04.12.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి
శుభాశీస్సులు
సాయిబాబా – పరిశోధనా వ్యాస
గ్రంధము – 8 వ.భాగమ్
(రచయిత… శ్రీ ఆంటోనియో
రిగోపౌలస్ – ఇటలీ)
తెలుగు అనువాదమ్ :
ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫొన్ : 9440375411 & 8143626744
మైల్ ఐ.డి. tyagaraju.a@gmail.com
షిరిడీ – సాకోరీ – షిరిడి - గురువారము, అక్టోబరు, 17, 1985
ప్రశ్న --- బాబా మహాసమాధి చెందిన తరువాత షిరిడిలో ఏమి జరిగింది?
జవాబు --- తనకు ఇక మరణమాసన్నమయిందని తెలిసి, తాను తొందరలోనే
దేహాన్ని వీడుతున్నానన్న విషయం బాబా కొద్దిమందికి చెప్పారు. ఆసమయంలొ దాదాపు ఏడువేలమంది ప్రజలు షిరిడీలొ గుంపులు
గుంపులుగా సమావేశమయ్యారు. ప్రజలందరూ చాలా ఆందోళనకు
గురయ్యి ఏడవసాగారు. ఆప్రదేశమంతా చాలా గందరగోళంతో
నిండిపోయింది. ఆయన అంతిమయాత్ర ఎంతో వైభవంగా
జరిగింది. సుదీర్ఘమయిన యాత్ర జరిగింది. ప్రజలందరూ ఎంతగానో శోకించారు. ఆయన శరీరాన్ని బూటీవాడలో ఉంచారు. అదే ఇప్పటి సమాధి మందిరం. ఆప్పటినుండి ఆయన దేహం అక్కడే ఉంది.
ప్రశ్న --- మెహర్ బాబా గురించి ఏమయినా చెప్పగలరా?
జవాబు --- లేదు, ఆయన గురించి నాకసలు ఏమీ తెలియదు. ఆయన బాబాతో ఏడుసంవత్సరాలు ఇక్కడే ఉన్నారని మాత్రం
తెలుసు. వేడుకలు జరిగే సమయాలలో బాబా వాటిలో
పాల్గొంటూ ఉండేవారు. అంతే…
మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. మీ అనుభవాలను మాకు వివరించినందుకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను.
వారివద్దనుంచి శెలవు తీసుకునేముందు ఉధ్ధవగారిని, ఆయన భార్యను వారి ఇంటిముందు
ఫొటో తీసుకోవడానికి అనుమతి అడిగాను. వారు సంతోషంతో
అంగీకరించారు.
(ఉద్దవరావు దేశ్ పాండె తమ 92 వ.ఏట, 1998 వ.సంవత్సరంలో మరణించారు)
సతీ గోదావరి మాత (1914 – 1990) భక్తుడయిన శ్రీ శంకర్ గోరవకె
తో ముఖాముఖీ సంభాషణ.
ప్రశ్న --- కన్యాకుమారి స్థాన్ గురించి, దాని చరిత్ర గురించి
సంగ్రహంగా చెబుతారా?
జవాబు --- గత రెండు సంవత్సరాలుగా నేను ఇక్కడికి రావడం ప్రారంభించాను. ఈ సాకూరి స్థాన్ గురించి పూర్తిగా తెలుసుకోదలిస్తే
మీకు మరాఠీ, హింది, ఆంగ్ల భాషలలో పుస్తకాలు చాలా దొరుకుతాయి.
ప్రశ్న --- కన్యాకుమారి స్థాన్ లో ఎంతమంది నన్స్ ఉంటున్నారు?
జవాబు --- ప్రస్తుతం 53 మంది కన్యలు ఉన్నారు. వారందరూ గోదావరి మాత మార్గదర్శకత్వంలో ఉన్నారు.
ప్రశ్న --- ఉపాసనీ మహరాజ్ గారి గురించి ఏమయినా చెబుతారా?
జవాబు --- ఆయనను సాకోరికి షిరిడి బాబా గారు పంపించారు. ఆయన ఇక్కడ 1941వ.సంవత్సరంలో దేహాన్ని చాలించారు. ఆయన సాయిబాబా వద్దనుంచి జ్ఞానసిధ్ధిని పొందారు. ఆయన షిరిడిలో నాలుగు సంవత్సరాలు ఉన్నారు. సాయిబాబా ద్వారా ఆయనకు ఆత్మజ్ఞానం లభించింది. సాయిబాబా గారు ఉపాసనీ బాబాకు గురువు. శిక్షణ పూర్తయిన తరువాత సాయిబాబా, ఉపాసనీ గారితో
షిరిడి విడిచి తనకిష్టమయిన ప్రదేశానికి వెళ్ళి ఉండమని చెప్పారు. తదనంతరం ఉపాసనీ బాబా ఒకటి, రెండు సంవత్సరాలపాటు
మహారాష్ట్ర అంతటా పర్యటించారు. రెండు సంవత్సరాల
తరువాత ఆయన ఈ సాకోరి గ్రామానికి వచ్చి ఇక్కడే
ఉండిపోయారు. ఆయన ఉండటానికి స్థలం కేటాయించబడింది. అప్పుడాయన దత్తమందిరాన్ని నిర్మించి సంస్థాన భవనం
కట్టి అందులోనే నివశించారు. ఆరోజుల్లో ఇక్కడ
ఏమీ లేవు. ఇపుడు ఇక్కడ దత్తమందిరం ఉన్నప్రదేశం
అంతకుముందు ఎందుకూ పనికిరాని బంజరు భూమి. ఎటువంటి
చెట్లు గాని, ఇండ్లు గాని లేవు. ఉపాసనీ బాబా
ఆరోజుల్లో ఒక గుడిసెలో ఉండేవారు. ఆతరువాత ఇక్కడ ఒక దత్తమందిరాన్ని నిర్మించమని ఆయనకు
సలహా ఇచ్చారు.
శ్రీ శంకర్ గోరవకే ఇంకా చెప్పిన వివరాలు…
ప్రతిచోట యజ్ఞాలు చేస్తారన్న విషయం మీకు తెలుసు. యజ్ఞాలు చేయడంలోని ముఖ్యోద్దేశం, దేశం సుభిక్షంగా
ఉండాలన్నదే. దేశప్రజలందరూ స్వఛ్చమయిన జీవితాన్ని
గడపాలి. అపుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలందరూ మంచి ఫలాలను అందుకుంటారు. యజ్ఞాలద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆవిధంగా ప్రజలందరూ యజ్ఞాలను నిర్వహించడానికి ప్రోత్సహించాలి. అప్పుడే ప్రజలందరిలోను, హిందువులు, ముస్లిమ్స్,
శిక్కులు, క్రైస్తవుల మధ్య ఎటువంటి విభేదాలకు, ఉద్రిక్తలకు ఆస్కారం ఉండదు. ఎవరూ ఒకరితో ఒకరు కోట్లాడుకోరు. అందరూ ఒకటే అనే సమత్వభావంతో కలిసిమెలసి ఉంటారు. ప్రతీ కులంలోని వారు దేశాన్ని పురోగతిలోకి తీసుకురావడానికి
కృషి చేయాలి. అప్పుడే మన భారతదేశం ప్రపంచం
మొత్తానికి ఆదర్శప్రాయమవుతుంది. ఆవిధంగా యజ్ఞాలు
చేయడంలోని ఉద్దేశ్యం, ప్రధాన లక్ష్యం నెరవేరుతాయి.
ఇక్కడ సంస్థానంలో యజ్ఞాలను స్త్రీలు, కన్యలు మాత్రమే నిర్వహిస్తారు. కన్యలు నివశిస్తున్న ఈ ప్రదేశంలోకి పురుషులకు ప్రవేశార్హత
లేదు.
ప్రశ్న --- ఇటువంటి విధానం భారతదేశం మొత్తంమీద ఇక్కడే ఉందా?
జవాబు --- అవును, ఇక్కడ ఒక్కచోటే ఈ విధంగా జరుగుతూ ఉంది. కన్యలు గాని, స్త్రీలు గాని యజ్ఞాలు చేయడం, మంత్రాలు
చదవడం మీకెక్కడా కనిపించదు.
ప్రశ్న --- మంత్రాలు అంటే ప్రాచీనమయినవా? వేదమంత్రాలా?
జవాబు --- భారతదేశంలో ఇటువంటి ప్రదేశం మరెక్కడా లేదు. ఇది ఒక్కటే.
(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment