15.11.2016 మంగళవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ
రోజు హేమాజోషీ గారు వివరిస్తున్న మరికొంత సమాచారం
(ఆంగ్ల మూలంః సాయిలీలాస్.ఆర్గ్.)
భావ
తరంగాలు – హేమా జోషి – 2వ.భాగమ్
జయమనీ
జైసా భావ తయా తైసా అనుభవ
దావిసి
దయాఘనా ఐసీ తుఝీహీమావ
(సాయిబాబా
పై ప్రేమ, భక్తి ఎవరు ఏవిధంగా చూపిస్తారో వారి వారి భావాలకనుగుణంగానే వారికి సాయిబాబా వారి అనుభవాలు కలుగుతాయి)
భగవంతుని
అనుగ్రహం లేనిదే ఒక సద్గురువుని కలుసుకోవడం అసాధ్యం. కాని సాయిబాబా విషయంలో దీనికి పూర్తి విరుధ్ధం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు.ఆయన మీద నమ్మకం ఓర్పు
కలిగి ఉంటే ఆయన తన అనుగ్రహపు జల్లులను కురిపిస్తారు.
తల్లి తాబేలు తన దృష్టి మాత్రం చేతనే తన పిల్లలను పోషిస్తుంది. అదే విధంగా సాయిబాబా
తన భక్తులను రక్షిస్తూ ఉంటారు. ఆయన తన భక్తులకు
ఏవిధమయిన గురుమంత్రాన్ని ఉపదేశించకుండానే తమ కృపాదృష్టితో వారికి ఆధ్యాత్మిక ఆనందానుభూతిని
కలుగ జేస్తారు.
మా
ముత్తాతగారయిన స్వర్గీయ శ్రీనానా సాహెబ్ అనబడే శంకరరావు రఘునాధ్ దేశ్ పాండే నిమోన్
కర్ గారు శ్రీసాయిబాబాకు అత్యంత ప్రియతమ భక్తులు.
నానా సాహెబ్ గారి లాగే మరికొంతమంది భక్తులలో మాధవరావు దేశ్ పాండే (శ్యామా) గోపాలరావు
బూటీ, కీ.శే.తార్ఖడ్, శ్రీ దభోల్కర్ కోటే పాటిల్, వీరంతా కూడా తాము జీవించి ఉన్నంతవరకు
బాబా ప్రేమను, అభిమానాన్ని చూరగొన్నారు.
వీరందరూ తమ తమ శక్త్యానుసారం బాబాయెడల ప్రేమ, భక్తి కనబరుస్తూ, ఆయన సేవ చేసుకొని
గురు శిష్య సంబంధాన్ని కొనసాగించుకున్నారు.
ఆబంధం మరుసటి జన్మలకు కూడా కొనసాగుతుంది.
సాయిబాబా జీవించి ఉన్న రోజులలోనే రామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ద్వారకామాయిపై పవిత్రమయిన జండాని ప్రతిష్టించమని
సాయిబాబా శ్రీనానా సాహెబ్ నిమోన్ కర్ గారిని ఆదేశించారు. దామూ సేఠ్ కాసార్ ను మరొక జండాను ప్రతిష్టించమని
చెప్పారు.
పవిత్రమయిన
ఈ రెండు జండాలను వేద పఠనం జరుగుతూ ఉండగా సమాధి మీద పరచేవారు.
ఆజండాలపై గులాబీ దండలను, తులసి దళాలను పరచి అందంగా
అలంకరించేవారు. బాబా చిత్రపటానికి, సమాధికి,
మహాపూజ చేసేవారు. ఆతరువాత వందలాది మంది భక్తులు,
రాజసం ఉట్టిపడుతున్న రధంముందు, ఈ జండాలను తమ భుజాలపై మోసుకుంటూ వెళ్ళేవారు. రధం ముందు
సాగే ఈ జండాలు చూడముచ్చటగా కనువిందు చేస్తూ ఉండేవి. బాజా భజంత్రీలు, మేళతాళాలతో ఈ ఉత్సవ కార్యక్రమం మనోహరంగా జరుగుతూ
ఉండేది. వేలాదిమంది ప్రజలు ఆనందంతో నాట్యం
చేస్తూ సాయినాధ్ మహరాజ్ కీ జై అంటూ నినాదాలు చేస్తూ ఉండేవారు. ఆవిధంగా సాగే ఆ ఉత్సవ కార్యక్రమం ఎంతో నయనానందకరంగ ఉండేది. ఆతరువాత రాత్రి 7 గంటలకు ఈ రెండు జండాలను
ద్వారకామాయిమీద ప్రతిష్టించేవారు. తరువాత వచ్చే
రామనవమి వరకు అనగా సంవత్సరంపాటు ఆరెండు జండాలు ద్వారకామాయి శిఖరంపై ఎంతో సొగసుగా ఎగురుతూ
ఉండేవి.
(పై చిత్రంలో నిమోన్ కర్ & దాము అన్నా లు ప్రతిష్టించిన జండాలు)
శ్రీసాయిబాబావారి అనుజ్ఞ ప్రకారం ఈసాంప్రదాయం
షిరిడీలో గత 115 సంవత్సరాలుగా జరుగుతూ ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.
స్వర్గీయ
నానాసాహెబ్ దేశ్ పాండే నిమోన్ పట్టణంలో పెద్ద భూస్వామి. బ్రిటిష్ వారి కాలంలో అహ్మద్ నగర్ జిల్లా సంగమనేర్
కు గౌరవ మాజిస్ట్రేట్. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందరూ ఆయనని ఒక నాయకునిగా గౌరవించేవారు. ఆయన షిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకున్నపుడు
సాయిబాబా ఆయనను కౌగలించుకొని “మన గురు శిష్య సంబంధం చాలా పురాతనమయినది. 72 జన్మలనుంచి ఇప్పటికీ ఆ సంబంధం కొనసాగుతూ వస్తోంది”
అన్నారు. నానాసాహెబ్ నిమోన్ కర్ గారికి సాయిబాబావారి
సాహచర్యం లభించడం గొప్ప అదృష్టం. ఆయన తన జీవిత
కాలమంతా, తను చనిపోయేంత వరకు సాయిబాబాకు అత్యంత ప్రియతమ శిష్యునిగా ఉండే భాగ్యం లభించింది. ఆయనకు సాయిబాబాపై ఎంతటి ప్రేమ, భక్తి ఉన్నాయంటే,
ఆఖరికి నిమోన్ కర్ గారు తన గౌరవ
ప్రదమయిన వృత్తిని, ఇంటిని, ఆస్తులను వదలిపెట్టి తన
భార్యతో సహా షిరిడీ వచ్చి, తన సద్గురువయిన సాయి సేవలోనే గడిపారు. ఆయన తన సమయాన్ని సద్గురు సాయినాధుని సేవలో తప్ప మరింక దేనికీ వినియోగించుకోలేదు. ఆయన ఉదయాన్నే
స్నానానికి మాత్రమే ఇంటికి వెళ్ళి, పూజాదికార్యక్రమాలని ముగించుకుని తిరిగి సాయిబాబా వద్దకు
వచ్చి ఆయన సేవ చేసుకుంటూ గడిపేవారు. ఎంతో ఉత్సాహంతో,
చురుకుగా ఆయన సేవలోనే మునిగిపోయేవారు. సాయిబాబా
ఆయనని ‘మహరతే కాకా’ (ముసలి కాకా) అని ఆత్యంత ప్రేమతో పిలిచేవారు. నానాసాహెబ్ గారు చాలా తరచుగా సాయిబాబాగారిని లెండీ
బాగ్ కు తీసుకునివెడుతూ ఉండేవారు. సాయిబాబా,
నానాసాహెబ్ గారిని సంస్కృత గ్రంధాలను, విష్ణుసహస్ర నామాలను చదవమని ప్రోత్సహించారు. సాయిబాబా మహాసమాధి చెందిన తరువాత నానాసాహెబ్ నిమోన్
కర్ గారు ఎక్కువ కాలం జీవించలేదు. చివరి మూడురోజులు
ఆయన నిరంతరం సాయిబాబా నామస్మరణ చేస్తూనే ఉన్నారు.
ఆయన అందరినీ ‘సాయిబాబా’ అనే పిలుస్తూ ఉండేవారు. కారణం ఆయన ప్రతివారిలోను తన ఆధ్యాత్మిక గురువయిన
సాయిబాబానే దర్శిస్తూ ఉండేవారు.
(ఇంకా
ఉన్నాయి)
(మరలా ప్రచురణ కొల్హాపూర్, పండరీపూర్ యాత్రల తరువాత)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
సాయి భక్తులకు అభివందనములు. శ్రీ సద్గురు సాయి అనుగ్రహ, ఆశ్శీసులతో, శ్రీ సాయి భక్తులకు నా మనసులో శ్రీ సాయినాధుని పట్ల కలిగే భావాలను మీతో పంచుకునేందుకు శ్రీ శిరిడీ సాయి దివ్య జ్ఞానామృతం అనే బ్లాగును పూర్తిగా తెలుగులో ఇటీవలే ప్రారంభించాను. ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా ఈ బ్లాగును దర్శించి, మీ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించవల్సిందిగా ప్రార్ధిస్తున్నాను.
www.chsairutvik.blogspot.in
Dear Sai Devotees. Recently I have launched a new blog in Telugu, dedicated to the teachings and experiences with Shri Sai Baba of Shirdi. The same can be reached at www.chsairutvik.blogspot.in
Request all to read the blog and offer your valuable feedback and suggestions.
Post a Comment