Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, December 6, 2020

సాయిబాబా – పరిశోధనా వ్యాస గ్రంధము – 9 వ.భాగమ్

Posted by tyagaraju on 8:06 AM

 


06.12.2020  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

సాయిబాబాపరిశోధనా వ్యాస గ్రంధము – 9 .భాగమ్

(రచయితశ్రీ ఆంటోనియో రిగోపౌలస్ఇటలీ)

తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు

నిజాంపేట, హైదరాబాద్

ఫొన్ : 9440375411 & 8143626744

మైల్ ఐ.డి.  tyagaraju.a@gmail.com

షిరిడీసాకోరీషిరిడి -  గురువారము, అక్టోబరు, 17, 1985

ప్రశ్న   ---   సతీ గోదావరి మాత ఉపాసనీ బాబాగారి ఆదర్శ కార్యక్రమ లక్ష్యాన్ని నెరవేర్చారా?

జవాబు   ---   ఉపాసనీ గారు జీవించి ఉన్నపుడే సతీ గోదావరిమాత సాకోరికి వచ్చారు.  ఆమె మొట్టమొదటగా ఇక్కడికి వచ్చినపుడు ఆమె వయస్సు పదకొండు సంవత్సరాలు.  షేన్ గావ్ ఆమె జన్మస్థలం.  ఆమె అక్కడ జన్మించి, అక్కడినుండి ఉపాసనీ మహరాజు గారిని కలుసుకోవడానికి తన ఇద్దరు సోదరీమణులు, తల్లిదండ్రులతో కలిసి ఇక్కడికి వచ్చింది.  ఉపాసనీగారు అమ్మాయిలను కన్యలుగానే సాకోరిలో ఉండిపొమ్మని చెప్పారు.  వారి తల్లి, తండ్రి ఇద్దరూకూడా అలాగేనని మాట ఇచ్చారు.  ఆవిధంగా సతీ గోదావరి మాత, ఆమె కుటుంబంతో సహా ఇక్కడ సాకోరీలోనే ఉండిపోయారు.  అపుడు సతీ గోదావరి మాత వయస్సు పది లేక పదకొండు సంవత్సరాలు ఉంటుంది.  ఆమె కుటుంబం కూడా ఆమెతోనే ఉండిపోయింది.  ఆమె ఇద్దరు సోదరీమణులు కూడా ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు.


ప్రశ్న   ---   వారు నన్సా?  (కన్యలా)

జవాబు   ---   అవును.  వారి తల్లి సంవత్సరంన్నర క్రితమే కాలం చేసింది.  ఆమె తన జీవితమంతా ఇక్కడే గడిపింది.  ఉపాసనీ బాబాగారి తల్లి కూడా ఇక్కడే నివసించారు.  ఉపాసనీ గోదావరిమాతకు గురువు.  ఆయన ఆమెకు నాట్యం, సంగీతం, మంత్రాలు మొదలయినవెన్నో నేర్పారు.  సంగీతంలోను, నాట్యంలోను, మంత్రాలలోను మంచి నైపుణ్యంఉన్న కొంతమంది పురుషులను తీసుకువచ్చి కన్యలకు అన్నీ నేర్పించారు.  ఇక్కడ ఉన్న కన్యలందరూ పాడగలరు, నాట్యం చేయగలరు.  కన్యలందరూ సంగీతంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు.

ప్రశ్న   ---   ఉపాసనీగారు మరణించినపుడు ఏమి జరిగింది?  ఆయన ఏసంవత్సరంలో మరణించారు?

జవాబు   ---   ఆయన దేహాన్ని చాలించి స్వర్గానికి వెళ్ళారు.  ఆయన శిష్యురాలయిన మాతాజీగారే సంస్థానం వ్యవహారాలన్నింటిని నిర్వహించారు.  ఈనాటికీ అన్ని వ్యవహారాలను ఆమే పర్యవేక్షిస్తున్నారు.

ప్రశ్న   ---   ఉపాసనీ మహరాజ్ గారు గోదావరి మాతాజీగారు ఇద్దరూ చేసే బోధనలలో ఉన్న భేదాలను గురించి మీరేమన్నా చెప్పగలరా?  ఉదాహరణకి గోదావరి మాతాజీ చాలా మృదుస్వభావి అయితే ఉపాసనీ మహరాజ్ చాలా కఠినంగా ఉండేవారని నేను చదివాను…

జవాబు   ---   దీనికి సమాధానం ఏమిచెప్పాలో నాకు తెలియదు.

శ్రీ శంకర్ గోరవాకె చెప్పిన వివరాలు…

సాకోరోలో ఏడు ముఖ్యమయిన యజ్ఞాలు జరుగుతున్నాయి.  మార్చి నెలలో మొట్టమొదటి యాగం మొదలవుతుంది.  అది శ్రీరామ యాగం.  అది ఏడు రోజులపాటు జరుగుతుంది.  రెండవ యాగం ఏప్రిల్ నెలలో అయిదురోజులపాటు జరుగుతుంది.  జూన్ నెలలో మూడవయాగం నిర్వహించబడుతుంది.  దాని పేరు గురుయాగం.  అది ఏడురోజులపాటు జరుగుతుంది.  ఆగస్టు నెలలో జరిగే నాలుగవయాగం గణేష్ యాగం.  గణేష్ చతుర్ధి ఉత్సవాల రోజులలో దానిని నిర్వహిస్తారు.  ఆయాగం పది, పన్నెండు రోజులపాటు జరుగుతుంది.  ఇపుడు ఈ అక్టోబరు నెలలో మేము నిర్వహిస్తున్న యాగం అయిదవది.  దీనిపేరు శతచండి యాగం.  ఇది తొమ్మిది, పదిరోజులపాటు జరుగుతుంది.  జనవరి నెలలో జరిగే ఆరవయాగం సూర్యయాగం.  దానిని పదిహేనురోజులపాటు నిర్వహిస్తారు.  సాకోరీలో నిర్వహించబడే అతిపెద్ద యాగం ఇదే.  ఇక ఏడవయాగం ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు.  అది రుద్రయాగం.  అది అయిదురోజులపాటు జరుగుతుంది.  సాకోరీలో ప్రతిసంవత్సరం నిర్వహిస్తున్న ఏడు యాగాలు ఇవి.

ప్రశ్న   ---   ఒక యాగం చేయడానికి ఎంత ఖర్చవుతుంది?  ఉదాహరణకి ఈ అక్టోబరు నెలలో నిర్వహించబోయే యాగానికి ఎంతఖర్చవుతుంది?

జవాబు   ---   యాగం ఎన్నోరోజులపాటు జరుపుతారు, వాటికి కావలసిన సామగ్రి వీటన్నిటిమీదా ఆధారపడి ఖర్చు ఉంటుంది.  కొన్ని యజ్ఞాలు అయిదు రోజులపాటు నిర్వహిస్తారు.  మిగిలినవి ఏడురోజులపాటు జరుపబడతాయి.  ఏమయినా గాని ఈ అక్టోబరులో జరగబోయే యాగానికి మేము ఏడువేలరూపాయల దాకా ఖర్చుపెట్టాము.

ప్రశ్న   ---    యాగానికి కావలసిన సామాగ్రికి, సరంజామాకి అధికంగా అయ్యే ఈ ఖర్చు మీరే భరిస్తున్నారా?

జవాబు   ---   లేదు, లేదు,  దీనికయే ఖర్చంతా మాకుటుంబాలవారమే భరిస్తాము.  ఈ యాగానికి కావలసిన ధనం మూడు కుటుంబాలవారం భరిస్తున్నాము. 

బయటినుండి ఎవరో చెప్పిన వివరం…

యజ్ఞాలకు కావలసిన వస్తువులన్నిటినీ ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న కుటుంబాలన్నీ సమకూరుస్తున్నాయి.

ప్రశ్న   ---   యాగానికి అవసరంగా కావలసినవి ఏమిటి?

జవాబు   ---   చాలా చాలా ఉన్నాయి.  ఉదాహరణకి జంతువులు.

మీరు టిప్నిస్ గారిని అడగండి.  యాగాలకి కావలసిన సామాగ్రి, దాని నిర్వహణ బాధ్యతలను ముఖ్యంగా ఆయనే చూస్తున్నారు.  వాటికి అవసరమయినవి ఏమేమి ఉంటాయో ఖచ్చితమయిన సమాచారం ఆయన ఇస్తారు.

నేను (ఆంటోనియో)   ---   అయితే నేనర్ధం చేసుకొన్నంతవరకు ఇది చాలా వ్యయంతో కూడుకున్నది, అవునా?

జవాబు   ---   నిజమే చాలా ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం

నేను (ఆంటోనియో)   ---   ధన్యవాదాలు.

(ఇంకా ఉంది)

(రేపటి సంచికలో తుకారాం రఘుజీవ్ గారితో ముఖాముఖీ.  1917 లో ఆయన మొదటగా బాబాను కలుసుకున్నపుడు ఆయన వయస్సు 14 సంవత్సరాలు)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List