస్తున్నవారందరూ, ఇంద్రియాలను ఏవిధంగా అదుపులో పెట్టుకుని జీవితం
గడపవచ్చో సరళమయిన విధానాలను ఎన్నిటినో బోధించారు. ఏమయినప్పటికీ, ముక్తిని, మోక్షాన్ని కోరుకోదలచినవారికి
కఠినమయిన క్రమశిక్షణ అవసరమని హితోపదేశాం చేశారు.
ఈ
సందర్భంగా బాబా చెప్పిన మాటలు – “విషయలోలత్వము (ఇంద్రియ సుఖములు) చాలా హానికరమయినది. వివేకము (అనగా నిత్యానిత్యములకు భేదమును గ్రహించుట)
అనే సారధి సహాయముతో మన మనస్సును స్వాధీనములో ఉంచుకోవాలి. మన ఇంద్రియములను వాటి ఇష్టమొచ్చినట్లుగ సంచరింపచేయరాదు. అటువంటి సారధితో విష్ణుపదమును చేరగలము. అదియే మన గమ్యస్థానము. అదియే మన నిజమయిన ఆవాసము. అచటినుండి తిరిగి వచ్చుటలేదు”.
అధ్యాయము – 49
(రేపు
మాయ)
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment