26.06.2020 శుక్రవారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలు –
బాబా సమాధానాలు – 10 (8)
గురుభక్తి 8 వ.భాగమ్
ఆత్రేయపురపు
త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
ఫోన్. 9440375411
& 8143626744
మైల్
ఐ.డి. tyagaraju.a@gmail.com
ఎవనికి తన ఇష్టదైవము నందు గల ఉత్కృష్ట భక్తి సదా గురుదేవుని యందు నిలిచి యుండునో అట్టివానికి సర్వ వేదాంత విషయములు అనుభవమునకు అందును.
గురుగీత
శ్లో. 19
(శ్రీ సాయి సత్ చరిత్ర అ.10 భక్తులయొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను
బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.)
గురువుయొక్క తత్త్వాన్ని, గురుస్వరూపాన్ని బాగుగా అర్ధం చేసుకోకుండా ప్రతిరోజు చేయు జపము, తపము, వ్రతము, యజ్ఞము, దానము, తీర్ధయాత్రలు ఇవన్ని కూడా నిష్ర్పయోజనం.
గురుగీత శ్లో. 24
తన గురుదేవుని పవిత్రనామమును కీర్తించడమే అనంతుడగు పరమేశ్వరునియొక్క కీర్తనమగును.
గురునామమును
ధ్యానించడమే
అవ్యయుడైన మహేశ్వరుని నామమును ధ్యానించుట యగును.
గురుగీత శ్లో.
33
(
శ్రీ సాయి సత్ చరిత్ర అ. 26 ఎవరికయితే నమ్మకము ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును.
దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు.
ఏ
భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును)
ఎంతటి ఆత్మజ్ఞాని అయినా గురువు, శాస్త్రం, ఈశ్వరుడు ఈ మూడింటిమీద భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి.
అసలు
భక్తి అంటే ఏమిటి?
కొంతమంది
భగవంతునియొక్క
విగ్రహాన్ని
చక్కగా పూలతో అలంకరించి, నైవేద్యాలను సమర్పించడమే భక్తి అని అనుకోవచ్చు.
కాని,
నిర్మలహృదయంతో
ఆ భగవంతుని సచ్చిదానంద దివ్య విగ్రహాన్ని మనసులో ధ్యానించడమే భక్తి.
అనగా మనం మన సద్గురువుయొక్క రూపాన్ని నిర్మలమయిన హృదయంతో
మనలో
నిలుపుకోవాలి.
వరిపైరుకు నీరు ఎంత ముఖ్యమో సాధన చేసేవారికి తమ గురువుపైన భక్తి కూడా అంతేముఖ్యం. భక్తి లేకుండా చేసే ఏకర్మలయినా సరే వర్షం లేని వ్యవసాయంలాగా నిరుపయోగం.
ఊరికే మన సద్గురువుకి పూజలు చేసి, ఆయన చరిత్ర పారాయణ చేసినంత మాత్రాన మనగురువు మీద మనం భక్తిని నిలుపుకోలేము. ఆయన మీద మనం ధృఢమయిన భక్తిని పెంపొందించుకోవాలి. సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలు.
“నాకు పూజా తంతుతో పనిలేదు. షోడసోపచారాలు అవసరం లేదు” అని. బాబా అలా చెప్పారు కదా అని మనం ఆయనకు అసలు పూజలే చేయకుండా వదలి వేయమని కాదు. ఆయన రూపాన్నే కళ్ళలో నిలుపుకొని మనసులో ధ్యానం చేయాలి. ఆయన చెప్పిన ఉపదేశాలను పాటిస్తూ ఉండాలి.
(ఎప్పుడయితే ఆయన ఉపదేశాలను పాటిస్తూ ఆయన మార్గంలో అనుసరించేవాడుg, తన సద్గురువుకు, తనకు మధ్య అడ్డు గోడ ఏమీ లేదనే స్థితికి చేరుకుంటాడు.
ఆవిధమయిన
భావన భక్తుని మనసులో ఎప్పుడయితే వస్తుందో ఇక పూజా తంతుతో పనిలేదు.
సద్గురువుకు,
భక్తుడు/శిష్యునికి మధ్య ఎటువంటి భేదం ఉండదు.)
నిత్యము గురుదేవుని రూపమునే స్మరింపవలెను. గురుదేవుని నామమునే సదా జపించవలెను. గురుదేవుని యొక్క ఆజ్ఞను పాటించవలెను. గురుదేవునికన్నను అన్యమైనదానిని భావించకూడదు.
గురుగీత శ్లో. 39
గురువుయొక్క రూపమే ధ్యానమునకు కారణం.
గురువుయొక్క
పాదమే పూజించుటకు కారణము.
గురువాక్యమే
మంత్రమునకు కారణము.
గురుకృపయే
మోక్షమునకు కారణము..
గురుగీత శ్లో. 86
ఏ శిష్యులు అన్యచింతలు లేనివారై సదా గురుమూర్తినే ఆరాధించుచుందురో అట్టివారు ఉత్కృష్టమైన సుఖమును సులభముగా పొందుచున్నారు.
కనుక
సర్వవిధముల గురుదేవుని సేవింపుము.
గురుగీత శ్లో.
42
(
శ్రీ సాయి సత్ చరిత్ర అ. 13 “ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో, వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెఱుగగలరు.
ఎల్లప్పుడు
‘సాయి సాయి’ అని స్మరించుచుండిన సప్తసముద్రములు దాటించెదను.)
ఉత్తమమైన భక్తుడు తన సద్గురువును గాని, భగవంతుడిని గాని ఎప్పుడూ మర్చిపోడు.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment