24.06.2020 బుధవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన
సందేహాలు –
బాబా
సమాధానాలు – 10 (7)
గురుభక్తి 7 వ.భాగమ్
ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411 & 8143626744
మైల్ ఐ.డి.
tyagaraju.a@gmail.com
ఆసనమును
శయ్యను వస్త్రమును వాహనమును భూషణాదులను గురువును సంతోషపరచుటకు గాను సమర్పించవలెను.
గురుగీత శ్లో. 50
(శ్రీ
సాయి సత్ చరిత్ర అ. 11 బాబా తమ యాసనము కొరకు ఒక గోనెసంచి నుపయోగించెడివారు. భక్తులు
దానిపై చిన్న పరుపు వేసి, ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా
తన భక్తుల కోరికను మన్నించి, వారివారి
భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి యభ్యంతరము జూపకుండెను. కొందరు వారికి
అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి. కొందరు
వారికి చందనము, అత్తరు పూయుచుండిరి. కొందరు
తాంబూలములు సమర్పించుచుండిరి. కొందరు
నైవేద్యము సమర్పించుచుండిరి.
జ్ఞానమునందు
ఆసక్తి గలవాడు సన్యాసి యగుచున్నాడు. తనకు
సత్కారములు లభించుననియు, పూజలు లభించుననియు, గౌరవములు ప్రాప్తించుననియు భావించి
దండ కాషాయములను ధరించువాడు సన్యాసి గానేరడు.
గురుగీత --
శ్లో. 152
(శ్రీ
సాయి సత్ చరిత్ర అ. 37 చావడి ఉత్సవము
పూర్తి అయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను
చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము
అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క
పెట్టువారు కారు. భక్తులందుగల యనురాగముచే,
వారి సంతుష్టికొరకు వారి ఇష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి.)
(శ్రీ
సాయి సత్ చరిత్ర అ.6 రాధాకృష్ణమాయి కృషిచే షిరిడీ యొక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు, అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుఱ్ఱము, పల్లకి, రధము, పాత్రలు,
వెండిసామానులు, బాల్టీలు, వంటపాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి
బహూకరింపబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడ
వచ్చెను. ఇవన్నియు ఎంత హెచ్చినప్పటికి
సాయిబాబా వీనినేమాత్రములక్ష్యపెట్టక యధాపూర్వము నిరాడంబరులై యుండెడివారు.)
(శ్రీ
సాయి సత్ చరిత్ర అ. 14 దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి బాబా కొంచెము మాత్రమే
చిలుమునకు, ధునికొరకు ఖర్చు పెట్టుచుండిరి. మిగతదానినంతయు బీదలకు దానము
చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు ఒక
రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండువారు. షిరిడీ సంస్థానములొ నున్న విలువైన
వస్తువులన్నియు రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరయిన విలువైన వస్తువులు తెచ్చినచో బాబా
వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చాందోర్కరుతో, తన యాస్తియంతయు నొక కౌపీనము, ఒక విడిగుడ్డ, యొక కఫనీ, యొక తంబిరేలు గ్లాసు మాత్రమే
యనియు అయినప్పటికి భక్తులనవసరమైన నిష్ప్రయోజనమయిన విలువైన వస్తువులు
తెచ్చుచున్నారని అనుచుండెడివారు.)
దేవాదిదేవా! భగవాన్! స్వామి! ప్రభో! కులపతీ! అని గురుదేవుని
సంబోధించుచు సదా గురుభక్తితో మెలగవలెను..
గురుగీత
- శ్లో. 148
మహల్సాపతి ఎల్లప్పుడు బాబాని దేవా! అనే సంబోధించెడివాడు.
ఎవని అనుగ్రహము ప్రాప్తించుట చేత గొప్పదియగు
అజ్ఞానము విడుబవడుచున్నదో అట్టి గురుదేవుని అభీష్టసిధ్ధి కొరకు నమస్కరించుచున్నాను.
గురుగీత శ్లో. 36
గురుదేవుని ముఖకమలమునందు శోభించు బ్రహ్మవిద్య
గురుభక్తి చేతనే పొందబడుచున్నది. ఈ సత్యమును
దేవఋషులు, మానవులు స్పష్టముగా చెప్పుచున్నారు.
గురుగీత శ్లో. 43
ఏ గురుదేవుని స్మరించుట చేత జ్ఞానము
స్వయముగా ఉదయించుచున్నదో అట్టి గురువే సమస్త సంపదయై యున్నాడు. కనుక గురువును పూజించాలి.
గురుగీత శ్లో. 55
గురువును శిష్యుడు ఏప్రకారముగా సేవిస్తాడో
ఆప్రకారమే గురువుయొక్క దయచేత శిష్యునకు జ్ఞానము కలుగుతుంది. అంతేకాదు, శిష్యునిలో
ఉన్న అజ్ఞానము పటాపంచలవుతుంది. త్రికరణ శుధ్ధిగా గురువే దైవమని గ్రహించుకోవాలి.
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.8 మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన,
వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి
పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను తెలియనట్టిదియునగు
ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నియు కలిసి ఇవ్వలేని
వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుచుచున్నాడో యట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంధములు
ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. )
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.32 లో బాబా చెప్పిన మాటలు “పుస్తకజ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి
చేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయమేర్పడుటకు, ధృఢమైన యంతులేను నమ్మకమవసరము”)
( శ్రీ సాయి సత్ చరిత్ర అ.21 కన్నడ యోగితో బాబా అన్న మాటలు “ఊరకనే గ్రంధములు చదువుట
వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగర్తగ విచారించి, అర్ధము
జేసుకుని, యాచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గుర్వనుగ్రహము లేని ఉత్త పుస్తకజ్ఞానము
నిష్ప్రయోజనము”)
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.39 బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు
(భగవద్గీత 4 అ. శ్లో
34) బాబా చక్కని యర్ధమును నానాసాహెబ్ చందోర్కరుకు బోధించి ఆశ్చర్యము
కలుగచేసెను. ఈ విషయమును
గూర్చి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల సంపుటి 4 పుట – 563 ‘స్ఫుటవిషయ’ నందు) వ్రాసినారు. వారు స్వయముగా నానా సాహెబ్ చందోర్కర్
వద్దనుంచి కొన్ని సంగతులు తెలిసికొని ఇచ్చిన వృత్తాంతము)
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment