03.12.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 7 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
ప్రశ్న --- ఉపాసనీ మహరాజ్ గురించి ఏమయినా చెబుతారా?
జవాబు --- ఉపాసనీ మహరాజ్ గారు ఎప్పుడూ ఖండోబా మందిరం వద్దనే ఉండేవారు. ఆయన బాబాకు సన్నిహితంగా ఉండేవారు. ఆయన బాబాను మొట్టమొదటగా కలుసుకొన్న తరువాత ఖండోబా మందిరం వద్దనే నివసించడానికి వెళ్లారు.
ప్రశ్న --- బాబా గారు జీవించి ఉన్న కాలంలో ఏవిధమయిన కార్యక్రమాలు జరిగేవి?
జవాబు --- నాకు గుర్తున్నంతవరకు బాబా గారు జీవించి ఉన్న కాలంలో రెండే ఆరతులు జరిగేవి. ఒకటి ఉదయం 5 గంటలకు మరొకటి మధ్యాహ్న ఆరతి.
సాయంత్రం 4,
5 గంటల మధ్య కీర్తనలు పాడేవారు.
ప్రశ్న --- ఆరతి పూర్తయిన తరువాత బాబా ఏమి చేసేవారు?
జవాబు --- ఆయన భక్తులందరినీ ఆశీర్వదించి ఊదీని ఇచ్చేవారు. అక్కడ ఉన్న కొద్దిమంది భక్తులతో సంభాషించేవారు.
ప్రశ్న --- సాయిబాబా కూడా కీర్తనలు పాడేవారా?
జవాబు --- లేదు, ఆయన ఎప్పుడూ పాడలేదు. ఆయన కూర్చొని కీర్తనలు వినేవారు.
ప్రశ్న --- సాయిబాబా గారు ఉన్న కాలంలో జరిపిన అతి ముఖ్యమయిన పండగ ఏది?
జవాబు --- బాబా ఉన్న రోజులలో జరిపిన అతిముఖ్యమయిన పండగ రామనవమి.
ప్రశ్న --- ఆరోజుల్లో ముస్లిమ్ భక్తులు చాలా మంది ఉండేవారా?
జవాబు --- బాబా దర్శనం కోసం చాలా మంది ముస్లిమ్స్ షిరిడీకి వచ్చేవారు. వారిలో కొంతమంది ఇక్కడే ఉండి బాబాతో
సన్నిహిత సంబంధం పెట్టుకొని స్వయంగా ఆయనకు సేవ చేస్తూ ఉండేవారు. ఉదాహరణకు ఫకీర్ బాబా, మౌలానా బాబా, అబ్దుల్ బాబా ఉండేవారు. వారు నిరంతరం బాబాతోనే ఉండెవారు. మరొక ముస్లిమ్ భక్తుడు భాగూబాయ్ అని
ఒకతను ఉండేవాడు.
ప్రశ్న --- ఇప్పటికీ
చాలామంది ముస్లిమ్ భక్తులు ఉన్నారా?
జవాబు --- మందిరంలో బాబాను పూజించుకోవడానికి నేటికీ ముస్లిమ్స్
వస్తున్నారు.
ప్రశ్న --- బాబాగారు జీవించి ఉన్న రోజులలో ముస్లిమ్స్ ఆయనకు ఏవిధంగా పూజించేవారు?
జవాబు --- వారు బాబా పాదాలను ముట్టుకునేవారు. అంతకు తప్పించి ఇంకేమీ చేసేవారు కాదు. ఆయన ఉన్న కాలంలో హిందువులు, ముస్లిమ్ లు ఐక్యంగా ఉండేవారు.
ప్రశ్న --- చాలా కాలంపాటు బాబా తనను దేవునిగా పూజించడానికి ఇష్టపడేవారు
కాదన్న విషయం నిజమేనా?
జవాబు --- నిజమే, *** కాని కొంతకాలం తరువాత మార్పులు జరిగాయి. దాసగణు అని ఒకాయన ఉండేవాడు. ఆయన బాబా పాదాలను మాత్రమే పూజించేవాడు.
దాసగణుని
చూసి చాలామంది అదేవిధంగా పూజించడం ప్రారంభించారు. ఆవిధంగా బాబా పాదాలను పూజించడం మరింతగా పెరిగి అదే అందరికీ అలవాటుగా మారిపోయింది. బాబా మహాసమాధి చెందిన తరువాత ఆయనను
ఇంకా ఇంకా మరింత ఆడంబరంగా పూజించడం మొదలుపెట్టారు.
ప్రశ్న --- బాబా తనను పూజించడానికి ఇష్టపడకపోవడం గురించి మీరేమంటారు?
జవాబు --- నాకు తెలియదు.
ప్రశ్న --- సాయిబాబా గురించి మీ అభిప్రాయం?
ఆయన ఎవరు?
జవాబు --- బాబా సాక్షాత్తు భగవంతుడు.
మానవ రూపంలో ఉన్న భగవంతుడు.
ప్రశ్న --- బాబాతో మీకు కలిగిన విశేషమయిన అనుభవాన్ని ఏదయినా చెప్పగలరా?
జవాబు --- బాబా నాకు ఎన్నో అనుభవాలనిచ్చారు.
వాటిలో ఒక అధ్బుతమయినదానిని ఒకటి వివరిస్తాను. ఒకసారి నేను రూ.500/- ఒకరికి అప్పు చెల్లించవలసివచ్చింది. కాని అప్పు తీర్చడానికి నాదగ్గర ఒక్క పైసా కూడా
లేదు. అందువల్ల ఉదయం
బాబాకు పూజచేసే సమయంలో మౌనంగానే రోదిస్తూ ఉన్నాను. నోటంబట మాట రావడంలేదు. మౌనంగా పూజ ముగించాను. బాబా! అప్పుతీర్చడానికి నావద్ద పైకం
లేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి
తన డబ్బు తిరిగి ఇమ్మని అడిగితే నేనేమి చేయాలి? ఏమి చేయాలో అర్ధం కావడంలేదు. నువ్వే నాకు సహాయం చేయాలి బాబా అంటూ
మనసులోనే బాబాకు నాభాధ చెప్పుకుని వేడుకొన్నాను. నేను చాలా వేదన పడుతూ ఉన్నాను. సరిగ్గా అదేరోజు ఒక పార్సీ వ్యక్తి
నావద్దకు వచ్చి రూ.500/- ఇచ్చాడు. అతను
నాకెంత డబ్బు ఇచ్చాడొ కూడా నాకు తెలియదు. నేను ఇంటికివచ్చిన తరువాత లెక్కపెట్టుకుంటే
సరిగ్గా రూ.500/- ఉన్నాయి. ఆ వ్యక్తి డబ్బు ఇవ్వడంతో నేను నా
అప్పు తీర్చగలిగాను. బాబా నాసమస్యను అర్ధం చేసుకొని నాకు సహాయం చేసారు. ఆ తరువాత అతను ఇచ్చిన రూ.500/-
తిరిగి చెల్లించడానికి ఆపార్శీవ్యక్తి ఇచ్చిన చిరునామా ప్రకారం వెదికాను. కాని
అతను ఇచ్చిన చిరునామా లేనే లేదు. ఆగ్రామంలో అటువంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదని గ్రామస్తులు చెప్పారు. బాబా నాకు ప్రసాదించిన అసంఖ్యాకమయిన అనుభవాలలో ఇది ఒకటి.
(*** సాయిబాబా తనను పూజించమని తన హిందూ భక్తులను ఎప్పుడూ ప్రోత్సహించలేదు. ప్రతిరోజు తనకు ఆరతి ఇచ్చి పూజిద్దామనే భక్తుల ఆలోచలను
చాలా కాలంపాటు ప్రతిఘటించారు. కాని నిజానికి
భక్తుల క్షేమం కోసం, వారి హృదయ పూర్వకమయిన భక్తికి కట్టుబడి ఆయన సహనం వహించారు. కాలక్రమేణా భక్తులందరూ ఒక బృందంగా తనను ఆరాధించడానికి
అంగీకరించడం వల్ల మేఘా మరణించిన తరువాత అతని స్థానంలో ఆరతి ఇవ్వడానికి బాపూ సాహెబ్
జోగ్ కు స్పష్టమయిన సూచనలు ఇవ్వడానికి మార్గం చూపింది. అటువంటి వేడుకల సందర్బాలలో బాబా తన పూర్తి అసమ్మతిని
తెలియచేయడానికి, తిరస్కరించడానికి పూజా సామాగ్రిని విసిరివేయడం, ముక్కలు ముక్కలు చేయడం
చేసేవారు. భక్తులు తనని దేవునిగా భావించి పూజించడం, ఆవిధంగా పూజింపబడటంలోని గౌరవాన్ని పొందడానికి సత్పురుషులు
అంగీకరించకపోవడం ఈ రెండిటి మధ్య ఘర్షణవల్ల వారు తమ అసమ్మతిని తెలియచేయడానికి ఈ విరుధ్ధమయిన
ప్రవర్తన వారిలో అంతర్గతంగా ఉన్న ఉద్రిక్తతను స్పష్టపరుస్తుంది.)
(మరికొన్ని సంభాషణలు రేపటి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment